బాంబ్ బ్లాస్ట్ లో బ్రతికి బయటపడ్డ మహిళ ఎన్ని విజయాలు సాధించిందంటే..?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనం భాద, ఆందోళనతో కూడిన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మనకంటే దురదృష్టవంతులు ఎవరు లేరని, అత్యంత బాధపడుతున్నది మనమే అని మొట్టమొదట అనుకుంటాం.

కానీ ఎప్పుడైతే సమాజంలో ఉన్న వివిధ రకాల ప్రజలు, వారియొక్క జీవిత కథల గురించి తెలుసుకున్నప్పుడు, మనం అనుభవిస్తున్న బాధ, సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న వాటి ముందు చాలా చిన్నవిగా అనిపించక మానదు.

అలాంటి ఒక జీవిత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహిళ, తాను చిన్న వయస్సులో ఉన్నప్పుడు రెండు చేతులను పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమె తనతంట తానుగా తన పనులన్నింటిని చేసుకుంటుంది. వంటలను కూడా వండుకుంటుంది. కారణం ఎవరి పైన ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకడం ఆమెకు ఇష్టం.

మాళవిక అయ్యర్ జీవిత కథ ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంది. దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమెకు పదమూడు సంవత్సరాల వయస్సున్నప్పుడు జీవితాన్ని మార్చేసే సంఘటన ఒకటి జరిగింది :

ఆమెకు పదమూడు సంవత్సరాల వయస్సున్నప్పుడు జీవితాన్ని మార్చేసే సంఘటన ఒకటి జరిగింది :

మాళవిక అయ్యర్ కు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు తన జీవితాన్నే మార్చేసే సంఘటన ఒకటి జరిగింది. ఆమె తన ఇంటి దగ్గరలోని మందుగుండు సామాగ్రిని సరఫరా చేసే డిపో వద్ద ఆడుకుంటున్నప్పుడు,ఆమెకు ఒక గ్రెనేడ్ దొరికింది. ఒకానొక సమయంలోనే ఆ మందుగుండు డిపో లో మంటలు వ్యాపించాయి, దీంతో ఆ గ్రెనేడ్ బయటపడి అలానే ఉండిపోయింది. ఇది తెలియక ఆ చిన్నతనంలో మాళవిక ఆ గ్రెనేడ్ ని తీసుకోవడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం లో ఆమె తన రెండు చేతులను పోగొట్టుకుంది. ఈమె ఒక ద్వైపాక్షిక అంగఛేదకురాలు మరియు బాంబు పేలుడులో బ్రతికిబయటపడ్డ వ్యక్తి.

ఆ గ్రెనేడ్ దానంతట అదే పేలిపోయింది :

ఆ గ్రెనేడ్ దానంతట అదే పేలిపోయింది :

ఆ చిన్నతనంలో తాను పట్టుకుని ఉన్నది గ్రెనేడ్ అని తెలియక, అటు ఇటు తిప్పుతూఆడుకోవడం మొదలు పెట్టింది. దింతో ఆ గ్రెనేడ్ ఒక్కసారిగా పేలిపోయింది. రెండు చేతులు పూర్తిగా దెబ్బ తిన్నాయి, కళ్ళకు తీవ్రమైన గాయాలు అయ్యాయి, నరాలు దెబ్బతిన్నాయి మరియు శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఆమె శరీరానికి ఇంత తీవ్రంగా గాయాలు అవ్వడంతో ఆమె రెండు సంవత్సరాల పాటు చెన్నై హాస్పిటల్ లో ఉన్నది. ఈ సమయంలో ఆమె కోలుకోవడానికి ఎంతో క్లిష్టతరమైన, కష్టమైనా ఎన్నో శాస్త్రచికిత్సలను చేశారు.

ఇది జరిగిన తర్వాత ఈమె ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి నుండి ఒక మహా శక్తిగా ఎదిగిపోయింది :

ఇది జరిగిన తర్వాత ఈమె ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి నుండి ఒక మహా శక్తిగా ఎదిగిపోయింది :

తన జీవితంలో అంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొని, ఎన్నో బాధలను అనుభవించి రెండు చేతులను పోగొట్టుకున్నా అంగవైకల్యం పై యుద్ధం చేయాలని నిశ్చయించుకొని ఒక మహా శక్తి గా ఎదగాలని భావించింది. తాను మళ్ళీ మామూలు స్థితికి చేరడానికి చాలా కాలం పట్టింది, అందుకు చాలా కష్టపడింది. మళ్ళీ తనంతట తానుగా నిలబడి నడవడం నేర్చుకుంది.

