సైన్స్ ప్రకారం మీరు ఊహించని విధంగా సంగీతం మనంపై ప్రభావం చూపుతుంది!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ మీరు ఎంతో కొంత సంగీతాన్ని ప్రస్తుతం ఉన్న రోజుల్లో వినవల్సి వస్తుంది. సంగీతం అనేది ఎదో ఒక రకంగా మన చుట్టూ ఎంతో కొంత ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది, సృస్టించబడుతూ ఉంటుంది.

ఏదైనా దుకాణానికి వెళ్లినా, పనిచేసే ప్రదేశానికి వెళ్లినా, జిమ్ లో అయినా మరియు మీరు ఇంటికి వెళితే టి.వి నుండి, ఇలా ఎదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర నుండి సంగీతం మనం వింటూనే ఉంటాం.

మ్యూజిక్... మస్తీనే కాదు.. మస్తుగా ఆరోగ్యాన్నీ ఇస్తుంది

దీని అర్ధం ఏమిటంటే మీకు తెలియకుండానే మీరు వింటున్న సంగీతం అనేక విధాలుగా మీ పై ప్రభావం చూపుతుంది. ఎనిమిది నమ్మలేని విధాలుగా సంగీతం సైన్స్ ప్రకారం ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం....

1. ఆనందం లేదా దుఃఖంతో కూడిన సంగీతం, ఎదుటి వ్యక్తుల యొక్క హావభావాలను అంచనా వేసే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది :

1. ఆనందం లేదా దుఃఖంతో కూడిన సంగీతం, ఎదుటి వ్యక్తుల యొక్క హావభావాలను అంచనా వేసే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది :

మీరు వినే సంగీతం ఆనందం చేకూర్చేదైనా లేదా బాధను కలిగించేదైనా, ఏదైనా సరే మీ యొక్క ఆలోచనా ధోరణి మరియు మానసిక స్థితి పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. కానీ, అధ్యయనాల ప్రకారం ఆ ఒక్క విధంగానే సంగీతం మీ పై ప్రభావం చూపదు అని చెబుతున్నారు. మీరు గనుక దుఃఖాన్ని కలిగించే సంగీతాన్ని అలానే కొద్దిసేపు గనుక విన్నట్లైతే, ఆ తర్వాత సాధారణ మనిషి ముఖంలో ఏవైనా మాములు హావభావాలను చూసినా మీరు వాటిని దుఃఖమైన భావాలుగానే భావిస్తారు. మీరు ఆనందమైన సంగీతం విన్న తర్వాత కూడా ఇలాంటి అనుభవమే కలుగుతుంది. ఇలా ఏ సంగీతాన్ని అయితే వింటారో అదేవిధంగా ఆలోచించడం అనేది సాధారణమైన హావభావాల్లోనే కాదు, ఇతర హావభావాల సమయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కాకపోతే సాధారణ హావభావాలను చూసినప్పుడు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

2. పరిసర ప్రాంతాల సంగీతం సృజనాత్మకతను పెంచుతుంది :

2. పరిసర ప్రాంతాల సంగీతం సృజనాత్మకతను పెంచుతుంది :

సాధారణంగా మీ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో సహజంగా ఏర్పడే సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల సృజనాత్మకత ముఖ్యంగా రచయితలలో పెరుగుతుందట. ప్రముఖ ప్రసిద్ధ రచయిత స్టీఫెన్ కింగ్ ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇది అందరికీ వర్తించకపోవచ్చు. కానీ, సైన్స్ ప్రకారం మధ్యస్థంగా ఉండే ధ్వనులను లేదా సంగీతాన్ని వినడం ద్వారా ఒక వ్యక్తిలో సృజనాత్మకత పెరుగుతుందని చెబుతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటంటే, ఇలాంటి సంగీతాన్ని వినేటప్పుడు మన మెదడు ఆ సంగీతాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఎంతో తపన పడుతుంది. ఇది సృజనాత్మకతను ఎంతగానో పెంచుతుందట. అయితే మీరు గనుక సంగీతాన్ని శృతి మించిన శబ్దంతో వింటే మీ మెదడు అర్ధం చేసుకొనే శక్తిని కోల్పోయే అవకాశం ఉంది మరియు అది సృజనాత్మకతను మీలో పెంపొందించదు.

