చిన్నారుల వ్యక్తిత్వాన్ని ఆస్ట్రాలజీ నిర్దేశిస్తుందా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆస్ట్రాలజీతో పాటు సన్ సైన్స్ ప్రభావం చిన్నారుల వ్యక్తిత్వంపై పడుతుందనేది సాధారణ నమ్మకం. చిన్నారి పుట్టినతేదీని ఆధారంగా తీసుకుని సన్ సైన్స్ అనేవి కేటాయించబడతాయి. ఇక్కడ సన్ సైన్స్ గురించి క్లుప్తంగా వివరించబడింది. వీటిని చదివి మీ పాపాయి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు.

మేషరాశి (మార్చ్ 21 టు ఏప్రిల్ 20)

మేషరాశి (మార్చ్ 21 టు ఏప్రిల్ 20)

మేషరాశి చిన్నారులు యాక్టివ్ గా అలాగే ఎనర్జటిక్ గా ఉంటారు. దృఢమైన శరీరం అలాగే మనసు కలిగి ఉంటారు. వీరు కష్టజీవులు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. కొన్నిసార్లు బద్దకంగా అలాగే మొండిగా ప్రవర్తిస్తారు. వీరు గొప్ప నాయకులవుతారు. ప్రోయాక్టివ్ నేచర్ కలిగిన వారు. మేషరాశికి చెందిన చిన్నారులలో ఈ కామన్ ట్రైట్స్ ను గమనించవచ్చు. స్ట్రాంగ్ విల్ పవర్, ఇండిపెండెంట్ నేచర్ అలాగే ధైర్యం కలిగి ఉంటారు. కొన్ని సార్లు అహంభావంతో ప్రవర్తిస్తారు.

వీరు నిజాయితీపరులు. వీరి నిజాయితీ వీరిని రూడ్ గా ప్రెసెంట్ చేస్తుంది. పేరెంట్స్ కాస్త ఓర్పును చూపిస్తే, వీరి మొండితనం తగ్గుతుంది. వీరు సహనాన్ని అలవరచుకుంటారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారానైనా వీరికి ఓర్పు అలవడుతుంది.

వృషభరాశి (ఏప్రిల్ 21 టు మే 21)

వృషభరాశి (ఏప్రిల్ 21 టు మే 21)

ఈ రాశికి చెందిన చిన్నారులు చాలా కామ్ గా అలాగే క్వయిట్ గా ఉంటారు. వీరు సృజనాత్మకత కలిగిన వారు. అలాగే వివేకం కలిగిన వారు. వీరు సెక్యురిటీను కోరుకుంటారు. తమ పరిసరాలను గమనిస్తారు. వీరు ఆహ్లాదంగా ఉంటారు. దయాహృదయం కలిగిన వారు. ముద్దొచ్చే చిన్నారులు. ఇతరుల నుంచి విమర్శలను తట్టుకోలేరు. మొండిపట్టు పడతారు. ఈ విషయం పేరెంట్స్ కు ఛాలెంజింగ్ గా ఉంటుంది. అయితే, తల్లిదండ్రులు వీరితో కఠినంగా వ్యవహరించకూడదు. ప్రేమగా చూసుకుంటూ ఉంటే వీరిలో మంచి మార్పును తల్లిదండ్రులు త్వరలోనే గుర్తించగలుగుతారు.

 మిథునరాశి (మే 22 టు జూన్ 21)

మిథునరాశి (మే 22 టు జూన్ 21)

ఈ రాశికి చెందిన చిన్నారులు వాగుడుకాయలు. వీరికి సరదాగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు చాలా ఎనర్జిటిక్ అలాగే హాస్యంగా మాట్లాడడంలో నేర్పు కలిగిన వారు. కాబట్టి, ఇటువంటి చిన్నారులను ఎంటర్టైన్ చేయడానికి వీరితో ఇంటరెస్టింగ్ గేమ్స్ ను ఆడవచ్చు. బుక్స్ అలాగే పజిల్స్ తో వీరి ఆలోచనాశక్తిని మెరుగుపరచవచ్చు. మిథున రాశికి చెందిన చిన్నారులు లాజికల్ అలాగే ఎక్స్ప్రెసివ్. వీరు ఎటువంటి సందర్భమైనా అందుకు తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఈ నేచర్ వలెనే వీరి మనసు వేగంగా మారిపోతుంది. అయితే, తల్లిదండ్రులుగా వీరి ఫోకస్ ను అలాగే వీరి ఎనర్జీను మెరుగుపరచడం కోసం మీరు కాస్తంత దృష్టి పెట్టాలి.

