మీ ప్రొఫైల్ పిక్చర్ మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అని చెబుతున్న విజ్ఞాన శాస్త్రం

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు సామజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. ఇక సామజిక మాధ్యమాల్లోని తమ ఖాతాల్లో ఎప్పటికప్పుడు ప్రొఫైల్ పిక్చర్ ని మార్చడం అనేది ఒక అలవాటుగా మారింది. సామజిక మాధ్యమాల్లో పెట్టే ప్రొఫైల్ పిక్చర్ ద్వారా ఆ వ్యక్తి గురించి ఏమైనా తెలుసుకోవచ్చా ?

అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? సాధారణంగా చాలామంది వ్యక్తులు అన్నిటికంటే బాగున్న, ఉత్తమమైన చిత్రాలను మాత్రమే సామజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. కానీ, మీరు పెట్టే చిత్రాలు మీ గురించి మరియు మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను బయట ప్రపంచానికి తెలియజేస్తాయి అనే విషయం మీకు తెలుసా ?

గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి

మీరు పెట్టే ప్రొఫైల్ పిక్చర్ మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది అని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది.

మీరు పెట్టే ప్రొఫైల్ పిక్చర్ ద్వారా మీరు ఎటువంటి వ్యక్తులు అనే విషయాన్ని తెలుసుకోవడం ఎలా ? అనే విషయమై విశ్లేషాత్మక కథనం మీకోసం..

" నైతిక భావం " :

ఈ రకమైన వ్యక్తులు చాలా ప్రకృతి సిద్ధంగా రంగుల మయంగా మరియు ప్రకాశవంతంగా ఉన్న చిత్రాలను వాడుతుంటారు. విభిన్న రకాల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల యొక్క విభిన్న భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

" నిష్కాపట్యత " :

చాలా బాహాటంగా తమ భావాలను వ్యక్తపరిచే విధంగా ఉండాలి అని బలంగా నమ్మే వ్యక్తులు ఇటువంటి చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. మాములుగా ఇలాంటి పనులుచేసే వ్యక్తులకు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రాలు విరుద్ధంగా మరియు కళాత్మకంగా లేదా అసాధారణంగా ఉంటాయి. ఒకవేళ ప్రొఫైల్ పిక్చర్ గా ఎవరైనా వ్యక్తులు తమ ముఖానికి సంబంధించిన చిత్రాన్ని పెట్టినట్లయితే, ఆ చిత్రం సాధారణంగా పెట్టే చిత్రాలకంటే కూడా పెద్దదిగా ఉన్న ఫ్రేమ్ లో గనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు చాలా బాహాటంగా ఉంటారని అర్ధం.

" బహిర్వర్తనం " :

ఇటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా వివరించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే వీరు పెట్టే చిత్రాల్లో దాదాపుగా ఒక వ్యక్తి కంటే కూడా ఎక్కువ మందే ఉంటారు. సాధారణంగా ఎప్పుడు వీరి చుట్టూ ఎవరో ఒకరు ఉంటూ ఉన్న చిత్రాలనే పెడుతూ ఉంటారు. రంగులమయంగా ఉన్న చిత్రాలను మరియు ఎంతో బాగా నవ్వుతూ ఉన్న చిత్రాలను పెట్టడానికి వీరు ఇష్టపడుతుంటారు.

ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం : ముక్కు చూసి వ్యక్తిత్వం తెలుసుకోండి

" నరాల బలహీనత " :

చాలా తక్కువ రంగుతో కూడిన చిత్రాన్ని గనుక పెడితే అటువంటి వ్యక్తులలో సాధారణంగా ఎక్కువ నరాల బలహీనత ఉంది అని అర్ధం. ఏ వ్యక్తులకు అయితే నరాల బలహీనత ఎక్కువగా ఉంటుందో అటువంటి వ్యక్తులు చాలా శూన్యమైన వ్యక్తీకరణతో లేదా వారి యొక్క ముఖాలను కనపడకుండా ఉండేలా ఉన్న చిత్రాలను ఎక్కువగా పెడుతుంటారు.

" అంగీకరించే స్వభావము " :

విజ్ఞానశాస్త్రం ప్రకారం మంచి వ్యక్తులు ఎప్పుడు కాని ఉత్తమమైన ఫోటోగ్రాఫర్స్ అయి ఉండరు. వీళ్ళందరూ తరచుగా చాలా తక్కువ నాణ్యత కలిగిన వారి యొక్క చిత్రాలను సామజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. వీళ్ళు అటువంటి చిత్రాలు పెట్టినప్పటికీ అవి కూడా మాములుగా నవ్వుతూ ఉండేవో మరియు ప్రకాశవంతమైన చిత్రాలు మరియు చూడముచ్చటైన చిత్రాలు పెడుతుంటారు.

కాబట్టి, మీరు ఎటువంటి ప్రొఫైల్ పిక్చర్ ని పెడుతున్నారు ? మీ యొక్క అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి.

English summary

What Does Your Profile Picture Say About Your Personality?

Do you know that your profile picture can reveal a lot about your personality? From the background to the colours involved in the pictures, there are a few things that can be analyzed about a person with the help of profile pictures.
Story first published: Thursday, December 14, 2017, 9:00 [IST]