జోడియాక్ సైన్స్ మీ బాడీ ఫీచర్స్ ని ఏ విధంగా నిర్వచిస్తాయో ఇక్కడ తెలుసుకోండి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఎక్కువ మంది ఆడవారు వెడల్పాటి భుజాలు కలిగిన మగవారికి ఆకర్షితులవుతారు. అలాగే, ఆడవారి చిరునవ్వుకు మగవారు ఫిదా అయిపోతారు. అయితే, ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ బాడీ ఫీచర్స్ అనేవి జోడియాక్ సైన్స్ పై ఆధారపడి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

ఈ ఆర్టికల్ లో జోడియాక్ సైన్స్ ని బట్టి ఒక వ్యక్తి ఒక్క బాడీ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలియచేయబోతున్నాము. ఒక వ్యక్తి యొక్క పెర్సనాలిటీని నిర్దేశించే బాడీ ఫీచర్స్ అనేవి జోడియాక్ సైన్స్ బట్టీ ప్రత్యేకంగా ఉంటాయని ఆస్ట్రాలజర్స్ అంచనా.

ఇండివిడ్యువల్ జోడియాక్ సైన్ ని బట్టి బాడీ ఫీచర్స్ అనేవి ఏ విధంగా నిర్వచించబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే, ఇవన్నీ ప్రతి ఒక్క జోడియాక్ సైన్ కి ఆపాదించబడిన కొన్ని సాధారణ బాడీ ఫీచర్స్.

గమనిక : ఇది ఒక సాధారణ ఆర్టికల్. ఏ ఒక్క జోడియాక్ సైన్ ని హర్ట్ చేయడం ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం కాదు. అలాగే, కింద ఇవ్వబడిన వివరాలు ఏ ఒక్క జోడియాక్ సైన్ ని లక్ష్యం చేసుకున్నవి కావు.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

ఈ రాశికి చెందిన వ్యక్తుల ముఖ వర్చస్సు తేజస్సుతో నిండి ఉంటుంది. వీరి కనుబొమ్మలు, ముక్కు అలాగే గడ్డం తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన ఆడవారికి ముఖంపై పుట్టుమచ్చలు ఉండే అవకాశం కలదు. వీటి వలన, వారి అందం రెట్టింపవుతుంది. మరోవైపు, ఈ రాశిలో జన్మించిన మగవారి ముక్కు పెద్దగా, వికారంగా ఉండే అవకాశం కలదు.

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నల్లని జుట్టు అలాగే నల్లని కళ్ళు కలవారై ఉంటారు. వీరికి కండలు కూడా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన మహిళలు అధిక బరువు సమస్య బారిన పడతారు. మరోవైపు, ఈ రాశిలో జన్మించిన పురుషుల శరీరంపై దట్టమైన వెంట్రుకలు ఉంటాయి.

మిథున రాశి: మే 21 - జూన్ 20

మిథున రాశి: మే 21 - జూన్ 20

ఈ రాశిలో జన్మించిన వారు మనోహరంగా ఉంటారు. ఎక్స్ప్రెసివ్ ముఖం కలిగి ఉంటారు. చిన్న బొమ్మలాంటి ఫేస్ ఫీచర్స్ కలిగి ఉంటారు. అయితే, ఈ రాశిలో జన్మించిన మహిళలు తమ శరీర బరువులోని అసమాన పంపిణీతో బాధపడతారు. మరోవైపు, ఊడిపోతున్న జుట్టును సంరక్షించుకోవటం కోసం ఈ రాశిలో జన్మించిన పురుషులు విపరీతంగా తమ ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి: జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి: జూన్ 21 - జులై 22

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్స్ప్రెసివ్ పేషియల్ ఫీచర్స్ కలిగి ఉంటారు. హై చీక్ బోన్స్ తో పాటు తీర్చిదిద్దబడిన జాలైన్, కళ్ళు అలాగే కనుబొమ్మలతో వీరు ఆకర్షణీయంగా ఉంటారు. అయితే, ఈ రాశిలో జన్మించిన మహిళలు తమ చెస్ట్ సైజ్ గురించి వ్యథ చెందుతారు. వీరి చెస్ట్ సైజ్ పెద్దగానైనా ఉండవచ్చు లేదా చిన్నగానైనా ఉండవచ్చు. మరోవైపు, పురుషులు పెద్ద పళ్ళు కలవారై ఉండవచ్చు.

