For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్మల సీతారామన్: భారతదేశంలో రెండవ మహిళా రక్షణ మంత్రి

By Lakshmi Perumalla
|

నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాక దేశం స్థిరమైన పురోగతి సాధించింది. ప్రభుత్వం బాగా పనిచేయటం వలన ప్రజల మన్ననలను పొందటంలో నరేంద్ర మోడీ సఫలం అయ్యారు. ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభించాయి.

ఆర్మీ ఆఫీసర్ నుండి మిస్ ఇండియా 2017 వరకు షాలిని సింగ్ విజయ ప్రస్థానం ఎంతో మందికి ప్రేరణఆర్మీ ఆఫీసర్ నుండి మిస్ ఇండియా 2017 వరకు షాలిని సింగ్ విజయ ప్రస్థానం ఎంతో మందికి ప్రేరణ

నరేంద్ర మోడీ భారతదేశం యొక్క రెండవ మహిళా రక్షణ మంత్రిగా నిర్మల సీతారామన్ ని నియామకం చేసారు. ఈ నియామకం పట్ల అందరు నరేంద్ర మోడీని ప్రసంశలతో ముంచెత్తారు.

నిర్మల సీతారామన్

నిర్మల సీతారామన్

భారతదేశం యొక్క రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ గురించి మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె గురించిన విషయాలను తెలుసుకుందాం.

నిర్మల సీతారామన్ బాల్యం

నిర్మల సీతారామన్ బాల్యం

మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిర్మల సీతారామన్ మదురై లో ఆగష్టు 18, 1959 వ సంవత్సరంలో జన్మించారు. ఆమె తండ్రి నారాయణన్ సీతారామన్ రైల్వేలో పనిచేసేవారు. ఆమె తల్లి సావిత్రి గృహిణి. నిర్మల సీతారామన్ తండ్రి ఉద్యోగంలో బదిలీల కారణంగా ఆమె చిన్నతనం తమిళనాడులోని అనేక ప్రాంతాలలో గడిచింది.

నిర్మల సీతారామన్ విద్యాభ్యాసం

నిర్మల సీతారామన్ విద్యాభ్యాసం

ఆమె తిరుచిరాపల్లి లోని సీతాలక్ష్మి రామసామి కళాశాల నుండి పట్టభద్రురాలైంది. తర్వాత ఆమె ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరి ఆర్ధికవ్యవస్థలో మాస్టర్స్ డిగ్రీని సాధించారు.

అపరమేధావి: చాణక్యుడు చెప్పిన 20 జీవిత సత్యాలు!అపరమేధావి: చాణక్యుడు చెప్పిన 20 జీవిత సత్యాలు!

నిర్మల సీతారామన్ కుటుంబం

నిర్మల సీతారామన్ కుటుంబం

ఆమె పరకాల ప్రభాకర్ ని వివాహం చేసుకొని లండన్ వెళ్లారు. అక్కడ ఆమె ప్రైస్వాటర్ హౌస్ కూపర్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేసారు. ఆమె మరియు ఆమె భర్త పరకాల ప్రభాకర్ ఇద్దరు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థులు. వీరికి ఒక అమ్మాయి ఉంది.

నిర్మల సీతారామన్ రాజకీయ జీవితం

నిర్మల సీతారామన్ రాజకీయ జీవితం

2003 వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో జాతీయ కమిషన్ ఫర్ విమెన్ (NCW) లో సభ్యునిగా నియమించబడ్డారు. ఆమె 2005 వరకు సభ్యునిగా కొనసాగారు. ఆ తర్వాత 2006 వ సంవత్సరంలో నిర్మల సీతారామన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు.

రాజకీయ నాయకురాలిగా ఆమె ప్రయాణం

రాజకీయ నాయకురాలిగా ఆమె ప్రయాణం

2006 వ సంవత్సరంలో నిర్మల సీతారామన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరాక రాజకీయంగా ఎదగటానికి ఎంతో సమయం పట్టలేదు. 201ఓ వ సంవత్సరంలో ఆమె బిజెపి అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు.

భారతదేశంలో ఒక మహిళ గొప్ప బాధ్యతలు తీసుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. భారతదేశంలో ముందు ముందు మెరుగైన రోజులను చూడవచ్చు.

English summary

Little-Known Facts About India's New Defence Minister

She is known to many of them as a firm policymaker. Read all that you need to know about Nirmala Sitharaman.
Desktop Bottom Promotion