For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ రాశిచక్రాల ప్రకారం ఈ ఏప్రిల్ లో మీకు ఇవ్వదగిన సూచనలు

  |

  మీ రాశిచక్రాల ప్రకారం ఈ ఏప్రిల్ లో మీకు ఇవ్వదగిన సూచనలు .వారాలు మరియు నెలల రాశిఫలాల ఆధారంగా ఈ ఏప్రిల్ లో మీ రాశిచక్రాల ఇవ్వదగిన సూచనలను క్రింద పొందుపరచబడినది.

  ఈ క్రింది సూచనలు సూర్యమాన సిద్దాంతం ప్రకారం సూచించబడినవి.

  మేషం మార్చి 21 – ఏప్రిల్ 19

  మేషం మార్చి 21 – ఏప్రిల్ 19

  అకారణమైన , హేతుబద్దం కాని నిర్ణయాలకు ఫుల్స్టాప్ పెట్టండి. ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆలోచించే ముందు మీ మనసులోని ప్రతికూల అంశాలనన్నింటినీ తొలగించి, తర్వాతే నిర్ణయానికి రావడం మంచిది. లేదా తొందరపాటు నిర్ణయాలు జీవితకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

  వృషభం ఏప్రిల్ 20-మే 20

  వృషభం ఏప్రిల్ 20-మే 20

  మీరు ప్రేమించినంతగా ఇతరులు మిమ్ములను ప్రేమించకపోవచ్చు, కానీ ఇందుచేత వాళ్ళ మీద ప్రేమను తగ్గించమని కాదు. మీమీద ఒక్కొక్కరు ఒక్కోరకమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. మీ మనసుకు దగ్గరగా ఉన్నవారికి కూడా మీరు అర్ధం కాకపోవచ్చు. కానీ మీరేంటో వారికి తెలియడానికి కాస్త సమయం పట్టవచ్చు. కావున మీరు ప్రేమించడం మానకండి, కానీ ఇతరుల నుండి అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచనను మాత్రం పక్కనపెట్టాలి.

  మిధునo మే21- జూన్20

  మిధునo మే21- జూన్20

  ఇతరులు భావించినట్లు మీ జీవితం ఉండడం కాదు, మీకు నచ్చేలా మీ జీవితం ఉండాలి. మీ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోండి, మరియు కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్లకూడదు అన్న మాటను మీరు గుర్తుపెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. లేనిచో ఆర్ధికంగా కూడా సమస్యలు ఎదుర్కొంటారు.

  కర్కాటకం జూన్ 21- జూలై 22

  కర్కాటకం జూన్ 21- జూలై 22

  మీ తప్పులకు ఇతరుల మీద నిందలు వేయడం తగ్గించాలి. ఈ అలవాటు కొనసాగితే జీవితాంతం అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అందరూ ఇలాగే ఉండకపోవచ్చు. కానీ పరిస్థితుల నుండి తప్పుకోవడానికి ఈ మార్గం ఎంచుకోవడం సరికాదు. మీరు మీ గడిచిన కాలం నుండి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు, తద్వారా మీ జీవితానికి అవసరమయ్యే ప్రణాళికలను ఏర్పరచుకోవడానికి భాద్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  సింహం జూలై23- ఆగస్ట్ 23

  సింహం జూలై23- ఆగస్ట్ 23

  అవతలి పొలం పచ్చగా ఉంది అంటే , మీ పొలానికి ఎక్కువ నీళ్ళు పట్టాలని అర్ధం. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలన్న ఆలోచన మీది, కానీ ఏదో కోల్పోయామన్న ఆలోచనలో ఉంటారు. మిమ్ములను మీరు ప్రేమించడం మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టడం చేయాలి. లేకుంటే కోల్పోయామన్న భావన కాదు, కోల్పోవచ్చు కూడా.

  కన్య ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

  కన్య ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

  మిమ్ములను ఒక ఎంపికగా భావించేవారి గురించి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇది మీ సమయం వృధా చెయ్యడం తప్ప మీ జీవితానికి ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వదు. ప్రతికూల ప్రభావిత వ్యక్తులను దూరం చేసిన రోజు మీ విలువ మీకే తెలీకుండా పెరుగుతుంది. మిమ్ములను మీరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాతే ఎవ్వరైనా.

