అందుకే ఆయన మహాత్మ అయ్యాడు!గాంధీ ధోతి వేసుకోవాలని ఎందుకు, ఎప్పుడు డిసైడ్ అయ్యాడు?

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మహాత్మగాంధీ.. స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని స్థానం సంపాదించుకున్న ధీరుడు. మన అందరి గుండెల్లో కలకాలం కొలువుండే మహనీయుడు. మరి అలాంటి గాంధీ గురించి తెలియని వారు ఉండరు. కానీ ఆయన ధరించిన దుస్తులకు సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ప్రారంభంలో గాంధీ ఒక కోట్, ప్యాంట్, టోపీ ధరించేవారు. తరువాత దోవతి, పొడవైన కోటు, తలపాగా ధరించడం ప్రారంభించారు గాంధీజీ. అనంతరం ఆయన ఖాదీతో తయారైన దుస్తులను మాత్రమే ధరించాలని భావించారు.

ఖాదీ చొక్కా, ఖాదీ శాలువా, ఖాదీ దోవతి, ఖాదీ టోపి, ధరించడం ప్రారంభించారు. అయితే ఇలా గాంధీజీ తన డ్రెస్సింగ్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ రావడానికి బలమైన కారణాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

 ఆయన యువకుడిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా వెళ్లారు

ఆయన యువకుడిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా వెళ్లారు

ఆయన యువకుడిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ తన తోటి ప్లీడర్స్, న్యాయవాదులతో కలిసి పని చేశారు. అందువల్ల అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా వెస్ట్రన్ స్టైల్ లో ఆయన అక్కడ బట్టలు ధరించారు.

మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే...!

దక్షిణాఫ్రికాలో భారతీయులు కోసం..

దక్షిణాఫ్రికాలో భారతీయులు కోసం..

అయితే అక్కడ భారతీయులు అణిచివేతకు గురయ్యేవారు. దీంతో ఆయన సత్యాగ్రహం చేపట్టారు. వేలాది మంది భారతీయులు ఆయన వెంట నడిచారు.వారంతా పేదలే. మరి వారందరి నాయకుడిగా తన నడవడిక ఎలా ఉండాలని ఆలోచించాడు గాంధీజీ. వెంటనే తన వేషధారణ మార్చేశాడు. తనతో పాటు ఉద్యమంలో పాల్గొనే సామాన్యుడిగా మారాలనుకున్నాడు. అందుకే తన వెస్ట్రన్ స్టైల్ కు గుడ్ బై చెప్పేశారు. ఒక లుంగీ, చొక్కా ధరించడం మొదలుపెట్టారు.

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం పోరాడారో.. అప్పుడే ఆ మదిలో మరో ఆలోచన వచ్చింది. తన మాతృభూమి భారతదేశంలో సాగుతున్న అరాచకాలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

వెంటనే ఇక్కడ స్వాతంత్ర్య ఉద్యమానికి నడుం బిగించారు. ఇక్కడ కూడా సత్యాగ్రహం, తదితర ఉద్యమాలు చేపట్టారు. అయితే ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కోటు, ప్యాంటు ధరించలేదు. తన జన్మస్థలం ఖతియావాడలో ధరించే సంప్రదాయ దుస్తులతోనే ఇక్కడ నౌక దిగారు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఒక పంచె, పొడవాటి కోటు ధరించారు.

సామాజిక మాధ్యమాల్లో కనపడే మహాత్మా గాంధీ నకిలీ చిత్రాలు ఇవే !

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

అలాగే ఒక అతని భుజంపై ఒక శాలువా, తలపాగా ధరించారు. ఇక ఇక్కడ స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన వేషధారణ ఒక పేద వ్యక్తి మాదిరిగానే ఉంటుంది.

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పడు..

అంతేకాదు అప్పట్లో తన 40కోట్ల సోదరీ సోదరిమనులు చినిగిన పాత బట్టలు వేసుకుంటూ జీవిస్తుంటే తాను మాత్రం ఖరీదైన బట్టులు ఎలా వేసుకుంటాను అనేది జాతిపిత భావన. అందుకే గాంధీజీ ప్రజల గుండెల్లో మహత్ముడయ్యాడు.

English summary

When and why did Gandhi decide to wear dhoti

The whole life of Gandhiji is full of sorrows. He had left no stone unturned in liberating the country. While walking on the path of truth, non-violence and religion, he had to take the British away from India.
Story first published: Monday, November 6, 2017, 22:00 [IST]
Subscribe Newsletter