ప్రతి రాశి వారు ఈ టిప్స్ పాటిస్తే లైఫ్ బిందాస్

Written By:
Subscribe to Boldsky

ప్రతి మనిషి ఏదో ఒక గుణాన్ని, స్వభావాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఎంతటి మేధావి అయినా ఏదో ఒక మైనస్ పాయింట్ కలిగి ఉంటాడు. అలాగే ఆయా రాశుల ప్రకారం వ్యక్తులు కొన్ని గుణాలను వదిలిపెట్టాలి. మరికొన్నింటిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవి ఏమిటో ఒక్కసారి చూద్దామా.

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభరాశి వారు చాలా సందర్భాల్లో ఇతరుల్ని ఇబ్బందిపెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండానే పక్కవారితో తగాదాలుపడుతుంటారు. వీరు ఇతరులతో మాట్లాడే విధానాన్ని కాస్త మార్చుకోవాలి. సన్నిహితుల అందరితో సున్నితంగా మాట్లాడగలిగితే అప్పుడు వీరు జీవితంలో ముందుకొస్తారు. లేదంటే చాలా ఇబ్బందులుపడతారు.

మిథునం : మే 21- జూన్ 20

మిథునం : మే 21- జూన్ 20

వీరు ఏదైనా చిన్న బాధ వచ్చినా చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేరు. వీరు సమస్యను తట్టుకోగల శక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే వీరు జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోగలరు. వీరు దీన్ని పాటించగలిగితే చాలు. జీవితంలో ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించుకోగలగుతారు.

కర్కాటకం : జూన్ 21- జూలై 22

కర్కాటకం : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి వారు ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి. అంతేకాకుండా ఎమోషన్ లో వీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. వీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది. అలాగే ఎదుటి వారి మైండ్ సెట్ ను వీరు అర్థం చేసుకోగలగాలి. ఎదుటి వారిని అర్థం చేసుకుని వారికి అనుగుణంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పి మీరు అందరితో దూరం కాకుండా జాగ్రత్తపడండి.

సింహరాశి : జూలై 23-ఆగస్టు 23

సింహరాశి : జూలై 23-ఆగస్టు 23

సింహరాశి రాశి వారు ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేరు. వారిని అక్కడినే నిలదీస్తారు. వారి సిగ్గుమానం తీస్తారు. దీనివల్ల వీరు చాలామందికి దూరం అవుతారు. మీరు అవతలి వ్యక్తులను మందలించే విషయంలో కాస్త ఆలోచించండి. మోసం చేసే వ్యక్తులను ముందగానే గుర్తించి వారిని మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటే చాలు.

కన్య : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్య : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి వారు ప్రతి విషయంలోనూ వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అవతలి వ్యక్తుల్లో కేవలం వీరు తప్పులనే చూస్తారు. దీంతో వీరు

అందరికీ దూరం అవుతూ ఉంటారు. ఈ రాశి వారు పక్కన ఉన్న వారిని ఎక్కువగా బాధపెడుతూ ఉంటారు. అందువల్ల వీరితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తుల : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి వారు అందరితో కలుసుకుని పోయే లక్షణం కలిగి ఉంటారు అయితే వీరు తాము చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పరు. దీంతో ఇబ్బందులుపడుతుంటారు. అందువల్ల వీరు వారి మనస్సులో ఏముందో చెప్పగలిగే గుణాన్ని పెంపొందించుకోవాలి. అలా చేస్తే వీరికి తిరుగేలేదు.

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికరాశి వారికి క్షమించే గుణం తక్కవగా ఉంటుంది. ఎదుటి వాళ్లతో ఎక్కువగా వైరం పెట్టుకుంటూ ఉంటారు. దీంతో వీరికి చాలా మంది దూరం అవతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎదుటి వారు ఎంత బాధపడతారో అనే విషయాన్ని వీరు గుర్తించాలి. ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి.

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండనది ధనుస్సు రాశి వారు తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అలాంటి క్షణాల్లో గుండెనిబ్బరంతో ఉండాలి. అలాగే ఇతరులను అభినందించే గుణాన్ని వీరు అలవర్చుకోవాలి.

మకరం : డిసెంబర్ 23-జనవరి 20

మకరం : డిసెంబర్ 23-జనవరి 20

మకరరాశి వారు ఒంటిరిగా ఉండాలంటే చాలా భయపడతారు. అలాగే వీరు తమకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని భావిస్తారు. అలాగే వీరు తమకు బాగా క్లోజ్ గా ఉండే వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని అనుకుంటారు. అందువల్ల ఎవరితోనూ ఎక్కువగా కలవడానికి ఇష్టపడరు. అలా అని ఒంటరిగా ఉండలేరు. వీరు దేనికి భయపడకుండా మంచి మనస్సుతో ముందుకు వెళ్తే చాలు.

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభరాశి వారు కూడా దాదాపు మకరరాశి వారి స్వభావాన్నే కలిగి ఉంటారు. వీరు కూడా ప్రతి ఒక్కర్ని శత్రువులుగా భావిస్తుంటారు. అయితే వీరు అలా ఎదుటి వ్యక్తుల్ని చూడడం మానుకోవాలి. ఉండాలి. అందరూ చెడ్డవాళ్లే ఉంటారనుకోవడం తప్పు. అందువల్ల మీరు మీ స్వభావాన్ని మార్చుకుని అందరితో కలిసి మెలిసి ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనరాశి వారు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమకు.. ఆకర్షనకు చాలా వ్యత్యాసం ఉందని వీరు గ్రహించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తమతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ తమని ప్రేమిస్తున్నారని అనుకుంటారు. అలాగే వీరు ప్రతి వ్యక్తిని మొదట కలిసినప్పుడే నమ్మేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఆ వ్యక్తితో కొన్ని రోజులు మీరు స్నేహం చేసిన తర్వాతే ఒక అంచనాకు రండి. ముందుముందుగానే ప్రతి ఒక్కరినీ నమ్మి మోసపోకండి.

English summary

changing decisions that each zodiac sign needs work on

changing decisions that each zodiac sign needs work on
Subscribe Newsletter