For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎదుటి వాళ్ళ కళ్ల ఆకారాలను బట్టి కూడా వ్యక్తిత్వాలు చెప్పేయొచ్చు,

By Y. Bharath Kumar Reddy
|

కళ్లు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. మన ఎదుటి వారికి వారిపై ఉండే ప్రేమను కూడా కళ్లతో చెప్పేయొచ్చు. అందేకే అత్యంత స్థానం ఉంది. మన అందాన్ని కూడా అవి రెట్టింపు చేస్తాయి.

కళ్లను బట్టి ఎదుటి వారు ఎలాంటివారో చెప్పేయొచ్చు. అయితే ఒక్కొక్కరు ఒక రకమైన కళ్లు కలిగి ఉంటారు. కొందరు చిన్న కళ్లు, మరికొందరు పెద్ద కళ్లు. ఇంకొందరు పిల్లి కళ్లు ఇలా రకరకాల ఆకారాలను కళ్లను కలిగి ఉంటారు.

అయితే కళ్ల ఆకారాలను బట్టి కూడా వ్యక్తిత్వాలు చెప్పేయొచ్చు. ఆయా ఆకారాలను అనుసరించి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.

గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి

బాదం గింజల ఆకారంలో ఉండే కళ్లు

బాదం గింజల ఆకారంలో ఉండే కళ్లు

బాదం ఆకారంలో కళ్లు ఉండే వ్యక్తులు క్రమశిక్షణను ఎక్కువగా నమ్ముతారు. అలాగే వారు గ్రేట్ సెన్స్ కలిగి ఉంటారు. అలాగే వీరు చాలా సున్నిత మనస్కులు. ప్రతి చిన్న విషయానికి కాస్త ఆందోళనపడుతుంటారు. వీళ్లు అందంగా.. ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు హాస్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తారు.

గుండ్రటి కళ్లు

గుండ్రటి కళ్లు

గుండ్రటి కంటి ఆకారంతో ఉన్న వ్యక్తులు చాలా భావోద్వేగాలను కలిగి ఉంటారు. మానసికంగా వీరు కాస్త వీరు బలంగా ఉండరు. ఇలాంటి వీరు అపోజిట్ జెండర్ వ్యక్తులకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు. అంతేకాందడోయ్ వీరిలో కాస్త క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో స్నేహం చేసేతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత ఎమోషనల్ గా ఉంటారో అంత మూడ్ అవుట్ అవుతూ ఉంటారు. వీళ్లు చాలా అందంగా.. ఆకట్టుకునే విధంగా ఉంటారు. సామాజిక అంశాలపై వీళ్లకు అవగాహన ఉంటుంది. సంతోషంగా ఉంటారు.

క్లోజ్డ్ సెట్ ఐస్

క్లోజ్డ్ సెట్ ఐస్

ఇలా కళ్లు ఉన్న వ్యక్తులు అందరి దృష్టి వారిపై పడేటటువంటి శక్తి కలిగి ఉంటారు. వీరు ఒత్తిడిని సులభంగా ఎదుర్కొనే తత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ప్రతి విషయంలో మంచి జ్ఞానం ఉంటుంది. అయితే వీరికి సహనం తక్కువ. అందువల్ల ఎక్కువగా కోప్పడుతుంటారు. వీరికి కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక అంశాన్ని నిషితంగా పరిశీలిస్తున్నప్పుడు.. లేదా బిజీగా ఉన్నప్పుడు డిస్ర్టబ్ చేస్తే అస్సలు సహించలేరు.

మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు చెబుతున్న మీ పళ్ల ఆకారం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు చెబుతున్న మీ పళ్ల ఆకారం

వైడ్ సెట్ ఐస్

వైడ్ సెట్ ఐస్

ఈ విధమైన కళ్ళు ఉన్న వ్యక్తులు వారి కళ్ళ మధ్య మరింత ఎక్కువ ఖాళీని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకునే గుణం వీరికి ఉంటుంది. అందరితో కలిసి పోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు జీవితం గురించి విస్తృత దృక్పథం కలిగి ఉంటారు. అలాగే వీరు జీవితంలో ప్రతిదీ ఆనందిస్తుంటారు. కొత్తగా ఆలోచిస్తూ జీవితాన్ని ఊత్తేజభరితంగా మార్చుకుంటూ ఉంటారు. వీరిలో ఓర్పు, సహనం చాలా ఎక్కువ. వీరు భవిష్యత్తును వినూత్నంగా తీర్చిదిద్దుకుంటారు.

