For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోసుకుని తిందామని కోడిని కోస్తే తల సగమే తెగింది, తల లేకుండానే బతికేసింది, చాలా డబ్బు సంపాదించింది

అయితే కోడి తలను నరికినా కూడా ఎలా బతికి ఉంది అని కొందరు దాన్ని పరీక్షించారు. దాన్ని తల నరికినప్పుడు ఆ వేటు మెదడుపై పడలేదు. కేవలం దాని ముక్కు ఉన్న ప్రాంతంలోనే పడింది. ఆ పార్ట్ మొత్తం తెగిపడిపోయినా కూడా

|

ఆదివారం వచ్చిందంటే చాలు అందరి చూపు చికెన్ పైనే ఉంటుంది. కొందరు చికెన్ కొట్టుకెళ్లి కోడి మాంసం తెచ్చుకుంటే మరికొందరు కోడిని కోసుకుని తింటూ ఉంటారు. పాపం ఆ రోజు ఎన్నో కోళ్లు బలైపోతాయి. కోడి గొంతు కోయగానే అది గిలగిలకొట్టుకుంటూ చచ్చిపోతుంది. తర్వాత దానికి బొచ్చు తీసి, కాల్చి, ముక్కలుగా చేసి కూర చేసుకుని తింటారు. ఇది చాలా మందికి పెద్ద పాపంగా అనిపించదు.

అయితే తల లేకుండా కోడి బతకగలదా? అది సాధ్యమేనా? అంటే అస్సలు బతకదు అంటారేమో. ఒక కోడిని ఇలాగే కోసుకుని తిందామనుకున్నాడు ఒకతను. తర్వాత కోడిని కోశాడు. కానీ కోడి తల పూర్తిగా తెగలేదు. తల లేకున్నా ఆ కోడి బతికి 18 నెలల పాటు బతికి చరిత్రలో నిలిచిపోయింది. అసలు కథ ఏమిటో చదవండి.

కోడిని కొయ్యడానికి సిద్దమయ్యాడు

కోడిని కొయ్యడానికి సిద్దమయ్యాడు

అది సెప్టెంబర్ 10, 1945వ సంవత్సరం. ఫ్రూటి, కొలరాడోలో లాయిడ్ ఓల్సెన్, అతని భార్య క్లారా నివాసం ఉండేవారు. వారు చాలా కోళ్లు సాకుకునేవారు. ఎంత బాగా సాకుకున్నా కూడా ఏదో ఒక రోజు వాటిని కోయడం వారికి అలవాటు. కొన్ని కోళ్లను కోసి ఇతరులకు అమ్మేవారు. మరికొన్నింటిని వాళ్లే తినేవారు. అందులో భాగంగానే ఒక కోడిని కొయ్యడానికి సిద్దమయ్యాడు ఒల్సెన్. తన ఫారంలో నుంచి మైక్ అనే కోడిని పట్టుకొచ్చాడు. దాంతో పాటు మరో కొన్ని కోళ్లను కూడా పట్టుకొచ్చి కోశాడు.

తల నరికినా కూడా చనిపోకుండా

తల నరికినా కూడా చనిపోకుండా

అయితే అన్ని కోళ్లు చనిపోయి పక్కకు పడి ఉన్నాయి కానీ ఒక కోడి మాత్రం అలా నిలబడి ఉంది. ఆ కోడికి బ్రెయిన్ ఉన్న పార్ట్ తో పాటు ఒక చెవి కూడా తెగిపోలేదు. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఓల్సన్. దీని తల నరికినా కూడా చనిపోకుండా నిలబడిందే అని ఆ భార్యాభర్తలిద్దరూ అలాగే చూస్తూ ఉన్నారు.

