గర్భిణిగా ఉన్నపుడు కలలో కప్పలు కనిపిస్తే దానర్ధం ఏమిటి?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మనం కలలు కనే ప్రతి దానికీ ఏదొక అర్ధం, కారణం ఉంటాయి. చాలాసార్లు, మనం అచేతన స్థితిలో ఉన్నపుడు అనేక విషయాల గురించి కలలు కంటూ ఉంటాము, ఆ కలలను పొందేటపుడు మనం ఉలికిపడి లేస్తాము.

కొన్ని కలలు చాలా గందరగోళంగా ఉంటాయి, వాటిలో కొన్నిటికి అర్ధాలు, ప్రాముఖ్యతలు కూడా ఉంటాయి.

ఇక్కడ, ఈ ఆర్టికిల్ లో, మనం "కప్పలు" కి సంబంధించిన కలల వివరాల గురించి తెలుసుకుందాము. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నపుడు కప్ప గురి౦చి కల వచ్చినపుడు, అది స్వంత ప్రాముఖ్యతకు చెందినదిగా చెప్తారు.

కాబట్టి, గర్భిణిగా ఉన్నపుడు కలలో కప్పలు కనిపిస్తే దాగి ఉన్న అర్ధాన్ని మనం పరిశీలిద్దాము....

కప్పల పైకి ఎక్కడం

కప్పల పైకి ఎక్కడం

స్త్రీ కప్ప పై తనకుతానే ఎక్కినట్లు కనిపిస్తే, సాధారణంగా అది కంగారుని సూచిస్తుంది. లేదా కప్పలు ఆకాశం నుండి కిందకు పడినట్టు, ఆమెకు వేరే దారిలేక ఆమె దానిపై కాలువేసినట్టు కలలు వస్తే, ఆమె వైపు వచ్చే బాధ్యతల పట్ల ఆమె ఆనందంగా ఉంటుందని అర్ధం.

కప్పను పట్టుకోవడం

కప్పను పట్టుకోవడం

మీరు గర్భిణిగా ఉన్నపుడు ఈ కలవస్తే, ఒక తల్లిగా మీ బాధ్యతలను తీసుకోవడంలో కంగారు పడుతున్నారని అర్ధం. ఈ కల మీరు గర్భం పొందడానికి ముందు సమయానికి కూడా సంబంధించి ఉంటుంది.

నోటిలో కప్ప

నోటిలో కప్ప

ఇది చాలా అద్భుతమైన, అరుదైన కలలలో ఒకటి. కానీ ఎవరికైనా ఈ కలవస్తే, ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న కఠిన స్వరాన్ని కలిగి ఉన్నట్టు అర్ధం. ఈ కల గర్భానికి చెందిన భయం గురించి ఉండొచ్చు, సాధారణంగా స్త్రీలు దీన్ని బైటికి వెలిబుచ్చలేరు.

కలల్లో చూసిన సాధారణ విషయాలకు అర్ధం!

నీళ్ళలో కప్ప

నీళ్ళలో కప్ప

కలలో నీళ్ళలో కప్పను చూడడం అనేది సంతనోత్పత్తితో ముడిపడి ఉంటుంది. ముందుగా కప్ప నీటిలో గుడ్లు పెడుతుంది, తరువాత అవి ట్రాడ్పోల్స్ లా తయారవుతాయి, తరువాత క్రమక్రమంగా కప్పలా రూపాంతరం చెందుతాయి, ఇలాగే మనిషి పిల్లల్లు కూడా అంతే. నీటిలో కప్పలు కనిపించడం అంటే పిల్లలు ఆరోగ్యంగా, ఆడుకు౦టున్నారని అర్ధం.

కప్పలు ఎగురుతున్నపుడు

కప్పలు ఎగురుతున్నపుడు

గర్భిణీ స్త్రీ కలలో ఎగురుతున్న కప్పను చూసినపుడు, ఆమె తన బిడ్డతో ఆనందాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నట్టు అనుకోవడానికి చిహ్నంగా భావించవచ్చు. ఆమె బిడ్డ భవిష్యత్తు విజయవంతంగా, సంతోషంతో, స్వేచ్చగా కూడా ఉంటుందని ఆశపడవచ్చు.

ఒక స్త్రీ కలల్లో ఈ సంకేతాలు కలిగితే, ఆమె భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది!

గెంతుతున్న కప్పలు

గెంతుతున్న కప్పలు

ఇది భవిష్యత్తుకు అవకాశాలను సూచిస్తుంది. ఇది తల్లి పాత్రను సవాలు చేస్తూ ముందు వచ్చే పెద్ద మార్పుకు మనసును సిద్ధం చేస్తుంది.

Read more about: life dreams లైఫ్
English summary

Dreaming Of Frogs During Pregnancy Can Mean This

Do you know that when a woman who is pregnant dreams about frogs, it has its own meaning and significance to it? From stamping a frog to seeing a flying toad, each of the frog-related dreams can have a significant meaning to it.
Story first published: Friday, January 5, 2018, 15:05 [IST]