వీరికున్న వివిధ ఇంటరెస్ట్ ల వలన మిథున రాశి చిన్నారులకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఇతరులతో కమ్యూనికేట్ చేయడాన్ని వీరు ఇష్టపడతారు. అందుకే వీరు నెట్ వర్కింగ్ లో దిట్టలు. వీరు సాధారణంగా నిజాయితీపరులు. ఎప్పుడైనా నిజం చెప్పడానికి భయమేస్తే అబద్దాలు చెప్పడానికి వెనకాడరు.

కర్కాటక రాశి (జూన్ 22 టు జులై 23)

కర్కాటక రాశి (జూన్ 22 టు జులై 23)

కర్కాటక రాశికి చెందిన చిన్నారులు చిన్నవయసు నుంచే స్వతంత్రతా భావం కలిగిన వారు. వీరు ఒంటరిగా ఆడుకునేందుకు ఇష్టపడతారు. వివిధ రకాల ఫుడ్స్ ను టేస్ట్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తారు. వీరిలో మూడ్ స్వింగ్స్ అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. వీరు మంచి సంస్కారం కలిగిన వారు. క్రమశిక్షణ కలిగిన వారు. వీరు ఎక్కువ ప్రేమను అలాగే అభిమానాన్ని కోరుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలను గమనించవచ్చు.

కర్కాటక రాశి చిన్నారులు చాలా సెన్సిటివ్. ఎమోషనల్ కూడా. ఎమోషనల్ గా అప్సెట్ అయితే వీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి ప్రేమానురాగాలను పంచాలి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీను అందించాలి.

సింహరాశి (జూలై 24 టు ఆగస్టు 23)

సింహరాశి (జూలై 24 టు ఆగస్టు 23)

ఈ రాశికి చెందిన చిన్నారులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వారి ప్రావిణ్యాలను తెలియచేయడానికి ఇష్టపడతారు. ఈ రాశి చిన్నారులు ఫ్రెండ్లీగా అలాగే ఎనర్జిటిక్ గా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ లో అలాగే స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యేందుకు ఇష్టపడతారు. వీరు కొన్ని సార్లు ప్రాక్టికల్ గా కొన్ని సార్లు డ్రమాటిక్ గా ఉంటారు. బయట ఎంతో ధైర్యవంతులుగా కనిపించినా వీరు ఎమోషనల్ గా సెన్సిటివ్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. వీరిని తల్లిదండ్రులు జాగ్రత్తగా సంరక్షించాలి. వీరితో కఠినంగా మాట్లాడకూడదు.

సింహరాశికి చెందిన చిన్నారులకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి విపరీతమైన అటెన్షన్ ను అందించాలి. ఈ చిన్నారుల ఎఫోర్ట్స్ ని గుర్తించినప్పుడు వారు మరింత బాగా పెర్ఫార్మ్ చేస్తారు. సింహరాశి చిన్నారులు కొత్తవిషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

కన్యారాశి (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)

కన్యారాశి (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)

కన్యారాశికి చెందిన చిన్నారులకు కొత్త విషయాలను నేర్చుకోవడమంటే ఆసక్తి ఎక్కువ. వీరు నిజాయితీపరులు. నమ్మదగినవారు. సిగ్గరులు. అలాగే సొగసైన వారు. వీరు ఏది పడితే అది తినరు. కేవలం కొన్ని ప్రత్యేకమైన పదార్థాలని మాత్రమే వీరు తీసుకుంటారు. వీరిని ప్లీజ్ చేయడం అంత సులభం కాదు. వీరు ప్రాక్టికల్. ప్రతి విషయంపై అటెన్షన్ ను కలిగి ఉంటారు. వీరి అనుకరణ ప్రావీణ్యం ఎంతో గొప్పది. వీరిలో కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అటువంటప్పుడు, తల్లిదండ్రులు వీరికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు తోడ్పడాలి.

