మీ రాశిని బట్టి మీకుండేటటువంటి బెస్ట్ అండ్ వరెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్

By: Mallikarjuna
Subscribe to Boldsky

సాధారణంగా జీవితాంతం కలిసుండాల్సిన భార్య అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ రకరకాల కలలు కంటూ ఉంటారు అబ్బాయిలు. కొందరు అందానికి ప్రాధాన్యత ఇస్తే మరికొందరు గుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ చూడగానే గుణగణాలు, మెంటాల్టీ తెలుసుకోవడం చాలా కష్టం.

డ్రీమ్ గర్ల్ గురించి చాలా ఎక్స్ పెక్టేషన్సే ఉంటాయి. ట్రెడిషనల్ గా ఉండాలని, మోడ్రన్ గా ఉండాలని, తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని, తన ఇష్టాలతో ఆమె అభిరుచులు మ్యాచ్ అవ్వాలని కోరుకుంటారు. అయితే ఈ క్వాలిటీస్ అన్నీ చాలా అరుదుగా దక్కుతాయి. ఇద్దరి అభిరుచులు కలిస్తే చాలా అన్యోన్యంగా ఉంటారు. మరికొందరు అభిరుచులు వేరైనా.. సర్దుకుపోయే తత్వం ఉంటుంది. కొంతమంది విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు, అభిరుచులు వేరు వేరుగా ఉండటం వల్ల అనవరస గొడవలు వస్తూ ఉంటాయి.

మీరు ఫెయిర్ గా ఉంటారా? డార్క్ గా ఉంటారా? మీ కలర్ ఏం చెబుతోంది ?

చాలా మందికి వైవాహిక జీవితం అచ్చురాదు. ఎప్పుడు గొడవులు, పోట్లాటలతో చిరాగ్గా జీవిస్తూ ఉంటారు. ఏ చిన్న ఇబ్బంది కలిగినా విడిపోవాలని చూస్తుంటారు. మరికొందరు చాలా హ్యాపీగా, అన్యోన్యంగా ఉంటారు. మీ పద్ధతులు, నియమాలకు సరైన జోడీని రాశిని బట్టి వెతుక్కోవచ్చు. మీ టేస్ట్ తగిన అమ్మాయి ఏ రాశిలో ఉందో సెలెక్ట్ చేసుకుంటే.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ సొంతమవుతుంది.

మేషరాశి

మేషరాశి

మేషరాశి అమ్మాయి పర్ఫెక్ట్ ఇల్లాలు. ఎందుకంటే.. ఈమె తన కుటుంబాన్ని, భర్తని, పిల్లలను చాలా చక్కగా చూసుకుంటుంది. ఈ రాశి అమ్మాయి సక్సెస్ ఫుల్ భర్తను కోరుకుంటుంది. తన కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేవాళ్లే భర్తగా రావాలని భావిస్తుంది.

వృషభము

వృషభము

ఈ రాశి మహిళతో జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కుటుంబానికి చాలా విలువనిస్తుంది. భర్త, పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది.

మిథునము

మిథునము

ఈ రాశి మహిళ కాస్త తుంటరిగా ఉంటుంది. కానీ.. పెళ్లయ్యాక తన ప్రవర్తన మార్చుకుంటుంది. తన భర్తపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. తన మేధోశక్తికి సరిపోయే వ్యక్తినే భర్తగా రావాలని కోరుకుంటుంది.

హగ్గింగ్ స్టైల్ బట్టి, ఎదుటివారి వ్యక్తిత్వాన్నితెలుసుకోవచ్చు..!!

కర్కాటకము

కర్కాటకము

కర్కాటక రాశి మహిళ చాలా ఆదర్శవంతమైన భార్య. చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటుంది. తన భర్తకు చాలా నమ్మకస్తురాలుగా ఉంటుంది. తల్లిగా చాలా ప్రేమను చూపిస్తుంది. అర్థం చేసుకుంటుంది. తనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుంది.

సింహము

సింహము

ఈ రాశి అమ్మాయి చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ప్రతిదానికి సమయం వెతుక్కుంటుంది. ఇంటి పనులను నిర్లక్ష్యం చేయదు. తన భర్తకు ఆదర్శ భార్యగా ఉంటుంది. ఈ రాశి మహిళ చాలా అందంగా.. నమ్మకంగా ఉంటుంది.

కన్య

కన్య

వైవాహిక జీవితంలో కన్యారాశి మహిళ చాలా సున్నితంగా ఉంటుంది. చాలా అనలిటికల్ గా ఆలోచిస్తుంది. అయితే భార్యగా, తల్లిగా చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. ప్రతి విషయాన్ని తన కంట్రోల్ ఉంచుకుంటుంది. బాధ్యతగల వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది.

తుల

తుల

తులారాశి మహిళ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడూ పొగడ్తలు అందుకుంటూ ఉంటుంది. వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కోరుకుంటుంది. ఇంటి పనులను చాలా ఎంజాయ్ చేస్తుంది. తన భర్త తనను ఎప్పుడూ గారాబం చేయాలని, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది.

మీ భార్యను ఎట్టిపరిస్థితుల్లో అడగకూడని ముఖ్యమైన విషయాలు..!

వృచ్చికము

వృచ్చికము

వివాహాన్ని చాలా సీరియస్ తీసుకుంటుంది స్కార్పియో అమ్మాయి. తనను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లతో మాత్రమే కమిట్ అవుతుంది. తన కుటుంబ సంతోషం కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతుంది. తనను అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు. తన కోరికలు తీర్చడంలో భర్త అపజయం పొందితే.. అతని నుంచి దూరంగా వెళ్లడానికి సిద్ధపడుతుంది.

ధనుస్సు

ధనుస్సు

వైవాహిక జీవితంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ధనుస్సు రాశి అమ్మాయి. తన భర్తకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉంటుంది. ఈమె తనను నవ్వించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది.

మకరము

మకరము

ప్రశాంతమైన ఫ్యామిలీ లైఫ్ కోరుకుంటుంది మరకరరాశి మహిళ. తనపై తన భర్తకు పూర్తీ నమ్మకాన్ని కుదుర్చుతుంది. తన భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. భావోద్వేగాన్ని ఎలా తెలపాలో తెలియదు. చాలా కూల్ గా, రిజర్వ్డ్ గా ఉంటుంది.

కుంభము

కుంభము

కుంభ రాశి మహిళ చాలా సింపుల్ గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. తనకు సరైన వ్యక్తి దొరికే వరకు కమిట్ కాదు. ఆశించినంతగా వంటలు చేయలేకపోతుంది. చాలా నిజాయితీగా ఉంటుంది. తన ఫీలింగ్స్ చెప్పడానికి ఏమాత్రం వెనకాడదు. జీవితం చాలా రొటీన్ గా ఉందని అనిపిస్తే.. ఎలాంటి సాహసం చేయడానికైనా వెనకాడదు.

మీనము

మీనము

తనకు జీవితాంతం అండగా ఉండి.. చాలా ధైర్యంగా ఉండే వ్యక్తిని భర్తగా కోరుకుంటుంది మీన రాశి మహిళ. తన వైవాహిక జీవితంలో ఎంత కష్టం ఎదురైనా.. అనుభవిస్తుంది కానీ.. మ్యారేజ్ లైఫ్ ని మాత్రం వదులుకోదు. త్వరలోనే తన జీవితం బాగుపడుతుందని నమ్ముతుంది.

English summary

From The Best To Worst GF, According To Zodiac!

These are the best zodiac signs for a perfect and worst girlfriend. Find out more...
Story first published: Friday, August 18, 2017, 13:20 [IST]
Subscribe Newsletter