ప్రతి రోజూ విస్కీ తాగే అతి పెద్ద, ఖరీదైన భారతదేశ ఎద్దు గురించి తెలుసుకోండి

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా జంతు ప్రేమికులైతే మరీ ఎక్కువగా చూపిస్తారు. కొంత మంది ఆ జంతువులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. మరికొంతమంది ఎప్పటికీ పెరగని ఒక చంటి బిడ్డను ఎలా చూసుకుంటారో అలా ఆ జంతువులను చూసుకుంటారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఆ పెంపుడు జంతువు ద్వారా లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తుంటారు.

ఇప్పుడు మనం ఒక ఎద్దు గురించి ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ ఎద్దు విలువ 2.5 మిలియన్ యూరోలు. దీని పేరు సుల్తాన్. ఇది ఒక అపూర్వమైన ఎద్దు మరియు ఇదొక ప్రత్యేకమైన జాతికి చెందినది అని ఎందుకు అలా అందరు అనుకుంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ ఎద్దు ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకోండి.

ఒక పెగ్ విస్కీ వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఎద్దుని పెంచే యజమానులు వాళ్ళంతకు వాళ్ళుగా చాలా గర్వపడుతుంటారు. అందుకు కారణం ఆ ఎద్దు యొక్క వీర్యాన్ని అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు.

ఈ అత్యంత అపూర్వమైన సుల్తాన్ అనబడే ఈ ఎద్దు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఎద్దు వయస్సు ఎనిమిది సంవత్సరాలు :

ఈ ఎద్దు వయస్సు ఎనిమిది సంవత్సరాలు :

సుల్తాన్ ని భారతదేశం లోనే " అత్యంత విలువైన ఎద్దుగా " పరిగణిస్తారు. అందుకు కారణం దీనిని పెంచుతున్న యజమానులు పది మిలియన్ల రూపాయలను(కోటి రూపాయలు) కేవలం దాని వీర్యం అమ్మడం ద్వారా సంపాదిస్తున్నారు. ఈ ఎద్దు ఎత్తు 6 అడుగులు మరియు దీని బరువు టన్నుకు పైగా బరువు ఉంటుంది.

ఈ ఎద్దు ఎందుకింత ఖరీదైనది :

ఈ ఎద్దు ఎందుకింత ఖరీదైనది :

ఈ ఎద్దు విలువ 210 మిలియన్ రూపాయలని సుల్తాన్ ని పెంచే యజమానులు చెబుతుంటారు. ఈ ఎద్దు యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, ప్రతి రోజు సాయంత్రం కాగానే విస్కీ త్రాగటానికి ఇష్టపడుతుంది. ఆ యజమానులు కూడా ఇవ్వడానికి అస్సలు సంకోచించారు.

ఈ ఎద్దు ఏమేమి తింటుందంటే :

ఈ ఎద్దు ఏమేమి తింటుందంటే :

ప్రతిరోజూ సుల్తాన్ 15 కిలోల ఆపిల్ లను, 22 కిలోల క్యారెట్ లను, 10 కిలోల ధాన్యాలను మరియు 10 కిలోల పశుగ్రాసాన్ని తింటుంది. వీటన్నింటిని కొన్ని లీటర్ల పాలతో కడుగుతారు. ఈ ఎద్దు తినేది చాలా ఖరీదైన ఆహారమే అయినా ,దీని యజమానులు దానికి అలా తినిపించడానికి అస్సలు వెనకాడరు. ఈ ఎద్దు తిండికి అయ్యే ఖర్చు అంతా దాని యొక్క వీర్యం భర్తీ చేస్తుంది. దీని వీర్యం దాదాపు కోటి రూపాలు పలుకుతుంది.

సుల్తాన్ స్నానం చేసే సమయాన్ని ఎంతగానో ప్రేమిస్తుంది :

సుల్తాన్ స్నానం చేసే సమయాన్ని ఎంతగానో ప్రేమిస్తుంది :

ఈ ఎద్దు యజమాని రోజుకు రెండు సార్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నది వద్దకు దీనిని స్నానానికి తీసుకెళ్తాడు . అందుకే సుల్తాన్ చర్మం చాలా ఆరోగ్యవంతంగా మరియు మెరుస్తూ ఎదో మెరుపుపూత పూసినట్లు ఉంటుందని చాలా మంది భావిస్తారు.

దీని యొక్క వీర్యం భారతదేశం అంతటా అమ్ముడవుతుంది :

దీని యొక్క వీర్యం భారతదేశం అంతటా అమ్ముడవుతుంది :

కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో సుల్తాన్ వీర్యం అమ్ముతారు. దీని యొక్క ఒక్కొక్క డోసు దాదాపు మూడువందల రూపాయలు పలుకుతుంది. " ఒక్క సంవత్సరంలోనే దీని వీర్యాన్ని అమ్మడం వల్ల దాదాపు కోటి రూపాయలు వస్తుంది ! "

విస్కీ సేవించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి :

పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి :

ఇప్పటి వరకు పుట్టిన సుల్తాన్ పిల్లలు అన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ పిల్లల గురించి ఒక సానుకూలమైన అంశం ఏమిటంటే ఇవి సుల్తాన్ లాగా రోజు విస్కీ ని త్రాగవు. ఇంతకు మించి ఇంకేమి కావాలి.

ఈ క్రింద నున్న వీడియో చూసి

ఈ క్రింద నున్న వీడియో చూసి సుల్తాన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

English summary

This Bull's Semen Is Sold For A Crore!

Sultan is his name, while drinking whiskey is his game!
Subscribe Newsletter