ముద్దుగా మైక్ అని పేరుపెట్టుకున్నారు

ముద్దుగా మైక్ అని పేరుపెట్టుకున్నారు

సరే అని దాన్ని అలాగే వదిలేశారు. మరుసటి రోజు కూడా ఆ కోడి అలా నిలబడింది. బాగా తిరుగులాడుతూ ఉంది. లాయిడ్ ఓల్సన్, అతని భార్యకు ఒక ఐడియా వచ్చింది. తల లేని కోడి బతుకుతోంది అంటూ అంతటా ప్రచారం చేశారు. దానికి ముద్దుగా మైక్ అని పేరుపెట్టుకున్నారు. ఆ కోడి గురించి అప్పట్లో ప్రముఖ పత్రికల్లో బ్యానర్ వార్తలు వచ్చాయి. కోడికి తల దగ్గర ఉండే చిన్న రంధ్రం ద్వారా దాణా అందించేవారు ఓల్సన్ దంపతులు.

ఆ పార్ట్ మొత్తం తెగిపడిపోయినా

ఆ పార్ట్ మొత్తం తెగిపడిపోయినా

అయితే కోడి తలను నరికినా కూడా ఎలా బతికి ఉంది అని కొందరు దాన్ని పరీక్షించారు. దాన్ని తల నరికినప్పుడు ఆ వేటు మెదడుపై పడలేదు. కేవలం దాని ముక్కు ఉన్న ప్రాంతంలోనే పడింది. ఆ పార్ట్ మొత్తం తెగిపడిపోయినా కూడా కోడి మాత్రం బతలకగలిగింది.

చాలా డబ్బు సంపాదించాడు

చాలా డబ్బు సంపాదించాడు

తర్వాత మైక్ కోడికి సంబంధించిన వార్త అంతటా మారుమోగిపోయింది. ఓల్సెన్ ఆ కోడిని తీసుకుని అన్నిచోట్ల ప్రదర్శనలు నిర్వహించడం ప్రారంభించాడు. ఆ కోడిని చూడడానికి చాలా దూర ప్రదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. కోడిని చూసేందుకు టికెట్ నిర్ణయించారు ఓల్సెన్.

అలా చాలా డబ్బు సంపాదించాడు.

ఆ కోడి ఓల్సెన్ జీవితాన్ని మార్చేసింది. దీంతో బాగా డబ్బు సంపాదించిన ఓల్సెన్ ఒక ట్రాక్టర్, హే బ్యాలెర్, కొత్త పికప్ ట్రక్కు తదితర వాటిని కొన్నాడు. ఆ కోడి అలా తల లేకుండా బతికినన్నీ రోజులు దాన్ని చూసేందుకు ఓల్సెన్ ఇంటికి రోజూ కొన్ని వేల మంది వచ్చేవారు.

18 నెలలు బతగలిగింది

18 నెలలు బతగలిగింది

అయితే ఆ కోడి తల లేకుండా 18 నెలలు బతగలిగింది. అయితే ఒక రోజు మైక్ చనిపోయింది. మైక్ చనిపోయే ముందు కాసేపు గిలగిలకొట్టుకుంది. దానికి సరైన తిండి లేకపోవడంతో అది తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఓల్సెన్ కోడి పరిస్థితి కాస్త బాగోలేకున్నా వెంటనే సిరంజీ ద్వారా దానికి కావాల్సినంత ఎనర్జీని పంపేవాడు.

మిరాకిల్ మైక్ గా చరిత్రలో నిలిచిపోయింది

మిరాకిల్ మైక్ గా చరిత్రలో నిలిచిపోయింది

కానీ ఆ రోజు వాళ్లు ట్రావెల్ లో ఉండడంతో సిరంజీ లేకపోవడంతో ఓల్సెన్ ఎంతో ప్రేమగా చూసుకున్న మైక్ చనిపోయింది. మైక్ చనిపోగానే లాయిడ్ ఓల్సెన్ చాలా బాధపడ్డాడు. మొత్తానికి తల లేకుండా 18 నెలల పాటు జీవించి ఈ కోడి రికార్డ్ బద్దలు కొట్టింది. మిరాకిల్ మైక్ గా ఈ కోడి చరిత్రలో నిలిచిపోయింది. ఓల్సెన్ కొన్ని చాలా డబ్బు సంపాదించిపెట్టింది.

English summary

History About The Chicken That Lived For 18 Months Without A Head

History About The Chicken That Lived For 18 Months Without A Head
Desktop Bottom Promotion