విడ్డూరం: రస గుల్లా కోసం పెళ్లి ఆగిపోయిందా? హాహా హాహాహా!

Posted By:
Subscribe to Boldsky

టైటిల్ చూసి ఇదే విచిత్రం అనుకోకండి..నిజంగానే ఇలాంటి విడ్డూరం ఒకటి రీసెంట్ గా జరిగింది. ఓ రసగుల్లా ఓ పెద్ద పెళ్లిని పెటాకులు చేసింది. అసలు ఏం జరిగిందో కొంచెం వివిరంగా తెలుసుకుందాం..

సాధారణంగా పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోతాయో మనకు తెలుసు. కట్నం సరిపోలేదనో, ఇంకా అధిక కట్నం ఇవ్వాలనో, బంగారం పెట్టలేదనో, బైక్ కొనీలేదనో, లేదా పెళ్లికొడుకు తాగుబోతు అనో ఇలా వివిధ రకాలుగా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. కానీ ఇప్పుడు రసగుల్లా(rasgulla) కోసం పెళ్లి ఆగిపోయింది. అదేంటి రసగుల్లా కోసం.. పెళ్లి ఆగిపోవడమేంటి.. ఇది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అని అనుకుంటున్నారా.. అవునండి నిజం మీరు చదవినది కేవలం రసగుల్లా కోసం పెళ్లి ఆగిపోయింది. ఈ సిల్లీ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక ప్రదేశంలో చోటుచేసుకుంది. రసగుల్లా ఎక్కువ మరొక్కటి అడిగితే పెట్ట లేదని వరుడి కుటుంబీకులు నానా రచ్చ చేశారు. దీంతో వధువు ఆ అతడితో పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.

అలర్ట్ : 35 ఏళ్ల లోపు పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుంది..??

కాగా, ఉన్నావ్‌ జిల్లాలోని కుర్మాపూర్‌ గ్రామానికి చెందిన శివ్‌కుమార్‌కి, అదే గ్రామానికి చెందిన కామినితో పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరి వివాహం రీసెంట్ గా నిర్ణయించారు. అయితే పెళ్లికి వరుడి బంధువులు కాస్త ఆలస్యంగా వచ్చారు. దీంతో ముందు విందు కార్యక్రమం అయిపోయాక పెళ్లి జరిపిద్దాం అని వధువు తరపువారు. ఇంకేముంది అందరికీ తెలిసిందే అందరు ఎంచక్కా విందును ఆరగిస్తున్నారు.

Wedding got cancelled over rasgulla

అయితే ఈ విందులో అందరికీ ఒక్కో రసగుల్లా మాత్రమే వడ్డించాలని వధువు బంధువులు నిర్ణయించారు. అలాగే వడ్డిస్తున్నారు వధువు బంధువులు. అలా వడ్డిస్తుండగా ఇంతలో వరుడి సోదరుడు తనకు మరొకటి రసగుల్లా ఎక్కువ కావాలని అడిగాడు.. దానికి వధువు బంధువు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఇరు వైపుల కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు ప్లేట్లు, స్పూన్లు విరుసుకున్నారు. గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయకతప్పలేదు.

పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రాశుల అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి..!

సమాచారం తెలుసుకుని వచ్చిన పోలీసులు ఇరువైపులా సర్ది చెప్పారు. అక్కడ ఉన్న పెద్ద మనుషులను పిలిచి మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. కానీ ఈ పెళ్లికి వధువు మాత్రం ససేమీర ఒప్పుకోలేదు. కేవలం రసగుల్లా కోసం పెళ్లిలో ఇలా చిల్లరగా గొడవకు దిగవడమేంటని నిలదీసింది. రసగుల్లా కోసం పెళ్లి వేడుకలో రచ్చ రచ్చ చేయడమే కాకుండా తన తండ్రి పై చేయిచేసుకున్నారని ఆమే నిందించింది. అతడితో నాకు పెళ్లికి ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో వరుడి బందువులు యూటర్న్ చేసుకోక తప్పలేదు.

అలర్ట్: ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు..!!

గొడవకు కారణం రసగుల్లాయే అయినా వారి వారి వ్యక్తిత్వాలు బయటపడేలా చేసిన ఆ సంఘటన ఇప్పుడు అక్కడ అందరిని షాక్ కు గురయ్యేలా చేసింది. ఇలాంటి కారణాల వల్ల కూడా పెళ్లిల్లు ఆగిపోతాయా అని ఈ న్యూస్ తెలిసిన వారు అందరు అనుకుంటున్నారు.

English summary

Wedding got cancelled over rasgulla

Marriages are broken over dowry or over the drinking habits of the groom, but have you ever heard of a marriage being called off following a dispute over an extra rasgulla?
Subscribe Newsletter