For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పని చేసే ప్రతి మహిళ తప్పకుండా చదవాల్సిన జీవిత పోరాటాల మీద రాణి ముఖర్జీ లేఖ

By Telugu Samhitha
|

రాణి ముఖర్జీ బాలీవుడ్ లో ఉన్న కొద్దిమంది ప్రముఖ నటీమణులలో ఒకరు. ఆమె ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారో లెక్కలేదు. ఆమె తన పుట్టినరోజు జరుపుకున్న తర్వాత రోజున తన లేఖలో బాలీవుడ్ తనకు ఒక కఠినమైన ప్రదేశంగా ఉందని అది తనని ఒక పోరాట యోధురాలిగా మార్చిందని వెల్లడించారు.

సంవత్సరాలు తరబడి, సినీ ప్రేమికులుగా మనందరం రాణి ముఖర్జీ వెండితెరపై తన అభినయంతో నటనా ఇంద్రజాలాన్ని సృష్టిస్తున్న ప్రతీసారీ మన హృదయపూర్వక అభిమానాన్ని ఆమెకు సమర్పించుకున్నాం. కుచ్ కుచ్ హోతా హై నుండి బ్లాక్ వరకు ఆమె ప్రయాణంలో సృజనాత్మకత మరియు నట రుపాంతరములు ఆమె బాలీవుడ్ రాణిగా అర్హురాలు ఎందుకు అయిందో నిరూపిస్తున్నాయి.

Every Working Woman MUST Read Ranis Letter On Life & Struggles

స్వతహాగా స్టార్ గా ఎదిగిన ఇతర తారల లాగానే ఆమె తన స్వీయ ప్రతిభని మలిచి ఉన్నత శిఖరాలకు ఎదగడం ఆమెకి అంత సులభంగా లభించలేదు. నిన్న జరిగిన ఆమె జన్మదిన సందర్బంగా తన కలం నుండి బహిర్గతం అయిన విషయాలు గమనిస్తే ఇతర మహిళా తారల లాగానే సెక్సిజం పాత్రలని తన వంతుగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఒక మహిళా నటిగా వివాహం జరగిన తర్వాత లేదా తమ యవ్వనాన్ని కోల్పోతున్న తరుణంలో నిస్సహాయులుగా పరిగణింప బడుతున్న వాస్తవాన్ని ఎత్తి చూపడంలో ఆమె ఎటువంటి సంకోచం చెందలేదు. ఆమె మాటల్లో ఇలా అన్నారు. "ఒక స్త్రీగా నేను ఒప్పుకోవాలి. ఇది ఒక సులభమైన ప్రయాణం కాదు. నేను ప్రతి రోజు వినూత్నంగా నన్ను నేను నిరూపించుకోవలసి ఉంటుంది."

అంతే కాకుండా "ఒక స్త్రీకి ఎంతో స్వల్ప కెరీర్ వ్యవధి ఉంది. ఒక వివాహితకు సమానత్వం చచ్చిపోతుంది. స్త్రీలు బాక్స్ ఆఫీసు వద్ద లాభనష్టాల సరుకులు కాదు. స్త్రీ - ఆధారిత ( నేను ఈ పదం పట్ల చాల అయిష్టతతో ఉన్నాను) చిత్రాలు భారీ నష్టం. ఒక తల్లి అయిన వివాహిత నటి తన లక్ష్యాలు, కలలు, ఆకాంక్షలు కోరికలు అన్నిటిని సమాధి చేయబడే చివరిక్షణంగా మారుతోంది. ఇవన్నీప్రతి ఒక్క క్షణం వాటితో బ్రతకాల్సిన మరియు అధిగమించడానికి ప్రయత్నించాల్సిన వివక్షాపూరిత సాధారణీకరణలు”.

- రాణీముఖర్జీ హిచ్కీ

Every Working Woman MUST Read Ranis Letter On Life & Struggles

కానీ ఆమె ఒక పోరాట యోధురాలివలె లింగ వివక్షతలను విచ్చిన్నం చేసి మహిళలు వివక్షతలేకుండా జీవించడానికి మరియు పని చేయడానికి అనుమతినిచ్చే ఒక ప్రపంచాన్ని సృష్టించడంలో ఆమె తన వంతు పాత్రను పోషిస్తోంది.

"నా యొక్క తోటి అందమైన అద్బుతమైన, దయగల మరియు ప్రతిభావంతులైన అందరి నటీమణులతో కలసి ఈ వివక్షలతో పోరాడుతూనే పనిచేస్తానని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మన సమాజం మరియు సినీ పరిశ్రమ మరింత పరిపక్వం చెందాలని ఆశిస్తున్నాను".

- రాణి ముఖర్జీ హిచ్కీ.

English summary

Every Working Woman MUST Read Rani's Letter On Life & Struggles

Rani Mukherjee is one of those few actresses in Bollywood who will remain a star, regardless of how many films she does in a year. It was her birthday yesterday and she revealed that Bollywood has been a tough space for her, something that has turned her into a fighter!
Story first published:Monday, March 26, 2018, 8:26 [IST]
Desktop Bottom Promotion