కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. ఆ తర్వాత ఏమయ్యాడు?

Written By: Bharath
Subscribe to Boldsky

ఆమె నేటి తరానికి ఆదర్శం.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కసాయివాడికి కట్టబెట్టినా కాపురం చేసింది. కాళ్లు విరగొట్టినా అత్తమామలపై, భర్తపై కనికరం చూపింది. కానీ కన్న కూతురిపైనే తన భర్త అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే తనలోని కాళీకాదేవీ రూపాన్ని బయటకు తెచ్చింది. ఆ కామాందుడి తల నరికేసింది. ఇలా చేయడం తప్పు కాదు అంటూ న్యాయం స్థానం కూడా ఆమెను శిక్షించలేదు. ఇంతకు ఎవరు ఆమె.. ఎక్కడుంటారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ మీకోసం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత గాథ ఇది.

బ్యాంకు ఉద్యోగిని

బ్యాంకు ఉద్యోగిని

ఆమె పేరు ఉషా రాణి. వయస్సు 49 సంవత్సరాలు. ప్రస్తుతం ఈమె మదురైలోని ఓ బ్యాంకులో పెట్టుబడి సలహాదారుగా (ఇన్వెస్టిమెంట్ కన్సల్టెంట్ ) గా పనిచేస్తున్నారు. చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు. మెడలో ఒక ఐడీ కార్డు, చక్కని చీరకట్టులో చాలా సంప్రదాయంగా ఉంటారు. కానీ ఆమె గతం తెలుసుకుంటే మాత్రం షాక్ అవుతారు. ఆమె ఒక హత్య చేసింది ఆమె భర్తనే. ఐదేళ్ల క్రితం ఆమె తన మాజీ భర్తను చంపేసింది. ఫిబ్రవరి 9, 2012 ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. మరి ఈమె చేసిన నేరానికి జైలు, తర్వాత శిక్ష, కోర్టుల చుట్టూ తిరగడాలు ఉంటాయనుకుంటే పొరపాటు. ఆమె చేసిన నేరానికి ఒక్కరోజు కూడా జైలులో ఉండలేదు.

ప్రభుత్వాన్నే కదిలించింది

ప్రభుత్వాన్నే కదిలించింది

తమిళనాడుకు చెందిన ఉషారాణిది ఒక మధ్య తరగతి కుటుంబం. ఆమె హత్యకు పాల్పడిన విషయంలో అక్కడి రాష్ర్ట ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ఈ కేసు 2012 లో అక్కడే దుమారాన్నే రేపింది. ఆమె ఈ హత్య చేయడానికి గల కారణాలు మాత్రం అందిరినీ ఆలోచింపజేశాయి. ఉషకు 18 ఏళ్ల వయస్సులోనే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వాళ్ల కుంటుంబంతో కొన్ని ఏళ్లుగా పరిచయం ఉన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తికి ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు. ఉష ఇంటర్ వరకు చదివింది. కబ్బడీ, తదితర క్రీడల్లో ఆమె మంచి ప్రావీణ్యం చూపేది. పెళ్లి తర్వాత ఆమె ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. మరి తన వైవాహిక జీవితాన్ని.. ఆ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులను భర్తను చంపడానికి కారణాలను ఉష వెల్లడించారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే..

కసాయికిచ్చి కట్ట బెట్టారు

కసాయికిచ్చి కట్ట బెట్టారు

నా భర్త పేరు జ్యోతిబసు. 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు. చిన్నప్పటి నుంచి కాస్త అల్లరి చిల్లరగా తిరిగేవాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి వాడికిచ్చి నన్ను కట్టబెట్టారు. పెళ్లయ్యాక మా నాన్న జ్యోతిబసుకు ఆర్థికంగా సాయం చేసి ఒక చిన్న వ్యాపారం పెట్టించాడు. జ్యోతిబసు దాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయాడు. వ్యాపారాన్ని తర్వాతే నేనే కొద్ది రోజులు నడిపాను. కానీ మా కుటుంబం కోసం అది ఏ మాత్రం సరిపోయేది కాదు. ఇంట్లో అత్తమామల పోరు కూడా ఉండేది. ఇక మా ఆయన చెల్లెల్ని నా సోదురులో ఒకరికిచ్చి వివాహం చేయాలని మా అత్తమామలు భావించేవారు.

ఆ కారణంతో రోజూ వేధించేవాళ్లు

ఆ కారణంతో రోజూ వేధించేవాళ్లు

నా సోదరుల్లో ఇద్దరూ బాగా చదువుకున్నారు. పెద్ద అన్న బ్యాంక్ జాబ్ లో అప్పుడే జాయినయ్యాడు. అతనికి అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. ఇక చిన్న అన్న ఎంఫీల్ చేసేవాడు. వారిద్దరూ మా ఆయన చెల్లెల్ని చేసుకోవడానికి ఇష్టపడలేదు. అస్సలు చేసుకోమన్నారు. దీంతో నాకు మా అత్తాగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. నన్ను ప్రతి రోజు కొట్టేవారు. తిట్టేవాళ్లు.

