దీపావళి ముందు శుభ వార్తలు రాబోతున్నాయనటానికి సంకేతాలు!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హిందూ పురాణాల ప్రకారం ఒక మనిషి ధనవంతుడవ్వబోతున్నాడా, లేదా పేదరికం అనుభవించబోతున్నాడా ముందుగానే ఊహించటానికి కొన్ని సంకేతాలున్నాయి. ధనవంతులు కాబోతుంటే ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు.

మీరు చేయాల్సిందల్లా ఈ సంకేతాలను గుర్తుపట్టి రాబోయే ఏడాదిలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

వీటిని సాధారణంగా అందరూ దీపావళికి కొన్నిరోజుల ముందు గమనిస్తారు. పైగా మీరు ఇవి గుర్తుపట్టలేనంత కష్టంగా కూడా ఏమీ ఉండవు.

చాణక్య ప్రకారం మగవారికి ఇవే అత్యంత దురదృష్టకరమైన సందర్భాలు..!!

అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ పవిత్రమైన సంకేతాలేంటో తెలుసుకుని, మీరు ధనికులయ్యే అవకాశాలను విశ్లేషించుకోండి…

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

డబ్బు మీ చేతిలోంచి జారిపోతే !

మీరు తప్పించుకోలేని ఖర్చులలో మీ డబ్బు చేజారిపోతుంటే, మీ దారిలో ఏదో పెద్ద విషయం రాబోతూ మీరు ధనవంతులయ్యే అవకాశం ఉన్నదని సంకేతం !

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

అరచేతిని గోక్కోవటం !

పదేపదే మీరు అరచేతిని లేదా మణికట్టును రెండుసార్లకన్నా ఎక్కువ గోకుతూ ఉన్నట్లయితే, మీరు ధనికులు మరియు కీర్తిని సంపాదించే అవకాశం ఉన్నది. మీ అరచేతులు లేదా ఛాతిని పదేపదే గోక్కోవటం మీ దారిలో వచ్చే సంపదను, అనేక అవకాశాలను సూచిస్తుంది.

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

మీ పూర్వీకులను కలలో చూడటం

మీ కలల్లో మీ పెద్దవారు ఈ మధ్య వస్తూ ఉన్నట్లయితే, అదీ ఈ పవిత్ర సమయంలో, మీ పాత ఆస్తుల విషయాలలో మీకు శుభవార్త రాబోతున్నట్టు. ఇదే కాక మీకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు.

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

8 అంకెను చూడటం

మీ చుట్టూ 8 అంకెను పదేపదే చూస్తున్నట్లయితే, ఆగండి, ఇది అదృష్టాన్ని సూచిస్తోంది. 8 అంకె లక్ష్మీదేవికి సంబంధించిన అంకెగా భావిస్తారు. అందుకని ఇది మీ చుట్టుపక్కల కన్పిస్తే అది మంచి అదృష్టానికి సంకేతం కావచ్చు.

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

కీటకాలు మరియు పురుగులు

ఇది మీకు చిరాకుగా అన్పించవచ్చు కానీ నిజం! మీకు తెలుసా మీ చుట్టూ కీటకాలు , పురుగులు ముఖ్యంగా గుమ్మాలు, తలుపుల వద్ద చీమల వరుసలు ఇవన్నీ మంచి సంఘటనలు జరగబోతున్నాయనటానికి గుర్తని? అవును అది సంకేతమే.

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

సాలీడు గూళ్ళు !

పేరు వినగానే మీకు ఇల్లు శుభ్రపర్చాలని అన్పించవచ్చు కానీ మీకు ధనసంపదలు వస్తున్నాయనటానికి ఇది కూడా సంకేతమని తెలుసుకోండి. మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల సాలీళ్ళ గూళ్ళను ఎక్కువగా, అదికూడా దీపావళి సమయంలో చూస్తుంటే, మీ ధనవస్తు సంపదల అదృష్టం ఎంతో దూరంలో లేదని గ్రహించండి!

ఈ సంకేతాలను తెలుసుకుని ఆనందించారు కదూ!

English summary

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way

Signs Before Diwali That Indicate Good News Is Coming Your Way, When you see these signs, we bet you would realise that these things will bring in good luck to you.
Story first published: Tuesday, October 17, 2017, 20:00 [IST]
Subscribe Newsletter