  తుల సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

  తుల సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

  మీకు నచ్చిన అంశాలను ఎంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం, తద్వారా వాటికై ప్రయత్నించాలి. అనవసర విషయాలు, మీ జీవితాన్నే ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మీ ప్రియమైనవారితో మీకు సంబంధించిన మంచి చెడులను చర్చించుకోవడం ద్వారా, మీకు స్వావలంబన కుదురుతుంది. తద్వారా మీ కలల సాకారానికై, మీ లక్ష్య సాధన దృష్ట్యా సానుకూల ఫలితాలను కూడా పొందగలరు.

  వృశ్చికం అక్టోబర్ 24- నవంబర్ 22

  వృశ్చికం అక్టోబర్ 24- నవంబర్ 22

  మీ జీవితానికి సంబంధించి ఏ ఒక్కరూ కూడా భాద్యత కలిగిలేరన్న విషయాన్ని మీరు గుర్తించాలి, తద్వారా మీ జీవితాన్ని ఇతరుల గురించి కాకుండా మీకోసం మీ కుటుంబంకోసం వెచ్చించేలా ప్రణాళికలు వేసుకోవాలి. కొందరు ప్రతికూల ప్రభావాలను సృష్టించే అవకాశం లేకపోలేదు, ముఖ్యంగా ఇతరులు. కొందరు వారి సమస్యలకు మిమ్ములను పావుగా వినియోగించుటకు ప్రయత్నిస్తుంటారు, వీరెవరూ మీ జీవిత గమనంలో ఉపయోగపడరు. ఆ ప్రతికూల మనస్కులను పక్కన పెట్టి మీ లక్ష్య సాధన గురించిన ఆలోచనలు చేయడం మంచిది.

  ధనుస్సు నవంబర్ 23-డిసెంబర్ 22

  ధనుస్సు నవంబర్ 23-డిసెంబర్ 22

  మీకు సంబంధించిన ప్రతి అంశమూ మీ దృష్టికోణం మీదనే ఆధారపడి ఉంటుంది. తద్వారా పరిస్థితులను మీరు పరిష్కరించే విధానాలు ఉంటాయి. కొందరు తమ తప్పులను తెలుసుకోకుండా ప్రవర్తించే విధానం మీకు కోపం తెప్పిస్తుంది. కానీ అన్నీ వేళలా కోపం పనికిరాదు, మీ భావోద్వేగాలను నియంత్రించుకునే దిశగా మీ అడుగులు ఉండాలి. తద్వారా మీ లక్ష్యసాధనలో ప్రతికూల అంశాల ప్రభావాలు తక్కువగా ఉంటాయి.

  మకరం డిసెంబర్ 23-జనవరి 20

  మకరం డిసెంబర్ 23-జనవరి 20

  మీ లక్ష్య సాధన దృష్ట్యా మీరు అధిక శ్రమను చేయవలసి ఉంటుంది. కొన్ని పూర్తికాని పనులు మీ కలల సాకారానికి అవరోధాలుగా ఉంటాయి. మీరు సోమరి తనంగా భావిస్తున్న సమయాల్లో, తెలియకుండా చేసేపనులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ దృఢసంకల్పం తో అడుగు ముందుకు వేస్తే అన్నిటా మీదే విజయం.

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  మీకు కావలసిన లేదా కోరుకున్న విషయాలను ప్రాధాన్యత ప్రకారం నిర్ణయించుకోవాలి, మరియు మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయనే భావన నుండి బయటకు రావాలి. అందరికీ అన్నీ దక్కవు అన్న నిజాన్ని మీరు గుర్తించాలి. మీరు కొన్ని అందమైన కోరికలను కలిగి ఉంటారు, కానీ అన్నీ వేళలా అన్నీ దక్కవు. కానీ మీదగ్గర ఉన్న వాటి పట్ల అనగా కుటుంబం, ప్రియమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తను కలిగి ఉండాలి . అజాగ్రత్త, మీ భవిష్యత్తును అంధకారంలో నెట్టగలదు.

  మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీ ఆలోచనలపై నమ్మకం కలిగి ఉండడం అత్యవసరం. మీ మనసుకు చెడు గా తోచిన ఏ విషయాన్నైనా పక్కన పెట్టడం మంచిది. మిమ్మల్ని మీరు అనుమానించడం ఆపాలి. ఈ సంవత్సరం మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడమే మీకు అన్నిటికన్నా శ్రేయస్కరం.

  English summary

  April Zodiac Predictions Reveal 1 Piece Of Advice For Each Zodiac Sign

  With the Mercury retrograde not being the right time to forge forward with great gusto, it is much better that you need to move slowly and to think carefully before making new plans and starting new ventures. Learning about what your zodiac sign holds for the month becomes important. Each zodiac sign has its own share of advice for the month.
  Story first published: Wednesday, April 11, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more