3. అందరూ నమ్మే ఒక ప్రసిద్ధి చెందిన నమ్మకానికి విరుద్ధముగా ఒకటి చెబుతున్నారు. అదేమిటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సంగీతం మిమ్మల్నిపరధ్యానంలోకి నెట్టేసే అవకాశం ఉంది :

3. అందరూ నమ్మే ఒక ప్రసిద్ధి చెందిన నమ్మకానికి విరుద్ధముగా ఒకటి చెబుతున్నారు. అదేమిటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సంగీతం మిమ్మల్నిపరధ్యానంలోకి నెట్టేసే అవకాశం ఉంది :

ఇప్పుడు మీకు అందిన సమాచారం మరీ ఎక్కువగా మీ యొక్క ప్రవర్తన పై మార్పు తెస్తుందని కాదు కానీ, కొన్ని అధ్యయనాల ప్రకారం ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న డ్రైవర్లు వారికి నచ్చిన సంగీతాన్ని వింటూ డ్రైవ్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువ తప్పులు చేస్తున్నారని నిరూపితమైంది మరియు డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఏ సంగీతం అయితే మిమ్మల్ని తక్కువగా ఉత్తేజపరుస్తుందో అటువంటి సంగీతం డ్రైవింగ్ చేసే సమయంలో " సురక్షిత " సంగీతం అని చెబుతున్నారు. ఇది మీ యొక్క నడవడిక పై కూడా మరీ ఎక్కువ ప్రభావం ఏమి చూపించదు.

4. మీ వ్యాధి నిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది :

4. మీ వ్యాధి నిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది :

సంగీతంలోని ఎన్నో విభాగాలు విభిన్నమైన తత్వాలను కలిగి శరీరం పై ఎన్నో రకాలుగా ప్రభావం చూపిస్తాయి. ముందుగా సంగీతం మీ మెదడులో ఉండే కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది మెదడులో ఉండే ఒక రసాయనం. ఇది గనుక ఎక్కువగా ఉంటే తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. కార్టిసోల్ స్థాయిలను తగ్గించడానికి జాజ్, బ్లూ గ్రాస్ మరియు సాఫ్ట్ రాక్ వంటి సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొక అత్యద్భుతమైన ప్రభావాన్ని సంగీతం శరీరం పై ఎలా చూపిస్తుందంటే, వ్యాధి నిరోధక శక్తులను మరియు కణాలను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

5. సంగీతంలో తర్ఫీదు తీసుకోవడం వల్ల తార్కిక నైపుణ్యాలు ఎంతగానో పెరుగుతాయి :

5. సంగీతంలో తర్ఫీదు తీసుకోవడం వల్ల తార్కిక నైపుణ్యాలు ఎంతగానో పెరుగుతాయి :

మూడు సంవత్సరాలు ఆ పై వయస్సులో ఉన్న పిల్లలు ఎవరైతే సంగీత సాధనలో తర్పీదు తీసుకుంటున్నారో, వారు విబ్భిన్న రకాల ధ్వనిని త్వరగా గ్రహించే సామర్థ్యాన్ని మరియు యంత్ర సాధనమైన నైపుణ్యాలు మిగతా వారికంటే వీరిలో ఎక్కువగా ఉంటాయి.

6. సంగీతం మాదకద్రవ్యాల వ్యసనాలను దూరం చేస్తుంది :

6. సంగీతం మాదకద్రవ్యాల వ్యసనాలను దూరం చేస్తుంది :

మాదక ద్రవ్యాలు మీ మెదడులో సమాచారాన్ని చేరవేసే రసాయనాలను, అనగా నాడీ ప్రసారిణి పై ప్రభావం చూపుతుంది. సంగీతం కూడా ఈ రసాయనాల పైనే ప్రభావం చూపుతాయి కానీ కొద్దిగా విభిన్నంగా ఆ పనిని చేస్తాయి. మాదకద్రవ్యాలు మీ మెదడు ని సోమరిగా మార్చి ఈ రసాయనాలను త్వరగా ఉత్పత్తి చేయనివ్వవు. అవి మీ యొక్క శరీర వ్యవస్థ పై ప్రభావం చూపిస్తాయి. సంగీతం అనేది ఈ రసాయనాల ఉత్పత్తిని త్వరగా మరియు ఎక్కువగా సరైన సమయంలో జరగడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా నొరెపినెఫ్రిన్ మరియు డోపమైన్ రసాయనాలలో ఈ ప్రభావం అధికంగా కనపడుతుంది. కొన్ని రకాల సంగీతం రక్తపోటుని తగ్గించడానికి మరియు కండరాలలో ఉన్న ఒత్తిడిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువ గనుక ఉంటే, మీరు తీవ్ర అవిశ్రాంతికి లోనవుతారు మరియు ఇందువల్ల మీరు అధికంగా రసాయనాల పై ఆధారపడవలసి ఉంటుంది.

