Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
తను పెద్ద డాక్టర్ని అని చెప్పాడు, నన్ను వాడుకుని నేను కూడబెట్టుకున్న డబ్బును కాజేశాడు #mystory366
చిన్నప్పటి నుంచి నాకు మంచి రోజులు వస్తాయని నేను నమ్మేదాన్ని. ఆ రోజులు త్వరలో వస్తున్నాయని నాకు స్పష్టంగా అనిపించేది. అందుకే అతని కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దమయ్యాను. కానీ నా ఆశలన్నీ తారుమారు అయ్యాయి.
మా అమ్మనాన్నలకు గొడవలు రావడంతో వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నేను అమ్మ దగ్గరే ఉంటున్నాను. ఇద్దరం ఆడవారే కావడంతో ఇంటికి మగదిక్కు కోసం నేను త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
అమ్మకు బయటి ప్రపంచం గురించి అస్సలు తెలియదు. తను చాలా అమాయకురాలు. నేను జాబ్ చేస్తేనే ఇళ్లు గడుస్తుంది. రోజూ పని ఒత్తిడిలో ఉండి అసలు పెళ్లి సంబంధాల విషయమే మరిచిపోయాను.

భర్తను నేను వెతుక్కోవాల్సిన పరిస్థితి
నాకు కాబోయే భర్తను నేను వెతుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే ఒక మ్యాట్రీమోనీ సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశాను. దాంతో చాలా మంది అబ్బాయిలు నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యేవారు. నేను మాత్రం బాగా ఆలోచించి మంచి అబ్బాయిని చేసుకోవాలనుకున్నాను.

మ్యాట్రీమోనీలో పరిచయం
మ్యాట్రీమోనీ సైట్ లో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తను డాక్టర్. గ్రేటర్ నోయిడాలో ఓ పెద్ద హాస్పిటల్ లో తాను డాక్టర్ గా చేస్తున్నానని చెప్పాడు.

ఎంత హ్యాండ్ సమ్ గా ఉంటాడో
తన ప్రొఫైల్ నాకు బాగా నచ్చింది. ఫోటోస్ లోనే అంత అందంగా ఉన్నాడంటే రియల్ గా ఎంత హ్యాండ్ సమ్ గా ఉంటాడోనని మురిసిపోయాను. తన లైఫ్ స్టైల్ మొత్తం నాకు చెప్పాడు.

ఇంగ్లిష్ లోనే మాట్లాడేవాడు
రోజూ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఫోన్ చేసేవాడు. అంతా ఇంగ్లిష్ లోనే మాట్లాడేవాడు. ఆయన డాక్టర్ కాబట్టి అంతా అదే టెర్మనాలజీ వాడేవాడు. అస్సలు అర్థం అయ్యేది కాదు.

చాలా రిచ్ కిడ్
రోజూ ఉదయం లేవగానే వాట్సాప్ లో మొత్తం అతనే మెసేజ్ లే ఉండేవాడు. అతని ఫొటోలను చూస్తే తను చాలా రిచ్ కిడ్ అని అర్థమైంది. ఇంత ఆస్తి ఉన్న అతను నాకు భర్తగా దొరుకుతున్నాడనే ఆనందంలో ఉండేదాన్ని.

జాబ్ చేస్తేగానీ పూటగడవదు
నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించాను.
జాబ్ చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు నా కష్టాలు మొత్తం పోతాయని నా ఆశ. ఆ రోజు దగ్గరకు వచ్చిందని ఎంతో ఆశపడ్డాను.

పెద్ద హాస్పిటల్ పెడతా
త్వరలోనే హైదరాబాద్ కు వస్తానని పెద్ద హాస్పిటల్ పెడతానని చెప్పేవాడు. ఆయన మాటలు వింటూ ఉంటే నేను ఊహల లోకంలో తేలియపోయేదాన్ని. ఎక్కడెక్కడో విహరించేదాన్ని. గాల్లో మేడలు కట్టేదాన్ని.

మంచి రోజులు వస్తాయని
చిన్నప్పటి నుంచి నాకు మంచి రోజులు వస్తాయని నేను నమ్మేదాన్ని. ఆ రోజులు త్వరలో వస్తున్నాయని నాకు స్పష్టంగా అనిపించేది. అందుకే అతని కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దమయ్యాను. కానీ నా ఆశలన్నీ తారుమారు అయ్యాయి.

అతను డాక్టర్ కాదు
అసలు అతను డాక్టర్ కాదు.. అసలు ఈ దేశంవాడే కాదు. నేను ఏళ్ల తరబడి కష్టపడి పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బును కాజేసిన ఘరానా మోసగాడు అతను. నేను అంత దారుణంగా మోసపోతానని కలలో కూడా అనుకోలేదు.(మిగతా స్టోరీ #mystory367లో చదవండి)



Click it and Unblock the Notifications