బుక్స్ మరియు నవల్స్ ని చదవమని పేరెంట్స్ వీరిని ప్రోత్సహించాలి. ఈ చిన్న చిన్న అలవాట్లు వారికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి.

తులారాశి (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)

తులారాశి (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)

తులారాశికి చెందిన వారు నిజాయితీపరులు అలాగే బలమైన వ్యక్తిత్వం కలిగినవారు. వీరు కంఫర్ట్ ను అలాగే పీస్ ను కోరుకుంటారు. వీరు మంచి ఫ్రెండ్స్ గా అలాగే కంపానియన్స్ గా మారతారు. ఇతరులను ప్లీజ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. వీరు ఎంతో తెలివైనవారు. అలాగే వివేకం కలిగినవారు. వీరు దయాహృదయం కలిగినవారు. అలాగే న్యాయాన్ని నమ్ముతారు. కొన్నిసార్లు వీరు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేక డైలెమాలో పడతారు. అందరినీ ప్లీజ్ చేయడం కష్టం. అయితే, ఈ రాశికి చెందిన చిన్నారులు అందరినీ ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు.

ఇతరుల ప్రైవసీని గౌరవిస్తారు కాబట్టి తులారాశి చిన్నారులను ఇతరులు నమ్ముతారు. ఈ రాశివారిలో ఊహాశక్తి అధికం. పుస్తకాలను చదవడం వీరికి ఇష్టం. తులారాశి చిన్నారులకు క్రమశిక్షణను అలవాటు చేయడం ముఖ్యం. తద్వారా, వీరు కొన్ని ఇబ్బందులను అధిగమించగలుగుతారు.

వృశ్చికరాశి: (అక్టోబర్ 24 - నవంబర్ 22)

వృశ్చికరాశి: (అక్టోబర్ 24 - నవంబర్ 22)

వృశ్చికరాశికి చెందిన చిన్నారులు ఎమోషనల్ అలాగే సెన్సిటివ్. వీరు లోతుగా ఆలోచించగలుగుతారు. వీరు తెలివైనవారు కూడా. వీరి మాటలకు అలాగే చేతలకు వీరు లోబడి ఉంటారు. ఇతరుల నుంచి వీరు ఇదే అప్రోచ్ ని ఆశిస్తారు. వృశ్చికరాశి చిన్నారులు కొన్ని సార్లు అనుమానాస్పదంగా ఉంటారు. వీరు ఎమోషనల్, లాయల్, ఫ్యాషనేట్ అలాగే మిస్టీరియస్. ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు వీరికి క్షమాగుణం గురించి వివరించాలి. అప్పుడే బాంధవ్యాలలో బాలన్స్ ను మెయింటేన్ చేసే సామర్థ్యం వీరికి అలవడుతుంది.

వృశ్చికరాశి వారు సహజంగా కేరింగ్ అలాగే లవింగ్ నేచర్ కలిగినవారు. తల్లిదండ్రుల నుంచి ఎటువంటి పెయిన్ నైనా భరిస్తారు. యాక్సిడెంట్స్ అలాగే హెల్త్ ప్రాబ్లెమ్స్ వీరికి ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ధనుస్సు రాశి (నవంబర్ 23 - డిసెంబర్ 21)

ధనుస్సు రాశి (నవంబర్ 23 - డిసెంబర్ 21)

ఈ రాశికి చెందిన చిన్నారులలో సహాయపడే గుణం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ప్లే ఫుల్ అలాగే సాహసపరులు. చురుగ్గా ఉంటారు. వీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు. ఇతరుల కంపెనీని వీరు కోరుకుంటారు. వీరు నిజాయితీపరులు. అదే నిజాయితీని ఇతరుల నుంచి కూడా ఆశిస్తారు. కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులుగా వీరికి వెకేషన్స్ ని ప్లాన్ చేసినప్పుడు అందులో అడ్వెంచరస్ స్పోర్ట్స్ అలాగే అవుట్ డోర్ గేమ్స్ ఉండేలా ప్లాన్ చేయండి. వీరు వినయం కలిగినవారు. అవుట్ గోయింగ్ నేచర్ కలిగినవారు. అందువలన, వీరికి స్నేహితులు ఎక్కువగా ఏర్పడతారు.

