ముఖ ఆకారం చూసి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయొచ్చో తెలుసుకోండి..

By: Mallikarjuna
Subscribe to Boldsky

ముఖం మనసుకి అద్దం లాంటిదని అంటారు. ముఖంలో మనసులోని భావాలు పలుకుతాయని దాని అర్థం. ఈ సంగతేమో కానీ ఎదుటి వ్యక్తి మనకు తెలియకపోయినా, వాళ్ళని మనం మొదటిసారి చూస్తున్నా, వారి ముఖ ఆకృతిని బట్టి వారి మనస్తత్వం చెప్పేయవచ్చనేది కొందరి వాదన.

ముఖ ఆకారానికి, వ్యక్తిత్వానికి మధ్య బలమైన సంబంధమే ఉందంటున్నారు వారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనపెడితే సరదాగా చదువుకోవడానికి మాత్రం బాగుంటుంది. వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, మన అలవాట్లు, లక్షణాలు, చదువు సంస్కారాలు ఇంకా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందన్నది తెలిసిందే. కానీ ముఖ ఆకారాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి ఎలాంటి వారో ఇట్టే చెప్పయవచ్చు అంటున్నారు. మరి అదెలాగో తెలుసుకుందామా..

ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం : ముక్కు చూసి వ్యక్తిత్వం తెలుసుకోండి

వెడల్పాటి ముఖం

వెడల్పాటి ముఖం

వైడ్ లేదా వెడల్పాటి ముఖం ఉన్న వాళ్లు ఉదారమైన, నిజాయితీతో పాటు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని మోర్ఫో సైకాలజీ వివరిస్తోంది. వీళ్లు ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వెడల్పు ముఖం కలిగిన వాళ్లు సైలెంట్ అయిపోతారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీళ్లకు సామర్థ్యం లేదన్న భావన ఇతరుల్లో కలిగిస్తారు.

పొడవాటి ముఖం

పొడవాటి ముఖం

పొడవాటి ముఖం ఉన్నవాళ్లు స్వీయ సంరక్షణ ఎక్కువగా ఆలోచిస్తారు. లీడర్ షిప్ క్యాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి నిర్ణయాలైనా ఇతరుల అవసరం లేకుండా సొంతంగా తీసుకోగలుగుతారు. వీళ్లు ఏ విషయాన్నైనా చాలా డీప్ గా, వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. రొమాంటిక్ లైఫ్ లో చాలా విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇద్దరూ చాలా ఎమోషనల్ గా ఉంటారు.పొడవు ముఖం కలిగి వాళ్లు ఎక్కువగా ఫ్రస్ర్టేషన్ కి లోనవుతుంటారు.

పొడవు ముక్కు

పొడవు ముక్కు

మోర్ఫోసైకాలజీ ప్రకారం పొడవాటి ముక్కు ఉన్న వాళ్లు మంచి స్వభావం కలిగి ఉంటారు. హెల్తీగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే లైఫ్ స్టైల్ ని హెల్తీగా ప్లాన్ చేసుకుంటారు. వీళ్లకు చాలా ఎనర్జీ ఉంటుంది. వ్యాయామం చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చోవడం కంటే బయటకు వెళ్లడాన్ని ఇష్టపడతారు. విభిన్న కల్చర్లను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.వీళ్లకు హెసిటేషన్ ఎక్కువ. మార్పులను ఒప్పుకోలేరు. ఒకవేళ ఆ మార్పులు మంచివే అనిపించినా కూడా ఇష్టపడరు. అంటే.. వచ్చే మంచి అవకాశాలను వదులుకుంటారు.

చిన్న ముక్కు

చిన్న ముక్కు

చిన్న ముక్కు కలిగిన వాళ్లు జాలి, సానుభూతి కలిగి ఉంటారు. ఎదుటివాళ్ల భావాలను, ఇబ్బందులను వెంటనే గ్రహిస్తారు. స్నేహితులను చేసుకోవడంలో వీళ్లు చాలా యాక్టివ్. ఇతరుల కోసం మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఈ చిన్న ముక్కు కలిగిన వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరిస్తారు.

నుదురు పెద్దగా ఉంటే

నుదురు పెద్దగా ఉంటే

నుదురు భాగం పెద్దగా ఉన్న వాళ్లు చాలా తెలివిగా ఉంటారు.. అలాగే చాలా కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.వీళ్లు చాలా భయం, బాధతో ఉంటారు. అనిశ్చితిని అస్సలు ఇష్టపడరు. మార్పులను వ్యతిరేకిస్తారు.

గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి

తక్కువ నుదుటి భాగం

తక్కువ నుదుటి భాగం

ప్రస్తుతం ఎలాంటి లైఫ్ ఉన్నా హ్యాపీగా ఉండే తత్వం వీళ్లది. వీళ్లు ఎక్కువగా ఆలోచించడాన్ని ఇష్టపడరు. ఆందోళన, భయం వీళ్లకు ఉండదు. వీళ్లకు తెలివితేటలు కొంచెం తక్కువగా ఉంటాయి. దూకుడు స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా పని చేసే ముందు ఆలోచించడంలో పెయిల్ అవుతారు. దీనివల్ల టార్గెట్ రీచ్ అవలేకపోతారు.

