Just In
- 1 hr ago
Telangana Formation Day 2022 :ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు..అద్భుత విజయాలు.. ఇంకా మరెన్నో...
- 3 hrs ago
శనిదేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే? శని జయంతి నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి...
- 3 hrs ago
ఆరోగ్యకరమైన గుండె మరియు ప్రేగు కదలికల కోసం రోజూ ఈ ఒక్కటి తింటే చాలు...!
- 5 hrs ago
World Milk Day 2022:ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏడాది థీమ్ ఏంటి?
Don't Miss
- Finance
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఐటీ, బ్యాంకింగ్ అదుర్స్
- Sports
దినేష్ కార్తీక్ ప్రవర్తనపై సీరియస్ అయిన ఐపీఎల్ యాజమాన్యం.. లెవెల్ 1 నేరం కింద అతనిపై చర్యలు
- News
మంజుషా అనుమానాస్పద మృతి: 15 రోజుల్లోనే ముగ్గురు యువ నటీమణుల మరణాల కలకలం
- Technology
రిలయన్స్ జియో JioFi అందుబాటు ధరలో కొత్త ప్లాన్లను అందిస్తున్నది!!
- Movies
ఆగిపోయిన రూ.200కోట్ల బడ్జెట్ మూవీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్!
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాశి చక్రాల ప్రకారం, ఎంత మంది పిల్లలు కలిగిఉండవచ్చో తెలుసుకునే వీలుందా?
ఎంతోమంది తమ జీవితాల్లో తల్లులుకావాలని కలలు కంటున్నప్పటికీ, కొందరికి మాత్రం తీరని కలలుగానే ఉన్నాయి., అవి వారివారి ఆరోగ్య సమస్యలు, జీవనవిధానం, ఆహార, జీవనశైలి ప్రభావాలు మొదలైన కారకాల మీద ఆధారపడి ఉన్నాయి. చాపకింద నీరులా ఎందరో తల్లులను తెలీకుండా ప్రభావితం చేస్తున్న థైరాయిడ్, హార్మోనుల అసమతుల్యం గర్భాశయ క్షయవ్యాధి, సిస్ట్స్, పి.సి.ఓ.డి మొదైలైన సమస్యలు వారి ఆశలను దూరం చేస్తున్నాయి.
కావున క్రమంగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్యుని సూచనల ప్రకారం, పరీక్షలు, మందులను పరిగణనలోనికి తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ, రాశిచక్రాల ప్రకారం వారు ఎంతమంది పిల్లలను కలిగి ఉండవచ్చో ఇక్కడ తెలుపబడింది. రాశిచక్రాల కలయికల ఆధారితంగా కూడా పిల్లల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కానీ, జన్మకుండలిని ప్రకారం అనుకూల గ్రహప్రభావాల దృష్ట్యా ఫలితాలు ఉంటాయని చెప్పబడింది.

మేషరాశి: బోలెడంతమంది పిల్లలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వ్యక్తులు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటారని చెప్పబడింది. కుటుంబ నియంత్రణా పద్దతులు, ఆర్ధిక సమస్యలు మొదలైన వాటి కారణంగా ఒకరు లేదా ఇద్దరు నినాదం కారణంగా భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలలో సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ, మేష రాశి వారి ప్రకారం వీరికి ఎక్కువమంది పిల్లలు కలిగి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పబడింది.

వృషభ రాశి: ఇద్దరు పిల్లలు
రాశిచక్రాలు, నక్షత్రాలు మరియు గ్రహాల ప్రభావంగా వృషభరాశి వారికి ఇద్దరు పిల్లలు కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి. నిజానికి వీరి ఆలోచనా ధోరణి ప్రకారం చూసినప్పుడు, ఇద్దరు అనే సంఖ్య సరిగ్గా ఉంటుంది. పిల్లల గురించి అంతకు మించిన ఆలోచనలు కూడా చేయలేని వారిగా ఉంటారు వృషభ రాశి వారు.

మిధున రాశి: కవలలు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మిదున రాశి సంబంధిత వ్యక్తులకు కవలలు కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి. మీ ఆలోచనా పోకడల దృష్ట్యా మీరు కవలల గురించిన ఆలోచనలే చేస్తుంటారు కూడా.

కర్కాటక రాశి : ఇద్దరు పిల్లలు
మీ రాశి చక్రం ప్రకారం, కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఇద్దరు పిల్లలను కలిగి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ పిల్లల పట్ల భవిష్యత్లో ఉత్తమ తల్లి లేదా తండ్రి కాగలరు. సంతానంకోసం మీరు ఎంతగా పరితపిస్తారో, కలిగిన తర్వాత అంత ప్రేమను కూడా కలిగి ఉంటారు. మీరు మీ ప్రియమైనవారు, కుటుంబం, స్నేహితులపరంగా కూడా తల్లి వంటి ప్రేమని కలిగి ఉంటారు.

