ముస్లిం స్త్రీని పూజించే ఏకైక భారత ఆలయం

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనిషికి, దేవుడికి మధ్య వారధిగా ఆలయాలను భావిస్తారు. హిందూమతంలో గుడులు చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి.

దేవుణ్ణి పూజించే మందిరాలు కాబట్టి ఆలయాలకి అంత విలువ, గౌరవం ఇస్తారు మరియు హిందూ సంస్కృతిలో అవి ఉన్నతస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆలయాలలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైనదే.

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

అలాంటి ప్రత్యేక ఆలయాలలో ఒకటి ఝుల్సన్ అనే చిన్నగ్రామంలో ఉన్న డోలామాత మందిరం.

ఆ ఆలయం ఎందుకంత ప్రత్యేకమో చదవండి మరి.

ఇక్కడి దేవత ఒక ముస్లిం

ఇక్కడి దేవత ఒక ముస్లిం

ముస్లిం దేవతను పూజించే డోలామాత మందిరం దేశంలోని ఆలయాలలోనే ప్రత్యేకమైనది.ఇక్కడి దేవత డోలా అనే ముస్లిం స్త్రీ తన రాష్ట్ర ప్రజలను సంరక్షిస్తూ ఉంటుంది. పాతకథల ప్రకారం, ఝులాసన్ అనే గ్రామంలో రౌడీలు దాడిచేస్తే డోలా అనే ముస్లిం స్త్రీ, చాలా ధైర్యంగా వారితో పోరాడి గ్రామాన్ని రక్షించింది. కానీ తర్వాత కోలుకోలేక ప్రాణాలు కోల్పోయింది.

ఈ గుడిని నిర్మించారు

ఈ గుడిని నిర్మించారు

ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం డోలా తన ఆఖరిశ్వాస విడిచాక, ఆమె శరీరం పువ్వులాగా మారిపోయింది. ఆమె ధైర్యాన్ని గౌరవించే భావనతో, గ్రామస్తులు డోలా చనిపోయిన స్థలంలో గుడిని నిర్మించాలని నిర్ణయించారు. ఆ ఆలయాన్ని డోలా మాత మందిరంగా ప్రజలు పూజిస్తారు.

ఆలయంలో ఏ విగ్రహం ఉండదు

ఆలయంలో ఏ విగ్రహం ఉండదు

గుడిలోపల ఏ విగ్రహం ఉండదు.ఒక రాయికి చీరకట్టి ఉంటుంది. ఈ రాయిని దేవతగా భావించి గ్రామస్తులు పూజిస్తారు. భక్తులకి ఈ ఆలయంపై ఎంత విశ్వాసమంటే, అందరూ కలిసి 4 కోట్లను ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు.

విశ్వంలోనే నెం.1 శ్రీమంత దేవాలయం మన ఇండియాలో ఉంది!

ఈ గ్రామం దీనికి కూడా ప్రసిద్ధి

ఈ గ్రామం దీనికి కూడా ప్రసిద్ధి

ఈ గ్రామం మొదటి భారత మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ కి జన్మస్థలం. సునీత తన తండ్రితో కలిసి డోలా మాతను పూజించటానికి వచ్చినపుడు ఈ గుడి వెలుగులోకి వచ్చింది. సునీత ఈ చిన్నగ్రామంలో పుట్టింది మరియు గ్రామస్తులకందరికీ ఆమెంటే ఎంతో గర్వం. సునీత తండ్రి ఈ గ్రామంలో 22 ఏళ్ళు గడిపారు.

ఈ ఆలయం అందరి కోరికలూ తీరుస్తుంది

ఈ ఆలయం అందరి కోరికలూ తీరుస్తుంది

ఇదేకాక, ఈ దేవత విదేశాల్లో స్థిరపడ్డవారి కోరికలు కూడా తీరుస్తుందని నమ్ముతారు. 7000మంది గ్రామస్తులలో 1500 మంది విదేశాలలో స్థిరపడ్డారు. వారు దేశానికి వచ్చినప్పుడల్లా డోలా మాతను సందర్శించి పూజిస్తారు.

English summary

In This Temple A Muslim Woman Is Worshipped

Belief knows no religion!
Story first published: Sunday, October 22, 2017, 16:00 [IST]
Subscribe Newsletter