తన చదువుని అస్సలు వదిలి పెట్టలేదు :

తన చదువుని అస్సలు వదిలి పెట్టలేదు :

తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా, వాటిని చదువుకు అడ్డంకిగా భావించలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదల కూడదని నిశ్చయించుకుంది. తాను పదవ తరగతి పరీక్షలకు ఒక ప్రైవేట్ అభ్యర్థిగా హాజరయ్యి, వేరొక వ్యక్తి సహాయం తీసుకొని పట్టుదలగా పరీక్షలు రాసింది.

అంతే కాకుండా దీంతో పాటు :

అంతే కాకుండా దీంతో పాటు :

ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలు రాసిన వారిలో అత్యుత్తమ మార్కులు తెచ్చుకొని ఆ విభాగంలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ ని సాధించింది. ఈమె పడుతున్న కష్టాలని, పట్టుదలతో సాధించిన విజయాల్ని గుర్తించి అప్పటి రాష్ట్రపతి, డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం ఈమెను ప్రత్యేకంగా రాష్ట్ర భవన్ కు ఆహ్వానించారు. దీనితో ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అబ్దుల్ కలాం ని కలిసిన ఆ సందర్భం తన జీవితంలో ఒక అరుదైన జ్ఞాపకం అని ఇప్పటికి ఈమె చెబుతుంటుంది.

ఈమె ఒక బహుళ ప్రతిభావంతురాలు :

ఈమె ఒక బహుళ ప్రతిభావంతురాలు :

మాళవిక ఒక అంతర్జాతీయ స్ఫూర్తిదాయక వక్త, వికాలాగుల హక్కుల కోసం పోరాడే ఉద్యమకారి. సామాజిక పని అనే విభాగంలో పి.హెచ్.డి చేసి ఆ విభాగంలో ఒక పండితురాలు స్థాయికి ఎదిగింది, టెడ్ ఎక్స లో ఉపన్యాసకురాలు. ఇవన్నీ కాకుండా ఈమెకు ఫ్యాషన్ పై ఎంతో మక్కువ, దీంతో ఈమె ఒక మోడల్ గా కూడా ఎదిగింది.

నేను ఎప్పుడైతే నా రెండు చేతులని బాంబు పేలుడులో పోగొట్టుకున్నానో, ఇక నా జీవితంలో ఎప్పటికి నేను నా అంతకు నేనుగా వంట చేయలేని నన్ను నేను సముదాయించుకున్నాను. నిన్ను ఎవ్వరూ ఆపలేరు అని గుర్తుంచుకో - మాళవిక అయ్యర్

తాను వంట చేసిన అనుభవం గురించి ట్విట్టర్లో ఇలా చెప్పుకొచ్చింది.

చేతులు పోగొట్టుకున్న తర్వాత తాను మొదటసారి ఎలా వంట చేసింది అనే విధానాన్ని తెలియబరుస్తూ, తన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ట్విట్టర్ లో అలా చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన తర్వాత ఆమె పై చాలా మంది ఎంతో భావోద్వేగంతో ప్రతిస్పందించారు.

ఇది నా వాగ్దానం మరియు కల. మాళవిక అయ్యర్, నీతో ఎదో ఒక రోజు ఖచ్చితంగా వంట చేయాలని నేను భావిస్తున్నా. నువ్వు ఈ ప్రపంచాన్ని ఒక గొప్ప ఇల్లుగా మార్చేసావు- వికాస్ ఖన్నా

పైన చెప్పబడిన వ్యక్తి ఒక వంట మాస్టర్. అతడు కూడా మాళవిక పట్టుదలతో వంట చేయడం చూసి కదిలిపోయాడు.

ట్విట్టర్ లో మాళవిక తాను వంట చేసిన ట్వీట్ పెట్టినప్పటినుండి ప్రపంచ నలువైపులా నుండి ఆమె పై ప్రశంశల వర్షం కురిసింది. ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వంట మాస్టర్ వికాస్ ఖన్నా కు కూడా క్షణాల్లో ఈ విషయం తెలిసిపోయి పై విధంగా ప్రతిస్పందించారు.

మనం కూడా ఆమె తన జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగి మరెన్నో విజయాలను సాధించాలని అదృష్టం ఆమెకు తోడుగా ఉండాలని ఆశిద్దాం.

All Images Source

English summary

She Lost Her Arms In An Accident And Yet Loves Cooking!

Malvika Iyer's life changed when she was 13 years old when she found a grenade near her home that had been lying around after an ammunition depot caught fire and she lost both her arms and injured herself greviously. She is a bi-lateral amputee and a bomb blast survivor.
Story first published: Wednesday, August 30, 2017, 12:00 [IST]
Subscribe Newsletter