సింహ రాశి: ఇద్దరు నుండి నలుగురు పిల్లలు
మీ రాశిచక్రం ప్రకారం, మీకు ఇద్దరి నుండి నలుగురు పిల్లలు కలిగి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందా? కానీ మీకు వృత్తి, కుటుంబాన్ని ఒకేసమయంలో నడుపగల శక్తి ఉందని మర్చిపోకండి. మరియు మీకు తెలుసు, మీరు ఎంతమంది పిల్లలను కలిగి ఉంటే, సంసారాన్ని చక్కగా నడుపగలరు అనే విషయం గురించి. క్రమంగా మీయొక్క విస్తృతమైన ఆలోచనలు మీకు ఉన్నతమైన కుటుంబాన్ని నడిపే శక్తిని కలిగి ఉండేలా దోహదం చేయగలవు.

కన్యా రాశి : ఒకరు
మీకు సంతోషాన్ని పలువురికి పంచేలా కాకుండా, కేవలం ఒకరికే అంకితమిచ్చేలా మీ నక్షత్రాలు, గ్రహాలూ ప్లాన్ చేస్తున్నట్లున్నాయి. క్రమంగా మీరు ఎక్కువగా ఒకరికే జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి ఆరోగ్యపరంగా సంతానలేమి సమస్యలు కలుగవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. మీకు అధిక ఒత్తిడి, అధిక ఆలోచనలు ప్రధాన సమస్యగా ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటిని త్యజించి, ఆరోగ్యం కుటుంబం మీద పూర్తి ఆలోచనలు కలిగి ఉన్నరోజు మీరు ఫలితాలను పొందగలరు.

తులా రాశి : ఇద్దరు, నలుగురు లేదా 6 మంది పిల్లలు
తులా రాశికి చెందిన వ్యక్తులు, సంతులనం, సౌందర్యo మరియు సమానత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వాస్తవానికి, మీరు ఇద్దరు, నలుగురు లేదా ఆరుగురు పిల్లలను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది. మీ కరుణ వాస్తవంగా అనంతమైనది, మరియు సరి సంఖ్యలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మీకు వాస్తవానికి పిల్లలు ఉన్నా లేకపోయినా, మీ ఆలోచన అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం మీద కూడా ఉంటుంది. అంత గొప్ప ఆలోచనా తత్వం కలిగిన వారిగా ఉంటారు.

వృశ్చిక రాశి : అధిక సంతానం
వీరు పిల్లలు కలిగి ఉండడాన్ని గౌరవసూచకంగా భావిస్తూ ఉంటారు, మరియు అధిక సంతానం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత మంది పిల్లలను కలిగి ఉన్నాకూడా, అందరికీ సమానంగా ప్రేమను పంచుతుంటారు. ఆర్ధిక, ఆరోగ్య సమస్యల కారణంగా తక్కువగా ఉన్నప్పటికీ, వీరి ఆలోచన మాత్రం అధిక సంతానం మీద ఉంటుంది.

ధనుస్సు రాశి: ఒకరు
వీరి గ్రహస్థితి మరియు నక్షత్రాల ప్రభావంగా ఈ రాశి చక్రాలకు చెందిన వ్యక్తులు అధిక సంతానం కలిగి ఉండుటకు సుముఖంగా ఉండరు. ఒకరు లేదా అసలుకే వద్దు అనుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒక్క సంతానం ఉన్నా, ఆ పిల్లల మీద ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. వీరు కుటుంబ ఆర్ధిక సంబంధిత మరియు సంతోషభరిత అంశాల మీద అధికంగా దృష్టి సారిస్తుంటారు. క్రమంగా అధిక సంతానం సమస్య అనే భావన వీరిది.

మకర రాశి: ముగ్గురు పిల్లలు
మీ నక్షత్రాలు, మరియు గ్రహానుకూలాల ప్రకారం మీరు ముగ్గురి పిల్లల వరకూ కలిగి ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు. మరియు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, కుటుంబ భాద్యతలను తీసుకోడానికి సిద్దంగా ఉండగలిగే మీరు పిల్లలకు ఎటువంటిలోపం లేకుండా చూసుకోడానికి ప్రణాళికలు కలిగి ఉంటారు.

కుంభ రాశి : ఒకరు
మీరు జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనల కారణంగా, మీ దృక్పధంలోని మార్పుల కారణంగా ఒక బిడ్డను కలిగి ఉండుటకే ఎక్కువ సుముఖంగా ఉంటారు. క్రమంగా ఆ బిడ్డలోనే మీ ప్రపంచాన్ని చూసుకుంటూ, బిడ్డ కోసమే అన్నట్లుగా, లోకాన్ని మైమరచి జీవిస్తుంటారు. మీ కలలను తీర్చుకునే క్రమంలో మీ బిడ్డ మీకు అండగా ఉంటాడని భావిస్తుంటారు.

మీన రాశి : 5 మంది వరకు
వృశ్చిక రాశి వలె అధిక సంతానాన్ని కలిగి ఉండుటకు సుముఖత చూపే మీన రాశి వారు, ఎందరు పిల్లలున్నా సమానంగా మాతృత్వ ప్రేమను పంచేలా ఉంటారు. ఎక్కువ మంది పిల్లలతో ఆటలాడుకుంటూ సంతోషంగా గడపాలన్న ఆలోచనలో ఉంటారు. మీ భావోద్వేగాలకు మందుగా వారి చిరునవ్వు ఉంటుందన్న ఆలోచన చేస్తుంటారు.