For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి చక్రాల ప్రకారం, ఈ ఒక్క విధానాన్ని మార్చుకోవడం ద్వారా మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

|

సూర్యమాన సిద్దాంతం ఆధారంగా సంతోషాల సీక్రెట్: మన రాశిచక్ర సంకేతాలు మన జీవితాలను, మన వ్యక్తిత్వాలను మరియు ఇతరులతో మన విధివిధానాలను సైతం ఎలా ప్రభావితం చేస్తాయో మనకు తెలుసు. మన వ్యక్తిత్వ లక్షణాలు మన భవిష్యత్తును సైతం ప్రభావితం చేసే ప్రస్తుత గ్రహాల కదలికలను ప్రతిబింబిస్తాయి కూడా.

అసలు సంబంధాలు ఎలా పని చేస్తాయి?

సమయానుసారం, రాశిచక్రాల గుర్తులు, ఏ ఇతర రాశిచక్రాల మధ్య వ్యత్యాసాలలో లోపాల కారణంగా ఒక సంబంధం నిలబడేందుకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. ప్రత్యేకించి రాశిచక్రానికి సంబంధించిన కొన్ని విషయాలు అత్యంత విలక్షణమైనవిగా ఉంటాయి, మరియు ఇతర రాశిచక్రాలను ఏమాత్రం అంగీకరించని విధంగా ఉంటాయి.

జ్యోతిషశాస్త్రాన్ని ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు?

జ్యోతిష్యం మిమ్మల్ని తప్పుల నుండి నిరోధించడానికి మరియు మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది! ప్రతి రాశిచక్రం వారి వారి సంబంధంలో స్థిరంగా, సంతోషకరంగా మరియు చెక్కుచెదరనీయకుండా ఉంచగల ప్రత్యేకమైన రహస్యాన్ని కలిగి ఉంటుంది, అదేమిటో తెలుసుకోండి ...

మేషం:

మేషం:

మేషరాశి వారు, మిమ్ములను, వారి ప్రాధాన్య జాబితాలో ఉంచినట్లయితే, మీనుండి కూడా అదేవిధమైన ప్రాధాన్యతను కోరుకుంటూ ఉంటారు. మీరు వారిని పట్టించుకోనట్లుగా ప్రవర్తనను ప్రదర్శించినట్లుగా వారు భావించిన ఎడల, భౌతికంగా తమపట్ల ఆసక్తి లేదేమో అన్న అనుమానాన్ని ఏర్పరచుకుంటారు. మేషరాశి వారు ఎటువంటి సందర్భములో అయినా తాము మొదటగా ఎంచుకున్న అంశాలే, ఎప్పటికి ఫస్ట్ అండ్ బెస్ట్ అన్న ఆలోచనలను కలిగి ఉంటారు. కావున వారి విషయాలలో పోలికలకు దిగడం మంచిది కాదు. ముఖ్యముగా మీ గత జ్ఞాపకాలు లేదా సునిసిత విషయాలతో.

వృషభం:

వృషభం:

మీరు ఒక వృషభ రాశికి చెందిన వ్యక్తిని భాగస్వామిగా కలిగి ఉంటే, మీకు తెలుసు వారు మీపట్ల ఎంత నిజాయితీ, నిబద్దతలతో మెలుగుతారో మరియు ఎంత సానుభూతిని కలిగి ఉంటారో అని. నిజానికి వారు నిరాడంబరతకు చిహ్నంగా ఉంటారు మరియు కొంతకాలం తర్వాత వారి దృక్పథాలలో అనేక మార్పులను పూర్తిస్థాయిలో అంగీకరించకపోయినా, తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మీదనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. సంబంధాలు లేదా వివాహంలో రహస్యాలను ఉంచడం నివారించండి, ఎందుకంటే వారు విశ్వసనీయతకే ఎక్కువ విలువనిస్తారు. మరియు భావాలను పంచుకోవడానికే మొగ్గు చూపుతుంటారు.