నా కూతురికి చిన్నప్పుడే పెళ్లి చెయ్యలనుకున్నారు

నా కూతురికి చిన్నప్పుడే పెళ్లి చెయ్యలనుకున్నారు

నా పెద్ద కుమార్తెకు 14 ఏళ్లు రాగానే చదువు మాన్పించి వెంటనే ఆమెకు పెళ్లి చేయాలని మా అత్తమామలు భావించారు. మటన్ కొట్టు లో పని చేసేవాణ్ని చేసి నా బిడ్డను కట్టబెట్టాలనుకున్నారు. దీనికి నేను అస్సలు అంగీరకరించలేదు. అంత వరకు వాళ్లు ఎన్ని హింసలు పెట్టినా భరించిన నేను ఈ విషయంలో మాత్రం తిరగబడ్డాను. మా అత్తమామలకు ఎదురించి మాట్లాడాను.

తనకు చదువుకోవాలని ఉండేది

తనకు చదువుకోవాలని ఉండేది

నా కూతురికి చదువంటే చాలా ఇష్టం. బాగా చదివేది. ఇంట్లో జరుగుతున్న విషయాన్ని నేను పాఠశాలలో హెడ్ మిస్ట్రెస్ కు చెప్పాను. ఆమె నీవేమీ భయపడొద్దు... నీ కూతురు చదువుకునేలా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చింది.

నా కాళ్లు విరగొట్టారు

నా కాళ్లు విరగొట్టారు

ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మా అత్తమామలు, నా భర్త కలిసి నన్ను చావబాదారు. ఇష్టానుసారంగా కొట్టారు. నా కాళ్లు విరగొట్టారు. ఇళ్లు మొత్తం రక్తసిక్తమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో అక్కడే ఉన్న నా రెండేళ్ల కొడుకు వాళ్ల మధ్యలోకి రావడంతో కూడా గోడకేసి బాదారు. అరుపులు, కేకలకు ఇంటి పక్కనే ఉన్నవాళ్లంతా వచ్చి ఆదుకున్నారు. నన్ను ఇంటిపక్కల ఉన్న వాళ్లే ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు రావడంతో వారికి అంతా వివరించాను. వారు కేసు ఫైల్ చేసుకున్నారు. 2003 లో ఈ సంఘటన జరిగింది.

పుట్టింటికి వెళ్లి పోయా

పుట్టింటికి వెళ్లి పోయా

తర్వాత పిల్లలతో కలిసి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాను. నా సోదరులు నాకు అండగా నిలిచారు. మళ్లీ చదువుకోమని భరోసానిచ్చారు. ఒక రాక్షసుల ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా. మా పుట్టించి వాళ్లు ఇచ్చిన ఆభరణాలు, వరకట్నం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే మా అత్తమామలు నేను వాళ్లను వ్యాపారంలో మోసం చేసి డబ్బు కాజేసని ఆరోపించారు. వాళ్లు నాపై లేనిపోని ఆరోపణలు చేశారు.

ఉద్యోగం, చదువు ప్రారంభించా

ఉద్యోగం, చదువు ప్రారంభించా

మధురైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నేను మొదట ఉద్యోగంలో చేరాను. అక్కడ కంప్యూటర్ కు సంబంధించిన నాలెడ్జ్ పెంచుకున్నారు. మెలకువలన్నీ నేర్చుకున్నారు. అలాగే తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువును కొనసాగించేందుకు 2007 లో ఆమె అక్కడ జాయినయ్యారు.

సైకాలజీలో పీజీ పూర్తి చేశా

సైకాలజీలో పీజీ పూర్తి చేశా

మొదట డిగ్రీ, తర్వాత సైకాలజీలో పీజీ పూర్తి చేశారు. నా పెద్ద కుమార్తె వేరే సిటీలో చదివేది. మిగతా ఇద్దరు కూతుర్లు నాతో పాటే ఉండేవారు. నా కుమారుడు 10 వ తరగతి చదివేవాడు. నా పిల్లలు అంతా హ్యాపీగా ఉండాలనే నా భర్తను నేను వదిలిపెట్టాను. వారి కోసం అహర్నిశలు కష్టపడుతూ జీవనం సాగిస్తూ వచ్చాను.

లీగల్ గా విడిపోయాం

లీగల్ గా విడిపోయాం

నా భర్త నుంచి నేను లీగల్ గా విడిపోయాను. అయినా జ్యోతిబసు నన్ను వేధించేవాడు. నేను పని చేసే చోటుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. నేను చదివిన విశ్వవిద్యాలయంలోని ఒక సూపర్ డెంట్ తో నాకు సంబంధం ఉందంటూ అందరికీ చెప్పేవాడు.

