కర్కాటక రాశి మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కర్కాటక రాశి అనేది ప్రెడిక్ట్ చేయడానికి వీలుబడని జోడియాక్ సైన్స్ లో ప్రముఖ స్థానాన్ని పొందింది. ఈ రాశికి చెందిన వ్యక్తులలో భావోద్వేగాలు అధికంగా కనిపిస్తాయి. అభద్రతా భావం కూడా కనిపిస్తుంది. అలాగే, సందిగ్ధంగా ఉంటారు. ఇవి వీరి సహజ స్వభావాలు.

ఈ రాశికి చెందిన వారు తమ దగ్గరివారు తమని తిరస్కరిస్తారేమోనన్న భయంతో ఊగిసలాడతారు. వీరు సులభంగా హర్ట్ అవుతారు. మరోవైపు, వీరి ఊహాత్మక సామర్థ్యం అధికం.

వీటితో పాటూ, ఈ రాశివారికి జ్ఞాపకశక్తి అధికం. అలాగే, వీరు పరిస్థితులకు తగ్గట్టుగా బలంగా ఉండేందుకు తమను తాము సిద్ధంగా ఉంచుకుంటారు.

Cancer May 2018 Horoscope Predictions

ఈ రాశికి చెందిన హోరోస్కోప్ ప్రెడిక్షన్స్ ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆస్ట్రో నిపుణులు అందించిన ఈ ప్రెడిక్షన్స్ లో ప్రేమ, ఆర్ధిక లావాదేవీలు అలాగే కెరీర్ గురించి వివరించబడి ఉన్నాయి. అలాగే, అదృష్ట సంఖ్యలు ఆలాగే రంగుల గురించి కూడా ఇక్కడ వివరించబడి ఉంది.

మరి, కర్కాటక రాశికి చెందిన హోరోస్కోప్ ప్రెడిక్షన్స్ ను మీరు ఇక్కడ తెలుసుకోండి మరి.

ఆరోగ్యం:

ఈ నెలలో డైట్ కి సంబంధించి మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలోని హిమోగ్లోబిన్ లోపం తలెత్తవచ్చు. అలాగే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీరు ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవాలి. పోషక విలువలు ఎక్కువగా లభ్యమయ్యే పండ్లను అలాగే ఆహారాలను తీసుకోవడం మంచిది. నిద్రను అశ్రద్ధ చేయవద్దు. తగినంత నిద్రపొతే శరీరానికి శక్తి లభిస్తుంది.

Cancer May 2018 Horoscope Predictions

వృత్తి:

వృత్తిపరంగా ఈ నెల మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఈ నెలలో మీరు ప్రయాణం చేసే అవకాశం కలదు. ప్రయాణం ద్వారా మీరు ఎంతో లబ్ది పొందుతారు. ఉత్తరం వైపు ప్రయాణం మీకు బాగా కలిసివస్తుంది. మరోవైపు, మిమ్మల్ని అదృష్టం వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఈ నెలలో మిమ్మల్ని వరించబోయే అదృష్టాన్ని సరిగ్గా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి.

ఆర్ధిక లావాదేవీలు:

ఈ నెలలో మీ ఆర్థిక పురోగతి అనేది అంతంతమాత్రమే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఉన్నవారికి గడ్డుకాలం. కాబట్టి, వీరు ఫండ్స్ ను ముందుగానే సమకూర్చుకుంటే అవసరానికి ఉపయోగపడుతుంది. ఈ నెల అనేది మీ ఆర్థిక పురోగతికి ఏ మాత్రం లాభదాయకంగా ఉండదు. కాబట్టి, లో ప్రొఫైల్ ని మెయింటెయిన్ చేసి ప్రతికూల పరిస్థితులను అధిగమించండి.

ప్రేమ:

ఈ నెలలో మీ లవ్ లైఫ్ అనేది కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇద్దరూ విడివిడిగా టైం స్పెండ్ చేయడానికి అవకాశాలు కలవు. మీరు మీ స్నేహితులతో సమయం గడపడాన్ని ఇష్టపడతారు. సోషల్ గ్రూప్స్ లో టైమ్ స్పెండ్ చేయడాన్ని మీరు ఇష్టపడతారు. మరోవైపు, మీ భాగస్వామి ఆర్థిక స్వేచ్ఛను కోరుకుని డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసేందుకు ఇష్టపడవచ్చు. ఒంటరి వారు తమ స్నేహితుల ద్వారా రొమాంటిక్ పార్ట్నర్షిప్ లోకి ప్రవేశించే ఆస్కారం కలదు. ఆల్రెడీ రిలేషన్ షిప్ లోనున్న వారు ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ వలన చిన్నపాటి అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు.

అదృష్ట తేదీలు అలాగే రంగులు:

ఈ నెలలో మీ అదృష్ట సంఖ్యలు - 17, 40, 46, 61, మరియు 76.

అదృష్ట తేదీలు : 6, 7, 8, 17, 18, 25, 26.

అదృష్ట రంగులు : రెడ్, ఆపిల్ గ్రీన్ మరియు స్కై బ్లూ.

English summary

Cancer May 2018 Horoscope Predictions

Cancer May 2018 Horoscope Predictions,Cancer is known to be one of the top most unpredictable zodiac signs! These individuals are always highly charged with emotions, and are insecure, temperamental and can be indecisive. These individuals fear rejection from the people whom they are close to and they are easily hur
Story first published: Tuesday, May 1, 2018, 2:30 [IST]