మిధునం:

మిధునం:

తమ మనసులో మరియు ఆలోచనలలో ఉన్న ఎటువంటి విషయాన్నైనా ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలిగే ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. వారి భాగస్వామి నుండి ఆశించే విషయం ఏదైనా ఉంది అంటే, మీ మనసులో వారి స్థానాన్ని ఉచ్ఛస్థాయిలో ఉంచడం. మిధునరాశి వారు మీ భాగస్వామిగా ఉన్నట్లయితే, మీ కుటుంబంలో వారి స్థానాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. మీ భాగస్వామికి పరిసరాలను అర్థం చేసుకొనుటకు అనువైన సమయాన్ని కేటాయించడం అవసరం. అన్నిటా మీరే ఉండాలన్న ఆలోచనలు ఎన్నటికీ సరిపడవు. ముఖ్యంగా వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలను అడ్డుకుంటున్నట్లుగా భావించిన ఎడల, మీ పట్ల కఠిన వైఖరిని అవలంబించే అవకాశాలు కూడా లేకపోలేదు.

కర్కాటకం:

కర్కాటకం:

సున్నితమైన మానసిక పరిస్థితులు కలిగినవారిలో కర్కాటకరాశి వారిని మించిన వారు లేరు అనటం అతిశయోక్తి కాదు. ఈ కర్కాటకరాశి వారు భావోద్వేగభరిత ఆలోచనలతో, మరియు హృదయపూర్వకమైన మనస్సుతో ఇతరుల పట్ల జాలి, దయతో మెలుగుతుంటారు. తమ పుట్టినరోజు వంటి ముఖ్యమైన రోజులను మరచిపోయినా కూడా క్షమించగలరు కానీ, తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే మాత్రం ఎన్నటికీ క్షమించలేని వారిగా ఉంటారు. తాము ఎంతగా అయితే ప్రేమను కలిగి ఉంటారో, అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితులలో మోసాన్ని సహించలేని వారుగా ఉంటారు.

సింహరాశి:

సింహరాశి:

మీ భాగస్వామి సింహరాశికి సంబంధించిన వ్యక్తి అయితే, ఇప్పటికే మీరు గొప్ప సహనవంతులై, గొప్ప అభిరుచులను కలిగినవారై ఉంటారు. సింహరాశి వారు ఎక్కువగా తాము చేసిన పని పట్ల మన్ననలను పొందాలని పరితపిస్తుంటారు. ముఖ్యముగా వారి బాగస్వామి నుండి. వీరు ఎక్కువగా ఇతరుల కన్నా దుస్తులలో మరియు పద్ధతులో గొప్పగా కనపడాలని నిరంతరం ప్రణాళికలు చేస్తుంటారు. క్రమంగా ఎవరైనా వీరి ఆలోచనల పట్ల విముఖతను ప్రదర్శించినా, లేదా బహిరంగంగా అవమానపరచినా, తీవ్రమైన పరిణామాలను చూడవలసి వస్తుంది. లైంగిక ఆలోచనలు వీరి బలహీనఅంశంగా ఉంటుంది, భంగపరిస్తే, వీరి కోపాలకు హద్దులు ఉండవు.

కన్య:

కన్య:

వీరి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు మీ పరుగుల జీవితానికి కారణంగా ఉంటుంది. ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్త ప్రదర్శించే కన్యారాశి వారు తమకు వచ్చే భాగస్వామి కూడా తమలాగే ఆలోచించాలని కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ తమ ఆలోచనలకు విరుద్ధంగా ఉన్న యెడల ఒకింత అసంతృప్తికి లోనవుతుంటారు. వీరు ఎక్కువగా శుభ్రతకి‌ అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారిగా ఉంటారు. మరియు కుటుంబములో న్యాయాన్యాయాలను అనుసరిస్తూ భేదాలు లేకుండా నిర్ణయాలు తీసుకునే వారిలా ఉంటారు. వృత్తిపట్ల నిబద్ధత, అంకిత భావం, నిరాడంబరత‌ వీరి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. వీరి చేతుల మీద జరిగే ప్రతి విషయమూ దోషరహితముగా ఉండాలని ఆలోచనలు చేస్తుంటారు. క్రమముగా తమ ప్రణాళికలకు అడ్డు వచ్చిన వారిని శత్రువులుగా భావిస్తుంటారు.

తుల:

తుల:

అర్థంలేని ఆలోచనలతో కూడిన మనుషులు సంబంధాలు కలిగి ఉండటం తులారాశి వారికి నచ్చని అంశంగా ఉంటుంది. న్యాయం, శాంతి, సమభావన వంటి వాటిని ఎక్కువగా పరిగణలోనికి తీసుకునే వ్యక్తులుగా ఉంటారు. దుడుకు స్వభావాలకు మరియు న్యాయరహిత అంశాలకు వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. వీరిపట్ల హేళన మరియు చమత్కారాలు చేసే వారికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని ఆలోచించే వీరు ఒకరికి తలొగ్గి జీవించడానికి ఎన్నటికీ సుముఖంగా ఉండరు.

