ప్ర‌పంచ‌ దేశవాసుల విచిత్ర మూఢ‌న‌మ్మ‌కాలు! ఇలా కూడా ఉంటారా?

By: sujeeth kumar
Subscribe to Boldsky

మూఢ‌న‌మ్మ‌కాల‌కు భార‌తీయులు పెట్టింది పేరు అని విశ్వ‌సిస్తారు ప్ర‌పంచ జ‌నాలు. ఇత‌ర దేశాల‌వారు మ‌న భార‌తీయులు చాలా మూఢ‌న‌మ్మ‌క‌స్తులుగా భావిస్తారు. అయితే ప్ర‌పంచంలో చాలా చోట్ల ప్ర‌జ‌లు కొన్నింటిని గుడ్డిగా పాటిస్తారు. చైనా నుంచి ఇజ్రాయెల్ దాకా ఎన్నో దేశాల ప్ర‌జ‌లు సంప్ర‌దాయ‌క‌రంగా ఎన్నో మూఢ‌న‌మ్మ‌కాల‌ను పాటిస్తుంటారు.

వీటి గురించి తెలుసుకుంటే మీరూ అంటారు. మూఢ‌న‌మ్మ‌కాల‌నేవి కేవ‌లం భార‌త్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని. అస‌లు ఇలాంటి వింత వింత న‌మ్మ‌కాలు ప్ర‌పంచంలో ఏయే మూల‌ల్లో పాటిస్తారో తెలుసుకుందామా...

కొరియాలో...

కొరియాలో...

కొరియాలో ప్ర‌జ‌లు గ‌ర్భ‌వ‌తులైన వారి గురించి విచిత్ర‌మైన మూఢ‌న‌మ్మ‌కం ఉంది. గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నవారు చెల్లాచెదురుగా ఉన్న సైజులో ఉన్న ఆహారం తింటే పుట్టే బిడ్డ‌లు క‌ళావిహీనంగా ఉంటార‌ని న‌మ్ముతారు. ఎంత విచిత్రం క‌దూ!

జ‌పాన్‌లో..

జ‌పాన్‌లో..

జ‌పాన్ ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌కు ఎలాంటి దిశానిర్దేశం లేక‌పోయినా మాత్రం చ‌నిపోయాక ఒక దిశ ఉంద‌ని భావిస్తారు. అందుకే వారిని ఉత్త‌ర దిక్కులోనే పూడ్చి పెడ‌తార‌ట‌. అంతేకాదు ఉత్త‌రం దిక్కున త‌ల చేసుకొని ప‌డుకోవ‌డాన్ని అశుభంగా భావిస్తార‌ట‌.

ర‌ష్య‌న్లు ఇలా...

ర‌ష్య‌న్లు ఇలా...

మ‌న మీద పిట్ల రెట్ట వేస్తే ఎంత చిరాకు ప‌డ‌తాం. ర‌ష్యాలో మాత్రం ప్ర‌జ‌లు దీన్ని అదృష్టంగా భావిస్తారు. త్వ‌ర‌లో త‌మ‌కు పెద్ద మొత్తంలో సంప‌ద రాబోతుంద‌ని క‌ల‌లు కంటారు.

టర్కీ దేశవాసులు..

టర్కీ దేశవాసులు..

ఇది అత్యంత విచిత్ర‌మైన మూఢ‌న‌మ్మ‌కం. ఇక్క‌డ రాత్రిపూట ప్ర‌జ‌లు చూయింగ్ గ‌మ్ తింటే అదిద చ‌నిపోయిన కుళ్లిన మాంసం తిన‌డం కింద భావిస్తార‌ట‌!

పోర్చుగీస్ దేశ‌స్థులు

పోర్చుగీస్ దేశ‌స్థులు

వెన‌క్కి న‌డుస్తుంటే ద‌య్యానికి దారి చూపించిన‌ట్టుగా పోర్చుగీసువారు భావిస్తార‌ట‌.

హంగేరియ‌న్లు...

హంగేరియ‌న్లు...

హంగేరియ‌న్లు, ర‌ష్య‌న్లు ఒక్క‌టే న‌మ్ముతారు. కార్న‌ర్ టేబుల్ లో కూర్చొని డిన్న‌ర్ చేస్తే పెళ్లి అయ్యే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ట‌. దీనికి పెళ్లికి ఎలా సంబంధ‌మో అస్సలు అర్థంకావ‌డం లేదు క‌దా!

ఫ్రెంచివాళ్లు ఇలా..

ఫ్రెంచివాళ్లు ఇలా..

కుక్క మ‌లినం మీ భ‌విష్య‌త్‌ను తేల్చ‌గ‌ల‌దు అని ఫ్రెంచివారు న‌మ్ముతారు. మీ ఎడ‌మ కాలితో దాన్ని తొక్కితే అదృష్ట‌వంతుల‌ని .. కుడి కాలితో తొక్కితో దుర‌దృష్టం వెంటాడుతుంద‌ని విశ్వ‌సిస్తారు. ఈ దేశ‌పు ప్ర‌జ‌లు ఎంత విచిత్ర‌మైన న‌మ్మ‌కాలు పెట్టుకున్నారు క‌దూ! మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

English summary

Bizarre Superstitions That People Follow Around The World

India is not the only country where people believe in superstition, there are many other such countries as well where superstition is followed. From stamping dog's poop to bringing in good luck by doing certain things, people around the world do believe in and follow these superstitious beliefs.
Story first published: Thursday, November 23, 2017, 9:00 [IST]
Subscribe Newsletter