సింహరాశి: జులై 23 - ఆగస్టు 23

సింహరాశి: జులై 23 - ఆగస్టు 23

ఈ రాశిలో జన్మించిన వారు పిల్లి వంటి ఫీచర్స్ అలాగే జూలు వంటి శిరోజాలు కలిగి ఉంటారు. మహిళలు పొట్టి కాళ్ళు కలిగిన వారై ఉంటారు. అందువలన వీరు భారీకాయం కలిగిన వారిలా కనిపిస్తారు. మరోవైపు, పురుషులు, భారీ శరీరంతో సన్నటి కాళ్ళు కలిగినవారై ఉంటారు. వీటివలన వీరు శారీరకంగా ఆకర్షణ లేనివారిలా కనిపిస్తారు. అయినా కూడా తమ శరీరాన్ని ఆకర్షణాత్మకంగా ఎలా మలచుకోవాలో వీరికి బాగా తెలుసు.

కన్యారాశి: ఆగస్టు 23 - సెప్టెంబర్ 23

కన్యారాశి: ఆగస్టు 23 - సెప్టెంబర్ 23

ఈ రాశిలో జన్మించిన వారు ఆకర్షణీయమైన ముఖం కలిగి ఉంటారు. ప్రకాశవంతమైన కళ్ళు కలిగి ఒంపైన పెదవులు కలిగి ఉంటారు. ఈ ఫీచర్స్ వలన వీరు తమ వయసుకంటే తక్కువగా కనిపిస్తారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు పొడవాటి ముక్కు కలిగి ఉంటారు. మరోవైపు, పురుషులు బలహీనమైన దవడ భాగం కలిగి ఉంటారు.

తులారాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 23

తులారాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 23

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు సొట్ట బుగ్గలు ఉంటాయి. వీరి ముఖం కోలగా ఉంటుంది. ఆకర్షణీయమైన చిరునవ్వు వీరి సొంతం. ఈ రాశికి చెందిన మహిళల ముక్కు అంత ఆకర్షణీయంగా ఉండదు. మరోవైపు, ఈ రాశికి చెందిన పురుషులు తమ పొట్టి కాళ్ళవైపు ఇతరుల దృష్టి రాకుండా జాగ్రత్తపడతారు.

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

ఈ రాశికి చెందిన వారి చూపు షార్ప్ గా ఉంటుంది. వీరి కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టుగా అందంగా ఉంటాయి. అయితే, ఈ రాశిలో జన్మించిన మహిళల చేతులు మగవారి చేతులలా ఉంటాయి. మరోవైపు, మగవారు దొడ్డికాళ్ళు కలిగి ఉంటారు.

ధనూరాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనూరాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

వీరు క్రీడాకారుల వంటి శరీరం కలిగి ఉంటారు. వీరి కళ్ళు ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి. వీరు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు అధిక బరువు సమస్య బారిన పడతారు. మిగతా జోడియాక్ సైన్లతో పోలిస్తే ఈ రాశిలో జన్మించిన పురుషులు త్వరగా బట్టతలను ఎదుర్కొంటారు.

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

వీరు మచ్చలేని చర్మం కలిగినవారై ఉంటారు. వీరు సరైన చీక్ బోన్స్ తో పాటు షార్ప్ జాలైన్ కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు సరైన ఒంపులు కలిగినవారు. వీరి పెదవులు పలచగా ఉంటాయి. మరోవైపు, ఈ రాశిలో జన్మించిన పురుషులు పొడవాటి స్త్రీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, వీరు పొడవుగా ఉండరు.

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

ఈ రాశిలో జన్మించిన వారు పదునైన చెవులు మరియు పెదవులు కలిగిన వారు. వీరు విశాలమైన నుదురు కలిగిన వారు. వీరి శరీరం సన్నగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన మహిళలు దట్టమైన మెడ కలిగి ఉంటారు. అలాగే విశాలమైన భుజాలు కలిగి ఉంటారు. మరోవైపు, ఈ రాశిలో జన్మించిన పురుషుల శిరోజాలు త్వరగా తెల్లబడతాయి.

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అందమైన చిరునవ్వును వరంగా పొంది ఉన్నారు. వీరి కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్. అలాగే, ఉంగరాల జుట్టు వీరి సొంతం. అయితే, ఈ రాశిలో జన్మించిన మహిళలు గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. మరోవైపు, పురుషులు చిన్నవయసు నుంచే తమ ముఖంపై అనేక ముడతలు కలిగి ఉంటారు.

English summary

Body Features Defined Based On Your Zodiac Sign

There are certain body features that can be defined based on each zodiac sign. From having manly hands to a beautiful smile, it can be traced back to your zodiac sign. Each zodiac sign has its own body feature and it can help in understanding the zodiac signs in a better way.
Story first published: Sunday, January 21, 2018, 12:00 [IST]