మ‌న దేశంలో ఉన్న ఈ మిస్ట‌రీ ప్ర‌దేశాల‌ను అస్స‌లు ద‌ర్శించ‌కండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న దేశం ఎన్నో విఖ్యాతి గాంచిన స్మార‌క క‌ట్ట‌డాల‌కు, దేవాల‌యాల‌కు, చారిత్ర‌క ప్ర‌దేశాల‌కు, ర‌హ‌స్య ప్ర‌దేశాల‌కు నిల‌యం. ఇవే కాదు మ‌న దేశంలో ఎన్నో భ‌యంక‌ర‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఒక కొల‌ను నిండా ఎముక‌ల గూళ్లు ఉన్న ప్ర‌దేశం, మ‌రొక చోట కాప‌ల‌దారుల‌ను భ‌య‌పెట్టే భూతాలు, మ‌రో ప‌క్క ప‌క్షుల‌న్నీ ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌దేశం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

మ‌న దేశంలో ఒక ప‌ట్ట‌ణముంది. ఇది నిషిద్ధ ప్రాంతం. దీంట్లోకి సాయంత్రం 6 త‌ర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమ‌తించ‌రు.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన 10 ప్రదేశాలు..

Mysterious Places Of India You Need To Avoid Visiting

కొన్ని వేల‌, ల‌క్ష‌ల ప్ర‌దేశాలున్న ఈ దేశంలో వంద‌ల సంఖ్య‌లో నిషిద్ధ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటి గురించి విన్నా, అక్క‌డికి వెళ్లినా వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. వాటి గురించి తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే లేదా భ‌యంతో అర‌వాల్సిందే.

ఇక్క‌డ కొన్ని ప్ర‌దేశాల‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం. అక్క‌డికి మీరు అస్స‌లు వెళ్ల‌కండి. అయినా మా మాట మీరెందుకు వింటారు లెండి! మీరు సాహ‌సవంతులు, ధైర్య‌వంతులు...

1. బ్రిజ్ రాజ్ భ‌వ‌న్ ప్యాలెస్‌

1. బ్రిజ్ రాజ్ భ‌వ‌న్ ప్యాలెస్‌

ఈ రాజ‌మ‌హ‌ల్‌లో ఉన్న కాప‌లాదారులను ఒక భూతం ఎడాపెడా వాయించేస్తుంద‌ట‌. రాజ‌స్థాన్‌లోని కోట‌లో ఉందీ ప్యాలెస్‌. ఇక్క‌డో భూతం ఉంటుంది. అయితే ఇదేమీ హాని చేయ‌ద‌ని అంటారు. 1857లో బ్రిటీష్ పాలన ఉన్నకాలంలో మేజ‌ర్ బ‌ర్ట‌న్ అనే వ్య‌క్తిని అది దారుణంగా హ‌త్య‌చేశార‌ట‌. అత‌డి ఆత్మే ఇలా రాజ్‌మ‌హ‌ల్‌లో తిరుగుంద‌ని జ‌నాలు అంటారు. 178 ఏళ్లుగా బొమ్మాలి నిన్నొద‌లా అంటూ రాజ్‌మ‌హ‌ల్‌లో తిరుగుతూ ఉన్నాడ‌ట‌. విధుల్లో ఉన్న అనేక మంది కాప‌లాదారుల‌ను కొట్టిన‌ట్టు కూడా చెబుతారు.

2. మార్కోన‌హ‌ళ్లి డ్యామ్‌

2. మార్కోన‌హ‌ళ్లి డ్యామ్‌

బెంగ‌ళూరుకు వెళ్లేదారిలో ఈ డ్యామ్ ఉంటుంది. బైక్‌లో ఈ డ్యామ్ దాటి వెళ్లేవారికి చుక్క‌లు క‌నిపిస్తాయిట‌. ఈ డ్యామ్ గుండా వెళ్లేవారి బైక్ హ‌ఠాత్తుగా ఆగిపోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఎంతో మంది చెప్పారు. వారు త‌మ బైక్‌ను తోసుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చేద‌ని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇక్క‌డో మ‌హిళ‌ను పూడ్చిపెట్టార‌ట‌. ఆమె ఇలా ఆత్మ అయి అంద‌రినీ ఇబ్బంది పెడుతుంద‌ని అంటారు.

3. బ‌న్‌గ‌ఢ్, రాజ‌స్థాన్‌

3. బ‌న్‌గ‌ఢ్, రాజ‌స్థాన్‌

బ‌న్‌గ‌ఢ్‌లో సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ప్ర‌వేశం నిషిద్ధం. ఇక్క‌డ దెయ్యాలు తిరుగుతాయ‌ని చెప్పి అధికారికంగా ఈ ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. రాత్రి వేళ‌లో ఈ ప్రాంతంలోనికి వెళ్లిన‌వారు ఇక తిరిగి రాలేద‌ని ఎంద‌రో చెబుతారు. ఒక మాంత్రికుడు ఈ ప‌ట్ట‌ణాన్ని శ‌పించాడ‌ని అంటారు. బ‌న‌గ‌ఢ్‌లో చోటుచేసుకున్న వింత వింత సంఘ‌ట‌న‌ల గురించి అనేక క‌థ‌నాలు టీవీలోనూ వ‌చ్చాయి. చాలా మంది ఇక్క‌డ జ‌రిగిన వింత‌ సంఘ‌ట‌న‌లు స్వ‌యంగా చూసిన‌ట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో ఇంత అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులున్నా ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రంగా ప్ర‌సిద్ధి చెందింది.