వృశ్చికం:

వృశ్చికం:

ఎల్లప్పుడు ఇతరులచే మోసపడతారని భావించే వృశ్చికరాశి వారు, ఇతరుల పట్ల అంత తేలికగా నమ్మకాన్ని కలిగి ఉండలేరు. క్రమముగా సంబంధాల పట్ల కూడా అనేక ఆలోచనలను చేస్తుంటారు. కానీ ఒక్కసారి వీరి నమ్మకాన్ని పొందగలిగితే, జీవితాంతం నిబద్ధతతో సంబంధాన్ని కొనసాగించేవారిగా ఉంటారు.

అదే విశ్వాసం మరియు ప్రేమను వృశ్చికరాశి వారు తిరిగి పొందినప్పుడు, జీవితాంతం భాగస్వామిని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వారిలా ఉంటారు.

ధనుస్సు:

ధనుస్సు:

ధనుస్సురాశి వారి ఆలోచన విధానాల ప్రకారం, వారి స్వేచ్ఛకు ఎల్లప్పుడూ భంగం వాటిల్లుతుందనే అపోహలో ఉంటారు. వివాహ జీవితం తమకు ఆటంకముగా పరిగణిస్తూ సంబంధాల పట్ల విముఖతను ప్రదర్శిస్తుంటారు. కానీ నిజానికి సామాజికంగా ఆమోదయోగ్యం కాదు కాబట్టి, తమ భావనలను మార్చుకోవడానికి‌ ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. నిందలు వేయకుండా వీరి ఆలోచనలకు తగినట్లుగా, నమ్మకంగా నడుచుకున్న ఎడల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు సాగవచ్చు.

మకరం:

మకరం:

అధిక భావోద్వేగాలను మనసులో కలిగి ఉన్నప్పటికీ, అన్ని వేళలా ఉద్రేకాలకు లోనవడం సరికాదన్న ఆలోచన వీరిది. తమ వ్యక్తిగత జీవితాన్ని బహిర్గత పరచుటకు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు మరియు తమ చర్యలు తమ భాగస్వామి మరియు కుటుంబానికి చేటు తీసుకుని రాకూడదన్న ఆలోచనలు చేస్తుంటారు. ప్రతి అంశంలో కుటుంబం పట్ల ఆలోచన చేసే మకర రాశి వారు, గౌరవ ప్రతిష్టలను ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తన వలెనే తన భాగస్వామి కూడా వ్యక్తిగత జీవితానికి విలువనిచ్చే వారిలా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. అంతేకాకుండా తమ ఆలోచనలను నియంత్రించే స్వభావాన్ని ప్రవర్తించే వారిని ఎన్నటికీ ఇష్టపడరు.

కుంభం:

కుంభం:

ఉదార స్వభావాన్ని కలిగి, మానవత్వపు చాయలకు ఉదాహరణగా ఉండే కుంభ రాశి వారు, తమ పట్ల ఎవరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా, వెన్నుపోటు తత్వాలను చూపినా, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ నిర్ణయాలు జీవితకాలం పాటు కొనసాగేవిలా ఉంటాయి. కావున జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది. వీరి నిర్ణయాల విషయంలో స్వ పర తేడాలు చూపని వారిగా ఉంటారు.

మీనం:

మీనం:

ఈ రాశిచక్రంలో జన్మించిన వ్యక్తులు ఉదార గుణం కలిగి, దాన ధర్మాలు చేస్తూ దయ కలిగినవారై ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం సహించని వైఖరిని ప్రదర్శిస్తుంటారు. అంతేకాకుండా తమ ఆలోచనా విధానాలకు తమ భాగస్వామే అడ్డుగా ఉంటే, వీరిపట్ల జీవితమంతా హేయభావాన్ని ప్రదర్శిస్తుంటారు.

English summary

Changing this ONE thing as per your Zodiac Sign will save your marriage!

Changing this 1 thing as per your Zodiac Sign will save your marriage,Secret to happiness based on Sun Sign We know how our zodiac signs hugely impact our lives, our personalities and our tuning with others. Our personality traits mirror the current planetary motion, which influences our future.