మీ రాశిచక్రాల గురించి నిజాయితీతో కూడిన వివరణ ఇదే.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మనలో ప్రతి ఒక్కరికి మన వ్యక్తిత్వానికి అనుకూలమైన మరియు ప్రతికూలమైన అంశాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఖచ్చితంగా రాశిచక్రం మీద ఆధారపడతాయి.

ఇక్కడ, ఈ వ్యాసంలో, ప్రతి రాశిచక్రాన్ని ఒక కఠినమైన పదంతో నిర్వచించాము. ఇది ప్రతి రాశిచక్రం యొక్క ప్రతికూల వ్యక్తిత్వ విలక్షణతపై ఆధారపడి ఉంటుంది.

Brutal Words That Describe Your Zodiac Sign

మీ దోషాలను చక్కెర పాకంలో ముంచి చూపే ప్రయత్నం చేయడం లేదు, కానీ దానిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి రాశిచక్రం యొక్క ఈ క్రూరమైన నిజాయితీ వర్ణనల గురించి తెలుసుకోండి.

మేషం : చపలచిత్తం, దిక్కులేని తనం

మేషం : చపలచిత్తం, దిక్కులేని తనం

మీరు ఒక వ్యవస్థీకృత వ్యక్తిగా ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ 'చపలచిత్తం' అనే పదం మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. ఈ వైఖరి ఇతరులకు జీవితాన్ని కష్టతరం చేస్తుంది.

వృషభం : మొండి పట్టుదల!

వృషభం : మొండి పట్టుదల!

మీలో ఉన్న మొండిపట్టుదల కారణంగా, మీతో ఎటువంటి చర్చలైనా గమ్యంలేని వాదనగా మిగులుతుందని ప్రజల నమ్మకం. వారు తప్పు చేయకపోయినా కూడా, సాధ్యమైనంత తప్పుగా రుజువు చేసేలా ప్రయత్నిస్తారని వాళ్లకు తెలుసు. ఈ మొండిపట్టుదల కాస్త తగ్గించడం అన్నివిధాలా శ్రేయస్కరం.

మిధునం: గందరగోళానికి పరాకాష్ట

మిధునం: గందరగోళానికి పరాకాష్ట

మీరు మీ గురించిన విషయాలలో గందరగోళానికి నెలకొనడమే కాకుండా, ఇతరులను కూడా గందరగోళానికి గురిచేస్తూ ఉంటారు. నిర్ణయాలు ముందే తీసుకునే అలవాటు మీది. తద్వారా ఎవరి మాటను కూడా లెక్కచేయని తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

కర్కాటకం : ఫిర్యాదుల పుట్ట

కర్కాటకం : ఫిర్యాదుల పుట్ట

మీరు మున్ఖ్యంగా ఫిర్యాదులు చేసే అలవాటును మానుకోవలసి ఉంటుంది. ఈ ప్రపంచం మీకు వ్యతిరేకం ఎప్పటికీ కాదని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జరగని, లేని విషయాల గురించిన వాదనలు చెయ్యడం ప్రధానంగా మానుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఫిర్యాదు లక్షణాల వలన, నెమ్మదిగా ప్రజలు దూరమవుతూ ఉంటారు.

సింహం : గర్వం

సింహం : గర్వం

మీరు సరిగ్గా లేకపోయినా కూడా అందరూ మీమీదే దృష్టిని కేంద్రీకరించాలని భావించే మనస్తత్వం మీ సొంతంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగినది కాదు. మీ దగ్గర ఆ లక్షణం ఉందని అనిపిస్తే, వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిత్వం ఇతరులకు ఎప్పటికి ఒక చాలెంజ్ గానే ఉంటుంది. కావున గర్వం ప్రదర్శించడం తగ్గించాల్సిన అవసరం ఉంది.

కన్య: క్షుణ్ణంగా పరిశీలించడం !

కన్య: క్షుణ్ణంగా పరిశీలించడం !

ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే లక్షణం మీ సొంతం. మీ దైనందిక చర్యలలో లేదా మీ లక్ష్య సాధనలో ఎల్లప్పుడూ ప్రణాళికాబద్దమైన జీవనాన్ని గడపాలన్న మీ ఆలోచన కారణంగా ప్రతి విషయoలో పూర్తిగా వివరాలు తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తుంటారు. ఈ పద్దతి కొన్నిసార్లు సాటి వ్యక్తులకు కష్టతరంగా ఉంటుంది కూడా.