రౌండ్‌ నుదురు

రౌండ్‌ నుదురు

నుదురు గుండ్రని ఆకారంలో ఉన్నవారు కళాత్మక, సృజనాత్మక లక్షణాలు కలిగి ఉంటారు. కానీ నిజానికి వీరు ఆచరణాత్మకంగా ఉండరు. కొన్నిసార్లు వీరి ఆలోచనలు తర్కబద్ధంగా ఉండవు.

ముక్కోణపు ఆకారం

ముక్కోణపు ఆకారం

ముక్కోణపు ముఖాకృతి గలవారు సన్నని శరీరం కలిగి ఉంటారు. చాలా తెలివైన ఆలోచనలు చేస్తుంటారు. వీరు సృజనాత్మకంగా ఉంటారు. కాకపోతే వీరికి నిగ్రహం తక్కువ. వీరి గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడరు.

ఫ్లాట్‌ నుదురు

ఫ్లాట్‌ నుదురు

నుదురు చదునుగా ఉన్న వ్యక్తులు ఏ పనినైనా చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. తద్వారా వచ్చిన ఫలితం ఏదైనా వాళ్లే బాధ్యత తీసుకుంటారు. వీరు రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, మంచి నిర్ణయం తీసుకుంటారు.

స్ట్రాంగ్ ఐబ్రో

స్ట్రాంగ్ ఐబ్రో

ఒత్తైన కనుబొమ్మలు కలిగిన వారు చాలా నమ్మకంగా, ఒక లక్ష్యంతో ఉంటారు. వారు జీవితంలో వివిధ పరిస్థితులకు తార్కిక విధానాన్ని కలిగి ఉంటారు, మరియు వీరు శ్రుంగారం పట్ల కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. భావోద్రేకాలను చాలా సులభంగా ఎదుర్కొంటారు.

సన్నని కనుబొమ్మలు కలిగిన వారు

సన్నని కనుబొమ్మలు కలిగిన వారు

సన్నని కనుబొమ్మలు కలిగి వారు, సెల్ఫ్ కాన్షిడెన్స్ ను పెంచుకోవడానికి ఎప్పుడు కష్టపడుతుంటరు, అయితే ఈ లక్షణం వచ్చనిప్పుడు వారి విశ్వాసానికి వ్యతిరేఖంగా ఉంటుంది. వారు హైబ్రోన్ ను ప్లప్ చేస్తే విశ్వాసాన్ని కోల్పోతామని భావిస్తారు .

పెద్ద నోరు లేదా లావు పెదాలు

పెద్ద నోరు లేదా లావు పెదాలు

లావు పెదాలు కలిగిన వాళ్లు ఆనందం కోసం ఎదురుచూస్తుంటారు. లావుగా, బొద్దుగా పెదాలు కలిగిన వాళ్లు చుట్టూ ఉన్నవాళ్లతో కంటే సొంతంగా ఎదురయ్యే అనుభవాల ద్వారా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

చిన్న నోరు లేదా సన్నటి పెదాలు

చిన్న నోరు లేదా సన్నటి పెదాలు

మోర్ఫోసైకాలజీ ప్రకారం పెదాల ఆధారంగా కూడా వ్యక్తుల స్వభావాన్ని అంచనా వేయవచ్చు. సన్నటి పెదాలు కలిగిన వాళ్లు క్రియేటివిటీ కలిగి ఉంటారు. సన్నటి పెదాలు కలిగిన వాళ్లు కళాత్మక సౌందర్యాన్ని ఇష్టపతారు.అలాగే పర్సనల్ గా చాలా గోప్యంగా ఉంటారు. మీరి నైతిక మద్దతు కోసం ఎప్పుడు అతని లేదా ఆమె చుట్టూ ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. అది పాట్నర్ కావచ్చు లేదా ఫ్రెండ్ కావచ్చు.

లార్జ్ బాటమ్ లేదా అప్పర్ లిప్

లార్జ్ బాటమ్ లేదా అప్పర్ లిప్

ఒక వ్యక్తి అతను లేదా ఆమె పైపెదవి పెద్దగా ఉన్నవారితో పోల్చితే దిగువ పెదవి పెద్దగ ఉన్నవారు హుందాగా ఉంటారు. వీరు ఎప్పుడూ సంతోషంగా జీవించడానికి ఇష్టపడుతారు. ఎక్కువ సంతోషం మాత్రమే కాదు ప్రేమను కూడా కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్వాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో వీరు దిట్ట

స్ట్రాంగ్ చిన్ :

స్ట్రాంగ్ చిన్ :

స్ట్రాంగ్ చిన్ అంటే చిన్న గడ్డం కలిగి ఉన్నవారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, వీరికి ఏ విషయంలో అయినా పట్టుదల ఎక్కువ. కష్టకాలంలో కూడా భరించే సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యక్తిత్వం విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ గా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారుగా ఉంటారు.

English summary

Tips On How To Judge A Person By Just Looking At Their Face

All it takes is just 2 minutes to judge the personality of a person by looking at the face!
Story first published: Wednesday, November 1, 2017, 18:00 [IST]
Subscribe Newsletter