మ్యూజిక్ థెరఫీతో 5గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

7. మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది :

7. మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది :

రోగి ఎదో సంగీతం వినడం ద్వారా అతడికి ఏవో గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి, తన కుటుంబాన్ని విలన్లు ఏమి చేసారు అనే విషయం జ్ఞాపకం వచ్చి పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి బయలుదేరుతాడు. ఇటువంటి సంఘటనలు మన సినిమాలలో తరచు చాలా చూస్తుంటాం. అటువంటి సందర్భాలను సినిమాల్లో చూసినప్పుడు చాలామందికి నవ్వు కూడా రావొచ్చు. కానీ అంతర్లీనంగా అందులో దాగి ఉన్న అంశం ఏమిటంటే, అది నిజానికి చాలా దగ్గరగా ఉంది. అదేమిటంటే కొన్ని వైద్య పరిశోధనల ప్రకారం, సంగీతం రోగులు మరచిపోయిన కొన్ని జ్ఞాపకాలను తిరిగి గుర్తుకువచ్చేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందట . జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయిన వారిలో కూడా సంగీతం జ్ఞాపకాలను తిరిగి వారికి గుర్తుచేయడంలో ఎంతగానో సహకరిస్తుందట.

8. అనారోగ్యం భారిన పడకుండా కూడా సంగీతం సహాయపడుతుంది :

8. అనారోగ్యం భారిన పడకుండా కూడా సంగీతం సహాయపడుతుంది :

కొంతమంది వ్యక్తులు అతి సున్నితంగా ఉంటారు. విపరీతమైన శబ్దాలను లేదా గట్టి సంగీతాన్ని విన్నా అనారోగ్యం భారిన పడుతుంటారు. కానీ సౌమ్యమైన సంగీతాన్ని వినడం ద్వారా లేదా నచ్చిన సంగీతాన్ని వినడం ద్వారా అనారోగ్యం భారీ నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా కోమా లో ఉన్న వ్యక్తుల విషయంలో కూడా ఇది నిరూపితమైందని చెబుతున్నారు. ముఖ్యంగా పియానో నుండి వెలువడే సంగీతం మన మెదడు పై చాలా ప్రభావాన్ని చూపిస్తుందట.

9. సంగీతం మెదడు పై ప్రభావం చూపి ఉత్తేజపరుస్తుంది.

9. సంగీతం మెదడు పై ప్రభావం చూపి ఉత్తేజపరుస్తుంది.

ఉదాహరణకు ఏ వ్యక్తయినా అనారోగ్యం భారిన పడితే ఆ వ్యక్తికి గనుక పియానో ద్వారా సంగీతాన్ని గనుక వినిపిస్తే, వారు అనారోగ్యం భారీ నుండి బయటపడతారట. ఎందుకంటే ఆ సంగీతం మెదడు పై ప్రభావం చూపి ఉత్తేజపరుస్తుంది. అది కూడా సంగీతాన్ని వినడం మొదలుపెట్టిన కొద్దీ నిమిషాలకే ఈ మార్పు కనపడుతుందట. కానీ వాయిద్యకారులు లేదా విద్వాంసులు సృష్టించే సంగీతం ఎలా మెదడులో మార్పుని తీసుకొస్తుంది అనే విషయం సైన్స్ కూడా పరిపూర్ణంగా, సవివరంగా వివరించలేదు.

10. గుండె ఆరోగ్యానికి మంచిది:

10. గుండె ఆరోగ్యానికి మంచిది:

మెడిసినల్ ప్రొఫిషినల్స్ అభిప్రాయం ప్రకారం రిథమిక్ బీట్ హార్ట్ బీట్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు మీరు స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది, దాంతో గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, ఒత్తిడి లేకుండా జీవించడానికి మ్యూజిక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Unbelievable Ways In Which Music Affects You, As Per Science

The thing is, these days you listen to some amount of music every day whether you want it or not. For music has gained a certain level of omniscience-present in the mall, sometimes at the work place, definitely at the gym, and when you’re home it’s almost always blaring from the television.
Story first published: Thursday, October 12, 2017, 20:00 [IST]
Subscribe Newsletter