For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన మూడో కంటిని యాక్టివేట్ చేసి కళ్ళకు గంతలు కట్టుకుని చదివేసే అద్భుతమైన పిల్ల!!

మనము అందరిచేతా అశీర్వది౦చబడి అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నారు అనుకుంటున్నారా? మాటలు బానే ఉన్నాయి, కదా? మాయలతో తమ అద్భుతమైన సహజ శక్తులను ఉపయోగించి ఇతరులను మోసం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అద్భ

By Gandiva Prasad Naraparaju
|

మనము అందరిచేతా అసీర్వది౦చబడి అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాము అనుకుంటున్నారా? మాటలు బానే ఉన్నాయి, కదా? మాయలతో తమ అద్భుతమైన సహజ శక్తులను ఉపయోగించి ఇతరులను మోసం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

కానీ అద్భుత శక్తులు గల ఒక ;చిన్న పిల్ల, తనకుతానే యోగమాత అమ్మ అని చెప్పుకోవడం మీరు విన్నారా? ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని చదువుతుందిట, మీరు ఆమె సూపర్ పవర్స్ గురించిన వీడియో చూస్తే మాలాగే ఆశ్చర్యపోతారు!

మీరు ఇది కూడా చదవాలి అనుకుంటున్నారా: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మూఢనమ్మకాలను అనుసరిస్తున్నారు .

కళ్ళకు గంతలు కట్టుకుని ఏదైనా చదివే ప్రత్యేక ప్రావీణ్యత కలిగిన ప్రపంచంలోనే అద్భుతమైన చిన్న పిల్ల యోగమాత అమ్మ వివరాలు కొన్నిటిని ఇక్కడ చూద్దాము.

మా యోగమాత ఎవరు?

మా యోగమాత ఎవరు?

ఈమె నార్త్ కరోలినా కు చెందిన 9 సంవత్సరాల అమ్మాయి. ప్రత్యేకంగా, ఆమె మూడో కన్ను ఉన్న అమ్మాయిగా టాగ్ చేయబడుతుంది, ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని పసిగడుతుంది, పనిచేస్తుంది! ఈ శక్తి అభ్యాస సామర్ధ్యం అని యోగమాత చెప్తుంది.

ఆమె ఎలా చదవగలదు?

ఆమె ఎలా చదవగలదు?

ఆమె భారతదేశంలోని గురుకుల వద్ద కోర్సుకు హాజరైన తరువాత కళ్ళకు గంతలు కట్టుకుని చదివే సామర్ధ్యాన్ని నేర్చుకుంది. ఈ కోర్సును గురు నిత్యానంద ప్రారంభించారు.

ఆమె సామర్ధ్యాలలో ...

ఆమె సామర్ధ్యాలలో ...

ప్రారంభంలో, ఇది ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేసే ట్రిక్ అని అనుకున్నారు, కానీ ఆమె తన శక్తులను బైటపెట్టిన తరువాత, ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని చదవడం, ఆటలు ఆడడం, బొమ్మలు గీయడం మొదలైనవి చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు! దీనితోపాటు, ఆమె పెద్ద రద్దీలో కూడా రేసు కార్ లను, సైకిలు కూడా నడుపుతానని చెప్పింది!!

ఆమె సెమినార్లలో ఆమె కూడా...

ఆమె సెమినార్లలో ఆమె కూడా...

ఆమె ప్రజా ప్రదర్శనలలో, కళ్ళకు గంతలు కట్టుకుని పుస్తకాలూ చదవడమే కాకుండా టిక్-టాక్ ఆడడం, ప్లాస్టిక్ డౌ నట్స్ అమరికను కూడా అనుసరిస్తుంది! కళ్ళకు గంతలు కట్టుకుని చదివే తంత్రాన్ని నేర్చుకున్న తరువాత తన కూతురు చాలా కాన్ఫిడెంట్, పాజిటివ్ గా తయారయిందని ఆమె తల్లి చెప్పింది.

ఈ సామర్ధ్యం నిజమేనా లేదా మోసమా?

ఈ సామర్ధ్యం నిజమేనా లేదా మోసమా?

ఈమె సామర్ధ్యాన్ని ప్రదర్శించిన అనేక వీడియోలు గొడవలకు దారితీసాయి, ఈ వార్తలు నిజమైనవా కాదా అనే విషయంపై పాఠకుల మదిలో అనేక ప్రశ్నలు రేకెత్తించాయి, ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

మన ఉద్దేశ్యం

మన ఉద్దేశ్యం

ఇది నిజమైన సామర్ధ్యమా లేదా ప్రజలను మోసం చేసి, డబ్బు సంపది౦చడానికా అని మేము ఆశ్చర్యపోయాము, ఆ అమ్మాయి నకిలీ పేరు ద్వారా ఉండడమే కానీ ఆమె గురించి కానీ, ఆమె కుటుంబ వివరాల గురించి పెద్దగా వివరాలు వెల్లడికాలేదు.

ఏది ఏమైనా, నమ్మలేని ఈ వీడియోని చూసి, మీకు మీరే నిర్ణయించండి

అంతేకాకుండా, మీకు కళ్ళకు గంతలు కట్టుకునే చదివే సామర్ధ్యం వస్తే మీరు ఏమి చేస్తారో తెలుసుకోండి?

English summary

Yogamaatha: The Girl With A Third Eye

Yogamaatha is a nine-year-old girl from North Carolina. She has a third eye where she can sense and act even when she is blind-folded. She claims that she can read anything that is given to her while she is blind-folded.
Story first published:Wednesday, December 6, 2017, 14:23 [IST]
Desktop Bottom Promotion