గర్భిణీని పాము కరిచినట్లు కల వస్తే ఏమవుతుందో తెలుసా?

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

కలలో పాములు కనబడితే మంచిదేనా? అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే చాలా వరకు మంచిదే. మరి ఇలాంటి కలలు గర్భిణీలకు వస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాలు చాలామందికి తెలియదు. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందోనని చాలామంది గర్భిణీలు అయోమయం చెందుతుంటారు. కలలో రకరకాల రంగులు పాములు కనిపించినా.. అవి కాటు వేసి వెళ్లిపోయినట్లు కల వచ్చినా.. గర్భిణీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వీటి వల్ల భవిష్యత్తులో వారికి మంచి జరుగుతుందని అర్థం. మరి ఒక్కో కలకు ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుుకోవాలంటే చదవండి మరి.

1. ఆకుపచ్చపాము

1. ఆకుపచ్చపాము

గర్భిణీలకు కలలో ఆకుపచ్చని పాము కనిపిస్తే కొన్నిరకాల విషయాలకు సూచన. గర్భంలోని బిడ్డ ఆరోగ్యకరంగా ఉందని అర్థమట. ఆకుపచ్చరంగు అనేది సంతోషానికి చిహ్నంలాగా ఉంటుంది. అందువల్ల ఆకుపచ్చపాము గర్భిణీలకు కలలో కనిపిస్తే మంచి కలుగుతుందని నమ్మకం.

2. ఎరుపు రంగు పాము

2. ఎరుపు రంగు పాము

ఇక కలలో గర్భిణీలకు ఎరుపు రంగులో పాము కనపడితే... ఆమె స్నేహితుల్లో ఒకరికి లేదా ఆమెకు సంబంధించిన బంధువుల్లో ఎవరికైనా పెళ్లి లేదా ఎంగేజ్ మెంట్ అయ్యే సూచనలున్నాయని అర్థం. అంతేకాకుండా ఆ గర్భిణీకి మంచి రోజులు రానున్నాయనడానికి ఇది సంకేతం. ఆమె చాలా లక్కీ అని కూడా అనుకోవొచ్చు.

3. నల్ల పాము

3. నల్ల పాము

గర్భిణీలకు కలలో ఒక పెద్ద నల్ల పాము కనిపిస్తే దానికి కూడా ఒక సంకేతం ఉంది. ఆ గర్భిణీకి అబ్బాయి జన్మిస్తాడని అర్థం. అంతేకాకుండా ఆమెకు పుట్టబోయే కుమారుడు చాలా ప్రతిభావంతుడిగా మారుతాడని దీని అర్థం. ఇక ఎప్పుడైనా గర్భిణీలకు నల్లపాము కనిపించిదంటే ఏం భయపడకండి.

4. తెల్ల పాము

4. తెల్ల పాము

గర్భిణీలకు కలలో తెల్లని పాము కనిపిస్తే ఆమెకు కూతురు పుడుతుందని అర్థం. మీకు తెలిసిన ప్రెగ్నెంట్స్ ల్లో ఎవరికైనా కలలో ఇలా తెల్లపాము కనిపిస్తే వారికి ఆడపిల్ల పుట్టనుందని చెప్పండి.

5. పాము కరిచినట్లుగా..

5. పాము కరిచినట్లుగా..

ఇక గర్భిణీలు.. పాము కరిచినట్లు కలగంటే.. అది కూడా కొన్ని విషయాలకు సంకేతం. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అర్థం. అలాగే ఆమె లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉంటుందని అర్థం. పాము కరిచినట్లు కలలో వస్తే అది చెడు శకునంకాదు.

Read more about: life, astrology, లైఫ్
English summary

meaning of snakes dream during pregnancy

check out what do the different coloured snakes and other snake related dreams during pregnancy signify, as the colour of the slithering creature can affect the overall explanation.
Story first published: Tuesday, November 21, 2017, 17:30 [IST]
Subscribe Newsletter