తుల: భావోద్వేగాల గని!

తుల: భావోద్వేగాల గని!

మీరు మీ భావోద్వేగ సంతృప్తి కోసం ఇతరులపై ఆధారపడటం నిలిపివేయాలి. ఈ లక్షణం కాస్త చిరాకుగా అసౌకర్యంగా కనిపిస్తుంటుంది. మీరు మీ జీవితాన్ని మీకు మీరుగా నడపడం నేర్చుకోవాలి, ఇతరులపై ఆధారపడి కాదు. మీరు ఎక్కువగా కుటుంబ శ్రేయస్సు గురించిన ఆలోచనలే చేస్తుంటారు. మరియు మీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే అంతే ప్రేమను తిరిగి వాళ్ళ నుండి పొందాలని భావిస్తుంటారు. ఒక్కోసారి ఇది భాదను మిగులుస్తుంది. కావున భావోద్వేగాలకు అతిగా ఆస్కారమివ్వడం మంచిది కాదు.

వృశ్చికం : అహంకారానికి పరాకాష్ఠ

వృశ్చికం : అహంకారానికి పరాకాష్ఠ

అనేక సంవత్సరాలుగా ఈ పదం ఈ రాశి వారికే కేటాయించబడి ఉంది, కావున ఈ చిన్న లక్షణాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీలో ఈ లక్షణం కనుమరుగవుతున్న దృష్ట్యా నెమ్మదిగా అందరూ మీ చెంతకు చేరుతారు.

ధనుస్సు: భయంకరమైన

ధనుస్సు: భయంకరమైన

ఆత్మ విశ్వాసం ఉండడం మంచిదే, కానీ మిమ్మల్ని చూస్తేనే భయపడేలా కాదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి కూడా ఉన్నదని గ్రహించవలసిన అవసరం ఉంది. లేనిచో మీరు అందరిని సాదరంగా మీ జీవితంలోకి ఆహ్వానించలేరు. మీరు పట్టుదల ఎక్కువగా ఉన్న వ్యక్తులుగా ఉంటారు. తద్వారా, మీతో వాదనకు కూడా ఎవరూ సిద్దపడరు.

మకరం: ఏడ్చే పసిబిడ్డ

మకరం: ఏడ్చే పసిబిడ్డ

ప్రపంచ మీ చుట్టూ తిరుగుతూ లేదు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాబట్టి అందరి శ్రద్ధను ఆశించే వ్యక్తిగా ఉండకండి! సంక్షిప్తంగా, నీవు పెద్ద శిశువు! కావున, మీ మానసిక కల్లోలాన్ని దూరం చేసే దిశగా అడుగులు వేయండి మరియు ఇతరులను శాంత పరచేలా ప్రయత్నించండి. లేనిచో మీ పట్ల జాలి చూపులు పెరుగుతాయి, తద్వారా ప్రియమైన వారు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కుంభం: ఓవర్-డ్రీమర్!

కుంభం: ఓవర్-డ్రీమర్!

నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ ఆలోచనా స్థాయి ఎక్కువగా ఉండాలి. మీరు సాధ్యం కానటువంటి విషయాల గురించి కలలుగన్నట్లే, మీరు ఆచరణాత్మక మార్గంలో ఆలోచించరు. తద్వారా అనేక ప్రతికూల ప్రభావిత అంశాలను ఎదుర్కొనవలసి వస్తుంది. జీవితంలో కలలు భాగం, కలలే జీవితం కాదని గుర్తుంచుకోండి.

మీనం: హానికరం!

మీనం: హానికరం!

మీకారణంగా ఎటువంటి నష్టం జరుగకుండా చూడవలసిన భాద్యత మీకుంది. ఇది కాస్త కష్టతరమే అయినప్పటికీ, అడుగు వెనుకకు వేయక తప్పదు. ప్రపంచానికి అవాంచనీయ విషయాలను మీ జీవితంలోకి ఆహ్వానించబోమని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరి దృష్టి మీమీద పడాలన్న ఆలోచన కన్నా, మీలోని ఉన్నత లక్షణాలను మెరుగుపరచుకోవడం మంచిది.

English summary

Brutal Words That Describe Your Zodiac Sign

Most of the times the zodiac predictions are all about the good things coming our way. There is a lot more to know about an individual zodiac sign apart from the regular words that describe your zodiac.