డీప్ సెట్ ఐస్

డీప్ సెట్ ఐస్

ఈ విధమైన కళ్లు ఉన్న వ్యక్తులు ప్రతి విషయాన్ని బాగా గమనిస్తుంటారు. వీరు ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతేకాకుండా మంచి రైటింగ్ స్కిల్స్ వీరికి ఉంటాయి. వీరు వారి చుట్టూ జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ప్రామినెంట్ ఐస్

ప్రామినెంట్ ఐస్

ఇలాంటి కళ్లు ఉన్న వ్యక్తులు ఇతరులతో ఎక్కువగా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే వీరిలో దయ, జాలి ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి స్పందించే తత్వం వీరిలో ఉంటుంది.

ప్రొట్ర్యూజింగ్ ఐస్

ప్రొట్ర్యూజింగ్ ఐస్

ఈ రకమైన కళ్లతో ఉన్న వ్యక్తులు చాలా శక్తివంతమైనవారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. అయితే వీరిని ఎవరైతే విస్మరిస్తే వారిని ఎక్కువగా ద్వేషిస్తారు.

పెద్ద కళ్లు

పెద్ద కళ్లు

పెద్ద పెద్దగా కళ్లు ఉండేవాళ్లు ఓపెన్-మైండెడ్ గా ఉంటారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరిలో చాలా ఆసక్తికరమైన ఆలోచనలుంటాయి. వీళ్లకు సృజనాత్మకతతో పాటు.. ప్రత్యేక గుర్తింపు పొందే సత్తా ఉంటుంది. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు.

చిన్న కళ్లు

చిన్న కళ్లు

చిన్న కళ్ళు గల వ్యక్తులు ఎక్కువగా వారి చుట్టుపక్కల అన్ని అంశాలను బాగా పరిశీలిస్తారు. షార్ప్ గా ఉంటారు. వీరికి దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరు ఆలోచనలు చాలా షార్ప్ గా ఉంటాయి.

డౌన్ టర్న్డ్ స్లాటింగ్ కళ్లు

డౌన్ టర్న్డ్ స్లాటింగ్ కళ్లు

ఇలాంటి కళ్ల ఆకారం ఉన్న వారు నిరాశావాదులుగా ఉంటారు. వీళ్లు తొందరగా.. నిరుత్సాహానికి లోనవుతారు. అయితే వీరు అవతలి వ్యక్తులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.

అప్ టర్డ్న్ ఐస్

అప్ టర్డ్న్ ఐస్

ఇలాంటి కళ్లను పిల్లి కళ్లు అంటుంటారు. అప్ టర్న్ కళ్లు ఉన్న వారు ఆశావాదులుగా ఉంటారు. వీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. వీళ్లు ప్రకృతిపట్ల ఆసక్తికరంగా ఉంటారు. వీళ్లు కోరుకున్న దాన్ని సాధించుకుంటారు.

పడగ ఆకారంలో ఉండే కళ్లు

పడగ ఆకారంలో ఉండే కళ్లు

ఇలాంటి ఆకారంలో కళ్లు ఉండే వారు ఎదుటివారికి ఎక్కువగా సహాయపడతారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. సంతోషంగా ఉంటూ.. అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. మరి మీరూ కూడా అవతలి వ్యక్తలు కళ్లను బట్టీ వారి వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన వారి కళ్లు ఏ ఆకారంలో ఉన్నాయో చూసుకుని వారి మనసత్వం ఏమిటో కూడా మీరు అంచనా వేయొచ్చు.

English summary

Tips On How To Judge A Person By Looking At The Eyes

All that you need to do is look at the other person’s eyes and analyse their personality…
Desktop Bottom Promotion