చివరకు క్షమాపనలు కోరాడు

చివరకు క్షమాపనలు కోరాడు

నేను మారిపోయాను. నన్ను క్షమించమంటూ కోరాడు. కాళ్లపై పడ్డాడు. అప్పటికే అతను బాగా అనారోగ్యానికి గురై ఉన్నడు. అయినా ఒక్క పక్క ఏదో సందేహం. మళ్లీ ఏం చేస్తాడోననే భయం మొదలైంది. నా పిల్లలేమో ఏం కాదులే అమ్మా అని అన్నారు. దీంతో మాతో పాటు ఉండేందుకు అంగీకరించాను.

అతనికి ఎయిడ్స్ ఉండేది

అతనికి ఎయిడ్స్ ఉండేది

నేను అతని తల్లిదండ్రులపై పెట్టిన కేసును ఉపసంహరించుకోమని బలవంతం చేశాడు. నేను మీ తల్లిదండ్రులకు ఇచ్చిన సొమ్మును తిరిగిస్తే ఉపసంహరించుకుంటానని చెప్పాను. ఆ తర్వాత రోజు ఫుల్ గా తాగి ఇంటికి వచ్చాడు. బాగా ఆకలిగా ఉందన్నాడు. తినడానికి అన్నం పెట్టాను. నాకు ఉన్న ఆకలి ఇది కాదంటూ ఏదో చేయబోయాడు. కానీ నాకు భయం వేసింది. ఎందుకంటేకొన్ని నెలలు క్రితం డాక్టర్లు జ్యోతిబసుకు ఎయిడ్స్ ఉందని చెప్పారు.

ఇతర మహిళలతో సంబంధాలు

ఇతర మహిళలతో సంబంధాలు

మా ఇద్దరి వివాహం అయ్యాక కూడా అతనికి చాలామందితో లైంగిక సంబంధాలుండేవి. దాంతో ఆయన ఆ వ్యాధి బారిన పడ్డారు. జ్యోతిబసు నన్ను ఇబ్బంది పెట్టడం చూసిన నా రెండో కూతురు తండ్రిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించింది.

కూతురిని గదిలోకి తీసుకెళ్లిన కసాయి

కూతురిని గదిలోకి తీసుకెళ్లిన కసాయి

మీ అమ్మ ఎలాగో రానంటుంది. నీవైనా రా అంటూ నా రెండో కూతుర్ని గదిలోకి ఈడ్చుకెళ్లాడు. తర్వాత తనపై అత్యాచారం చేయబోయాడు. నా కూతురు అరుస్తోంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనే నా కొడుకు ఆడుకునే బ్యాట్ కనపడింది. రూమ్ కిటికి పగలగొట్టి లోనికి వెళ్లా. అయినా వాడు కూతురిని బలవంతం చేస్తూనే ఉన్నాడు. బ్యాట్ తో తలపై కొట్టా. ఆ కసాయి చచ్చే వరకు బాదాను. చంపేశాను.

పోలీసులు పరిస్థితి అర్థం చేసుకున్నారు

పోలీసులు పరిస్థితి అర్థం చేసుకున్నారు

తర్వాత నన్ను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ వారికి ఈ కథ అంతా చెప్పాను. సెక్షన్ 100 కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ చట్టం తమిళనాడు లో మొట్టమొదటగా ఉపయోగించారు. మేజిస్ట్రేట్ ముందు నేను, నా పిల్లలు జరిగిన సంఘటన వివరించాం. వాళ్లు పరిస్థితిని అర్థం చేసుకుని శిక్ష విధించలేదు.

ప్రశాంత జీవనం

ప్రశాంత జీవనం

నేను సైకాలజీలో పీజీ చేశాను. ఇప్పుడు బ్యాంక్ లో పని చేస్తున్నాను. నా నలుగురు పిల్లలను బాగా చదివించుకున్నాను. ఇప్పుడు ప్రశాంత జీవనం సాగిస్తున్నాం.అయితే మన దేశంలో నిత్యం కొన్ని లక్షల మంది ఇలా గృహహింస గురవుతూనే ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా ఉషారాణి మాదిరిగా ఎదురు తిరిగి పోరాడరు.

చైతన్యంరావాలి

చైతన్యంరావాలి

మగవారందరూ ఇలా ఉంటారని కాదు. కొందరు జ్యోతిబసులాగా కూడా ఉంటారు. అలాంటి వారిని ఎదురించడంలో నేటి మహిళలకు ఉషారాణి ఆదర్శంకావాలి. జీవితంలో వచ్చే కష్టాలను ఎదురించి నిలబడే సత్తా ఉండాలి. అన్యాయానికి ఎదురుతిరిగితే కచ్చితంగా భగవంతుడు అండగా నిలుస్తాడు.. మీకు విజయం చేకూరుస్తాడు.

English summary

women killed her husband save her family

Usha Rani killed her ex- husband to save her family, how this TN woman has turned her life around.
Story first published: Thursday, November 30, 2017, 15:31 [IST]
Subscribe Newsletter