సీసాలలో దొరికిన వింత, రహస్య సందేశాలు!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రపంచంలో ఎవరో ఒకరు చదువుతారనే నమ్మకంతో. జనాలు కాగితం మీద సందేశాలు రాసి సీసాల్లో పెట్టి సముద్రంలో కి విసిరేసేవారు సీసా దొరికి అందులో సందేశాలు చదివి జీవితాలు అనుకూలంగా మారిన వాళ్ళు అద్రుష్టవంతులే ,కానీ కొన్ని సార్లు చదివిన సందేశాలు కొందరిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.

పంపిన సందేశాలు అన్ని చాలావరకు నిజాలే అయినప్పటికీ కొన్ని సరదాకి కూడా పంపిస్తారు. సీసాలో కనిపించే సందేశాలు మంచి వార్తలు లేక చెడు వార్తలే కాకుండా కొన్ని చివరి దాక ఉండే ప్రేమ, స్నేహం లాంటి భావాలు ప్రకటించేవి కూడా ఉంటాయి. అవి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తాయి.

అక్కడికి మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు ? ఎందుకు ?

కనుక గతంలో సీసాలో దొరికిన కొన్ని సందేశాలని మేము ఇక్కడ పంచుకోడానికి వచ్చాం,ఈ కింద చదవండి.....

టైటానిక్ నుంచి సందేశం:

టైటానిక్ నుంచి సందేశం:

టైటానిక్ నుంచి సందేశాలు పంపేంత సమయం కానీ సమయస్పూర్తి కానీ ఉందా, అని చాలామంది ఆశ్చర్యపోతారు.ఈ మధ్య కాలంలో,బోస్టన్ లో ఉన్న తన కుటుంబాన్ని కలవడానికి తన చెల్లి తో ప్రయాణించిన ఒక యువ ఐరిష్ దేశస్తుడు చావు బ్రతుకుల మధ్య రాసిన సందేశం దొరికింది.తను ఇంటికి చేరుకోలేకపోవడం వల్ల ఆ సందేశం మునిగిపోయిన పడవలోనే ఉంది. ఆ సందేశం ఎంటంటే:

"టైటానిక్ నుంచి, అందరికి వీడుకోలు,బుర్కే ఆఫ్ గ్లాన్మిర్ , కార్క్."

మునిగిపోతున్న నావ నుంచి వచ్చిన సందేశం..

ఆయనకి,కాగితం మీద రాసి,దాని భద్రంగా చుట్టి, సీసాలో పెట్టి సముద్రంలో సరిగ్గా పడేయడానికి సరిపోయేంత సమయం లేదని గ్రహించాడు.అందుకే ఈ సందేశం అసంపూర్ణం గా ఉంది.

"డెక్ మీద కొందరు మనుషులతో ఉన్నా. చివరాఖరి పడవలు మాత్రమే ఉన్నాయి.చాలా తొందరగా మునిగిపోతున్నాము.నా దగ్గర ఉన్న కొందరు మనుషులు దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.అంతం దగ్గర పడింది.బహుశ ఈ సందేశం..."

అప్రసిద్ధమైన నాజి కాన్సెంట్రేషన్ కాంప్ నుంచి దొరికిన సీసా

అప్రసిద్ధమైన నాజి కాన్సెంట్రేషన్ కాంప్ నుంచి దొరికిన సీసా

కొన్ని సందేశాలు పొందుపరిచి ఉన్న సీసాలు నీళ్ళలోనే కాకుండా నేల మీద కూడా దొరికాయి.ఒక సందేశం ఉన్న సీసా సెప్టెంబర్ 9,1944 న రాయబడి ఉంటే, 2009 లో కనుగొన్నారు.అది ఒక అసహాయంగా ఉన్న క్యాంప్ వ్యక్తి , 7 పురుషుల బందీల గుడారాల సంఖ్యలు మరియు వారి సొంత ఊర్ల వివరాలు రాసాడు.

మిమ్మల్ని ఆశ్చర్యపరిచే.. నమ్మలేని ట్రెండ్స్

ఆఖరి సందేశం:

ఆఖరి సందేశం:

థామస్ హ్యూజ్స్ అనే ఒక యువ బ్రిటీష్ సైనికుడు విధిలో ఉండగా తన భార్య కి ఎంతో అందమైన సందేశం రాసాడు.అది అతను సముద్రంలో కి విసిరేసాడు కానీ,తన భార్య కి మాత్రం చేరలేదు.

థామస్ ఈ సందేశం రాసిన రెండు రోజులకే చనిపోయాడు.ఆ సందేశం ఏంటంటే :

థామస్ ఈ సందేశం రాసిన రెండు రోజులకే చనిపోయాడు.ఆ సందేశం ఏంటంటే :

"ప్రియమైన భార్యకి, నేను ఈ సందేశం నీకు చేరుతుందో లేదో చూడటానికి ముందే దీన్ని సముద్రంలో పడేస్తున్నాను.ఇది కనుక చేరితే,ఈ లేఖ కుడి చివర భాగంలో నీ పేరు, ఇది చేరిన తేది, నీ సంతకం చేసి పొందుపర్చుకో . ఇప్పటికి సెలవు ప్రియా..నీ భర్త."

రోదిస్తున్న తల్లి ఇచ్చిన సందేశం:

రోదిస్తున్న తల్లి ఇచ్చిన సందేశం:

"మౌరీస్" అనే యువతి తన పదమూడేళ్ళ కొడుకుని పోగుట్టుకుంది.ఆ భాధని అధిగమించడానికి, ఆమె ఒక సందేశం రాసి, సముద్రంలో పడేసింది.ఆ సందేశం ఏమిటంటే:

"నీ అదృశ్యం తో నాకు కలిగిన కోపానికి నన్ను క్షమించు.నేను ఇంక ఏదో తప్పు జరిగి ఉంటుందనే నమ్ముతున్నాను. దాన్ని దేవుడు సరి చేసేదాకా నిరీక్షిస్తూ ఉంటాను...నిన్ను చావు నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియనందుకు నన్ను క్షమించు.నువ్వు నా చేతుల నుంచి జారిపోతున్నపుడు ఏం మాట్లాడాలో తెలియనందుకు నన్ను క్షమించు."

English summary

Messages People Found In Bottles

Messages People Found In Bottles,Some of these messages that people left in bottles at their last moments will truly haunt anyone!
Story first published: Wednesday, November 22, 2017, 18:00 [IST]
Subscribe Newsletter