బుక్ రీడింగ్ హ్యాబిట్ ని వీరిలో కల్టివేట్ చేస్తే వీరు ఈ హ్యాబిట్ ను ఎంజాయ్ చేస్తారు.

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 20)

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 20)

ఈ రాశి చిన్నారులలో విల్ పవర్ ఎక్కువ. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. మంచి స్వభావం కలిగినవారు. కష్టపడి పనిచేసి అందుకు ఫలితాన్ని ఆశిస్తారు. వీరు కామ్ గా ఉంటారు. ఇతరుల కంపెనీని ఎంజాయ్ చేస్తారు. వీరికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. మకరరాశి వారు బుక్స్ ని అలాగే స్టోరీస్ ను చదువుతారు. వీరు ఔత్సాహికులు. ప్రతి పనిలో సక్సెస్ ను సాధించాలని కష్టపడతారు. వీరు క్రియేటివ్ కూడా. అలాగే ప్రాక్టికల్ కూడా.

వీరికి సహజంగా కొంత బాధ్యత కలిగి ఉంటుంది. తమకంటే చిన్నవారి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. వీరికి ఏదైనా చెప్పే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్నారుల వ్యక్తిత్వంపై తల్లిదండ్రులు చెప్పేవి ప్రభావం చూపుతాయి.

కుంభరాశి (జనవరి 21 - ఫిబ్రవరి 19)

కుంభరాశి (జనవరి 21 - ఫిబ్రవరి 19)

కుంభరాశి చిన్నారులు ప్రశాంతంగా అలాగే రిలాక్స్డ్ గా ఉంటారు. వీరు త్వరగా నేర్చుకునే సామర్థ్యం కలిగినవారు. అలాగే తెలివైన వారు కూడా. వీరు సెన్సిటివ్ అలాగే సృజనాత్మకత కలిగినవారు కూడా. వీరు కొత్త విషయాలపై ఆసక్తిని కనబరుస్తారు. వీరికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువమంది కలరు. అలాగే కొత్త వారిని కలిసేందుకు వీరు ఇష్టపడతారు. వీరు ఎంతో కాన్ఫిడెంట్ అలాగే వీరి ఆలోచనాధోరణిలో పురోగమం ఉంటుంది. అందువలన, వీరు కొన్ని సార్లు తిరుగుబాటుగా అలాగే మొండిగా కనిపిస్తారు.

తల్లిదండ్రులుగా మీరు వీరి పాజిటివ్ పనులను మెచ్చుకోవాలి. వారి ఇన్నోవేట్ థింకింగ్ మెరుగుపడేలా వారికి ఫ్రీడమ్ ని ఇవ్వాలి. వీరు మంచి తెలివితేటలు కలిగినవారు.

మీనరాశి (ఫిబ్రవరి 20 - మార్చ్ 20)

మీనరాశి (ఫిబ్రవరి 20 - మార్చ్ 20)

వీరు సెల్ఫ్ సాక్రిఫైసింగ్, లివింగ్, మిస్టీరియస్, అనలిటికల్ అలాగే స్వాప్నికులు. తల్లిదండ్రులనుంచి వీరు అదనపు అటెన్షన్ ను కోరుకుంటారు. వీరు ఇనోవేటివ్ అలాగే ఇమేజినేటివ్. వీరి ఆలోచనశక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఫోకస్ పై దృష్టిపెట్టమని తల్లిదండ్రులు తమ చిన్నారులకు చెప్పడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారవుతారు.

వీరి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ప్రముఖం.

English summary

baby's personality according to astrology

If you are already are a parent you can find out your child's personality here based on each zodiac sign.
Story first published: Thursday, April 12, 2018, 16:30 [IST]