మార్చి31 వ తేదీన వచ్చే బ్లూ మూన్ మీ రాశిచక్రాలపై చూపే ప్రభావాలు ఇవే..!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మార్చి 31 కేవలం బ్లూ మూన్ డే మాత్రమే కాదు, ఈస్టర్ డే కూడా. బ్లూమూన్ ఈ 2018 లో రెండవసారి వస్తుంది కానీ ఇది మరలా 2020 అక్టోబర్ 31 వరకు రాదు. కావున ఔత్సాహికులకు మార్చి 31 బ్లూ మూన్ నిజంగా ఒక పండుగ వాతావరణాన్నే తెస్తుంది అనడం అతిశయోక్తి కాదు.

ఈ వ్యాసంలో మీ రాశి చక్రాల పై ఈ బ్లూమూన్ ప్రభావం ఎలా ఉండబోతుందో వివరిస్తున్నాం.

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

ఈ రాశిచక్రానికి సంబంధించిన వ్యక్తులు ప్రేమించబడడానికి సిద్దంగా ఉండాలి. వీరికి ప్రేమ లేదా సంబంధాల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలు, సంబంధాలతో ప్రేమానురాగాల మద్య ఈ సంవత్సరం గడుస్తుంది. అదేవిధంగా సంవత్సరం చివరి భాగంలో కొన్ని సంబంధాల విషయములో సమస్యలు కూడా ఎదురు కావొచ్చు. కావున యే విషయానికైనా సిద్దంగా ఉండమని సూచించబడుతుంది.

వృషభం: ఏప్రిల్ 20 మే 20

వృషభం: ఏప్రిల్ 20 మే 20

ఈ సంవత్సరం మీ జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అనగా మీరు ఏదైనా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నా , ఇష్టంలేని సంబంధాలనుండి బయటకి వెళ్ళాలి అని భావించినా, లేదా ఇష్టంలేని ప్రదేశం నుండి వెళ్లిపోవాలని కోరుకున్నా కూడా జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

మిధునం మే 21- జూన్ 20

మిధునం మే 21- జూన్ 20

వీరి నిర్ణయాలకు సంబంధించి ఒక భారీ మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కావున కొన్ని విపత్కర పరిస్థితులకు సిద్దపడాల్సినదిగా సూచించడమైనది. వీరు ఈ సమస్య నుండి తెలివిగా తప్పించుకోవచ్చు లేదా , సమస్య తో పాటూ నడవవచ్చు కూడా . ఒకవేళ వీరు సమస్యతో పాటు కదిలితే మాత్రం సంతోషం గురించిన ఆలోచనలు చేయలేరు.

కర్కాటకం జూన్ 21 –జూలై 22

కర్కాటకం జూన్ 21 –జూలై 22

జీవితానికి సంబంధించిన విషయాలలో ఒక పెద్ద రిస్క్ చేయబోయే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా వీరు అనేక విషయాలను దారికి తీసుకుని రాగలరు, లేదా మొదలుపెట్టిన చోటికే వచ్చే అవకాశాలు లేకపోలేదు. కావున మానసిక స్థైర్యంతో ముందుకు సాగవలసినదిగా సూచించడమైనది.

సింహం జులై 23 ఆగస్ట్ 23

సింహం జులై 23 ఆగస్ట్ 23

అనేకమంది వ్యక్తులు వీరి నాశనంకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ విషయం మీకు త్వరలోనే అర్ధమవుతుంది. కానీ మీ ఎదుగుదలే వీరికి గుణపాఠం అయ్యే అవకాశాలు లేకపోలేదు. దేనికీ భయపడవద్దు, మీరు అనుకున్న మార్గంలో మీ కష్టానికి తగిన ఫలితం తద్వారా గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా అనేకమందికి చక్కటి గుణపాఠాన్ని ఇవ్వగలరు .

