దిన ఫలాలు: ఆదివారం 3 డిసెంబర్ 2017

Posted By: DEEPTI
Subscribe to Boldsky

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ వారఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది. 3-12-2017 వ తారీఖు, ఆదివారం నాటి వారఫలాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత రుతువు, మార్గశిర మాసం, పౌర్ణమి రాత్రి 10 గంటల 03 నిమిషాల వరకూ ఉంది. కృత్తికా నక్షత్రం ఈ రోజు 10 గంటల 01 నిమిషం వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 10 గంటల 05 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి ఒంటి గంట నుండి రెండున్నర వరకూ ఉంది. దుర్ముహర్తం సాయంత్రం 3 గంటల 54 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 18 నిమిషాలకు మొదలై, సూర్యాస్తమయం 5.18 నిమిషాల వరకూ ఉన్నది.

మేష రాశి వారికి:

మేష రాశి వారికి:

చేయు ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. సరుకుల కొనుగోళ్ళు లాభిస్తాయి. తండ్రి ద్వారా చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య సహకారం ఉంటుంది. బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తారు. చేయు వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృషభ రాశి వారికి:

వృషభ రాశి వారికి:

తలచిన కార్యక్రమాలు నెరవేరతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూల దాంపత్యం ఉంటుంది. పనివారి సహకారం కూడా ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. అడ్డంకులు తొలగి విజయం సాధిస్తారు.

మిథున రాశి వారికి :

మిథున రాశి వారికి :

చేయు పనులు ఆటంకాలతో సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అప్పులు చేయవలసి ఉంటుంది. భార్యతో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి వారికి :

కర్కాటక రాశి వారికి :

బంధు మిత్రుల పరిచయాలు ఉంటాయి. చేయు పనులలో ఆటంకాలు తగులుతాయి. ఇంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అధికారుల వలన లాభాలు కలవు. పిల్లలు ఆనందాన్ని కలుగచేస్తారు. బంధు లాభం ఉంటుంది.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల సహకారం ఉంటుంది. మాతృసుఖం కలదు. పిల్లల యెడల బాధ్యత అవసరం. దైవదర్శన ప్రాప్తి కలదు.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

మీరు చేయు ప్రణాళికలు ఫలిస్తాయి. వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. కుటుంబ పెద్దలతో ఆనందంగా గడుపుతారు. పని వారి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

సోదరుల సహకారంతో చేయు పనులు ఫలిస్తాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అవకాశాలు చేజారకుండా ప్రయత్నం చేయాలి.

వృశ్చిక రాశి వారికి :

వృశ్చిక రాశి వారికి :

ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. భార్య సహకారంతో ఇంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. ధనం కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మికత మనసుపై ప్రభావం చూపిస్తుంది.

ధనూ రాశి వారికి :

ధనూ రాశి వారికి :

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధన ఇబ్బంది కలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య పట్ల ప్రేమ చూపించండి. లావాదేవీలు బాధ్యతగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి :

మకర రాశి వారికి :

తలచిన పనులు పూర్తి చేయడానికి శ్రద్ధ అవసరం. పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటారు. భార్య సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అధికారుల మెప్పు పొందుతారు. బంధు మిత్రుల రాకపోకలు ఉంటాయి.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

పనులు పూర్తి చేయటంలో సఫలమవుతారు. ఇంటి వ్యవహారాలు చక్కగా పూర్తి చేస్తారు. తల్లిగారి సౌఖ్యం చూస్తారు. పని వారి సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి వారికి :

మీన రాశి వారికి :

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరులతో ప్రేమగా వ్యవహరిస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు.

ఈ వారం ఫలితాలు ఆలకించారు కదా! వీటిల్లో ఏమైనా సందేహాలుంటే నన్ను కాంటాక్ట్ చేయండి.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

horoscope for 3rd December 2017 | daily horoscope | astrology

Check out your daily horoscope for 3rd December 2017.The half man half horse in the Sagittarius Zodiac stands for philosophy and duality of things. The Sea goat of Capricorn, represent Spiritual wisdom, thing which Capricorns are widely known for. The Water-bearer in Aquarius has strong feelings for justice and human rights. Two fish of Pisces Stands for spiritual and political belief as well as self-fulfilment.