4. డి సౌజా చావ‌ల్‌, మాహిమ్‌

4. డి సౌజా చావ‌ల్‌, మాహిమ్‌

ఇక్క‌డ వింత వింత సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయ‌ని చెబుతారు. ఓ క‌థ‌నం ప్ర‌కారం ఒక మ‌హిళ ఇక్క‌డి నీళ్ల‌లో ప‌డిపోయి స‌హాయం కోసం ఆర్త‌నాదాలు చేసింద‌ని చెబుతారు. అక్క‌డి బావి ద‌గ్గ‌ర‌కి వెళ్లిన‌ప్పుడు చాలా మందికి ఆత్మ ఏడ్చిన‌ట్టుగా వినిపించింద‌ని అంటారు. ముంబ‌యిలో ఉండేవారు సాధార‌ణంగా ఈ ప్ర‌దేశాన్ని చూసేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

5. జీపీ బ్లాక్ , మీర‌ట్‌

5. జీపీ బ్లాక్ , మీర‌ట్‌

మీర‌ట్‌లో ఉన్న జీపీ బ్లాక్‌లో విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయ‌ని చెబుతారు. పారా నార్మ‌ల్ సంఘ‌ట‌న‌లు చూడ‌డం ఇష్ట‌ప‌డేవారికి ఈ ప్ర‌దేశం న‌చ్చి తీర‌వ‌చ్చు. న‌లుగురు స్నేహితులు ఒక కొవ్వొత్తి వెలుగులో మ‌ద్యం సేవించ‌డాన్ని చాలా మంది చూసిన‌ట్టుగా చెబుతారు. ఈ న‌లుగురు అబ్బాయిలు అక్క‌డికి వ‌చ్చేవారికి హాని త‌ల‌పెడ‌తార‌ని అంటారు. మ‌రికొంద‌రు అక్క‌డ తాము ఎర్ర‌ని చీర‌లు క‌ట్టుకున్న ప‌డుచు పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి తిరుగుతార‌ని అన్నారు.

సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ..!! ఎందుకు ?

6. డూమ‌స్ బీచ్‌, సూర‌త్‌

6. డూమ‌స్ బీచ్‌, సూర‌త్‌

గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో డూమ‌స్ బీచ్ ఉంది. దీన్ని న‌లుపు రాతి (బ్లాక్ సాండ్‌) బీచ్‌గా పిలుస్తారు. అనేక భ‌యాన‌క సంఘ‌ట‌న‌ల‌కు ఇది ప్ర‌సిద్ధి. ఈ అంద‌మైన ప్రాంతాన్ని సందర్శించేట‌ప్పుడు చాలా మంది త‌మ ప్రాణాలు కోల్పోయార‌ట‌. ఒక‌ప్పుడు ఇక్క‌డ హిందువుల స‌మాధులు ఉండేవ‌ట‌. వాటికి సంబంధించిన ఆత్మ‌లే ఇక్క‌డ తిరుగుతాయ‌ని చెబుతారు. బీచ్‌లో కొంచెం దూరం వ‌ర‌కే అనుమ‌తిస్తారు. దాన్ని దాటి లోప‌లికి వెళ్ల‌డం నిషిద్ధం. అక్క‌డికి వెళ్లిన‌వారు తిరిగి రాలేద‌ని అంటారు.

7. జ‌తింగా

7. జ‌తింగా

అస్సాంలోని జ‌తింగా అనే గ్రామంలో వేలాది ప‌క్షులు వ‌చ్చి చ‌నిపోతుంటాయి. చంద్రుడి వెలుతురు లేని రాత్రుల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 మ‌ధ్య‌లో ఎక్కువ‌గా ప‌క్షులు చ‌నిపోతాయ‌ని చూసిన‌వారు చెబుతారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో ఇలా జ‌రుగుతుంద‌ని అంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా ప‌క్షులు చ‌నిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను క‌నుగొన‌లేక‌పోయారు.

8. అగ్ర‌సెన్‌కీ బౌలి

8. అగ్ర‌సెన్‌కీ బౌలి

దిల్లీలో ని క‌న్నాట్ ప్లేస్‌కు స‌మీపంలో ఉన్న హెయిలీ రోడ్డులో అగ్ర‌సెన్‌కీ బౌలి ఉంది. ఇక్క‌డ అనేక పారానార్మ‌ల్ యాక్టివిటీస్ జ‌రుగుతాయ‌ని అంటారు. ఇక్క‌డి స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం దీన్ని 14వ శ‌తాబ్దంలో మ‌హారాజ అగ్ర‌సేన నిర్మించాడ‌ని చెబుతారు. అగ్ర‌సేన్‌కీ బౌలి న‌ల్ల నీటితో నిండి ఉంటుంది. అది మ‌నుషుల‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపింప‌జేస్తుంద‌ని అంటారు. అక్క‌డికి ఎంతో మంది వ‌చ్చి చ‌నిపోయిన‌ట్లు నివేదిక‌లు న‌మోద‌య్యాయి. ఇది నిషిద్ధ ప్రాంత‌మైనా ఇక్క‌డికి అనేక మంది ప‌ర్యాట‌కులు వ‌చ్చిపోతుంటారు.

English summary

Mysterious Places Of India You Need To Avoid Visiting

With thousands and lakhs of places in India, this culturally rich country is also known to have hundreds of ghostly places that will give your spine a chilling experience. These places will leave your eyes wide open or will freak you out! So, here we mention to you some of the mysterious places in India that you should certainly avoid visiting.
Subscribe Newsletter