కన్య ఆగస్టు 24 సెప్టెంబర్ 23

కన్య ఆగస్టు 24 సెప్టెంబర్ 23

ఈ రాశులవారు ఎక్కువగా ఆద్యాత్మిక ధోరణి వైపునకు మొగ్గు చూపే అవకాశంలేకపోలేదు. కానీ, వీరు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా నిలిచే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో వీరు చూపే తెలివితేటలు, తీసుకునే నిర్ణయాల ద్వారా సమాజంలో మరియు కుటుంబంలో తగిన గుర్తింపు లభిస్తుంది.

తులా రాశి: సెప్టెంబర్ 24 Oct 23

తులా రాశి: సెప్టెంబర్ 24 Oct 23

వీరు కొందరిని అధికంగా ప్రేమించడం లేదా ఆరాధించడం వంటివి చేస్తుంటారు. కానీ వారి అసలు రూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మీ సంబంధాలు విచ్ఛిన్నం దిశగా కూడా అడుగులు పడవచ్చు. కావున జాగరూతులై వ్యవహరించడం మేలు.

వృశ్చికం అక్టోబర్ 24 నవంబర్ 22

వృశ్చికం అక్టోబర్ 24 నవంబర్ 22

వీరు ప్రేమ వ్యవహారిక సంబంధాల గురించిన తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరు మనసుకు నచ్చని సంబంధాలలో ఉండలేరు. తద్వారా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. కావున వీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మేలు.

ధనుస్సు నవంబర్ 23 డిసెంబర్ 22

ధనుస్సు నవంబర్ 23 డిసెంబర్ 22

వీరు మనశ్శాంతి కోసం మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వీరికి ఈ సంవత్సరం సరికొత్తగా ఉండబోతుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, వంటివి చేస్తారు. మానసిక స్వేచ్ఛకు పూర్తిగా విలువనిస్తారు, వ్యక్తిగత స్వాతంత్ర్యం దృష్ట్యా వీరి అడుగులు ముందుగు సాగుతాయి.

మకరం డిసెంబర్ 23 జనవరి 20

మకరం డిసెంబర్ 23 జనవరి 20

ఈ బ్లూమూన్ వీరి పరo గా కొంచం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. వీరు అన్నిటిని సాధించి ఉత్తమమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలతో జీవనం గడుపు సమయాన, ఒక విపత్కర పరిస్థితికి లోనయ్యే అవకాశం ఉంది. కావున మానసికంగా సన్నద్దులు అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జీవితం పై పెద్ద ప్రభావం చూపజాలదు , ఒక గుణపాఠాన్ని మాత్రం నేర్పే అవకాశం ఉంది.

కుంభం జనవరి 21 ఫిబ్రవరి 18

కుంభం జనవరి 21 ఫిబ్రవరి 18

వీరు తమ ప్రియమైన వారి నుండి నాటకీయంగా తిరుగుబాటుని ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా వీరు సంబంధాలపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తారు. కానీ గొడవలు త్వరలోనే సర్దుకుంటాయి. కావున తీవ్రమైన నిర్ణయాలకు మాత్రం అవకాశాలు ఇవ్వకండి.

మీనం ఫిబ్రవరి 19 మార్చి 20

మీనం ఫిబ్రవరి 19 మార్చి 20

వీరు కలల ప్రపంచంలో మేడలు కట్టుకుని అదే నిజజీవితం అనుకుని భ్రమపడుతుంటారు, తద్వారా వీరు నిజజీవితంలో చుట్టూ ఉన్న సంబంధాలను లెక్కచేయని తత్వాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా ఈ సంవత్సరం బ్లూమూన్ కారణంగా ప్రేమ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కావున వీరు నిజజీవితాన్ని కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది.

English summary

31st March Blue Moon Will Affect Your Relationships

On March 31, 2018 there are 3 events happening, which are Passover, Easter and April Fools' Day. Apart from this, there is also a beautiful blue moon which will guide your love life and affect the romantic relationships of each zodiac sign.Astrology experts reveal that each of the zodiac signs will undergo an impact.