For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిచక్రం బట్టి రిలేషన్ షిప్ ను మీరెలా నిర్వచిస్తారో తెలుసా?

|

సాధారణంగా, సంబంధ బాంధవ్యాలపై మనం అంచనాలు ఎక్కువగా వేస్తాము. కొన్ని సంబంధాలు నిలవవని తెలిసినా కూడా సంబంధం నిలబడాలని మనం శాయశక్తులా ప్రయత్నం చేస్తాము.

కానీ, రిలేషన్ షిప్స్ పై ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన అంచనాలు ఉంటాయి. కొంతమందికి డిస్నీ మూవీ ఎండింగ్ లో లా ఫెయిరీ టెయిల్ రొమాన్స్ ఇష్టమయితే, మరికొంతమందికి శాశ్వతంగా ఉండకపోయినా ఆ రిలేషన్షిప్ లో ఫన్ ఎలిమెంట్ ఇష్టం. ఎందుకంటే, వారి జ్ఞాపకాలలో పదిలమైన ఫన్ ఎలిమెంట్ ను వారు ఇష్టపడతారు.

మరికొంతమందికి రిలేషన్ షిప్ లో అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఇద్దరూ కలిసి సాహసోపేత యాక్టివిటీస్ లో పాల్గనదాన్ని ఆస్వాదిస్తారు. ఆ విధంగా రిలేషన్ ను వారు డిఫైన్ చేసుకుంటారు.

How Likely Will You Accept Your Relationship Based On Your Zodiac Sign

అయితే, ఇలా రిలేషన్ షిప్ లో ని ఎన్నో రకాల ఎక్స్పెక్టేషన్స్ ఎందుకుంటాయి? ఎందుకంటే, ప్రతిఒక్కరికీ లైఫ్ లో వారికంటూ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. కొంతమందికి వివాహం అలాగే కుటుంబము అంటే ప్రయారిటీ ఎక్కువ. కొంతమంది డేటింగ్ ను సీరియస్ గా పరిగణించరు. వారికి, లైఫ్ లో కేవలం ఎక్సయిట్మెంట్ అవసరం.

రిలేషన్షిప్ పై మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడటానికి మీ రాశిచక్రం కూడా కారణమవుతుంది. కొన్ని రాశిచక్రాల చెందిన వ్యక్తులు రిలేషన్ షిప్ పై ఆశను వదులుకుంటారు. మరికొంతమంది క్యాజ్యువల్ రిలేషన్ షిప్ తో సరిపెట్టుకుంటారు. మీ రాశిచక్రం బట్టి మీరు రిలేషన్ షిప్ ను ఏ విధంగా డిఫైన్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి : మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చ్ 21 - ఏప్రిల్ 19

మిమ్మల్ని ప్రేమతో కట్టిపడేసే వ్యక్తి కోసం మీరు ఎదురుచూస్తున్నారు. అంటే, ప్రేమంతా మీ పైనే కురిపించాలని మీరు భావిస్తున్నారు. మీరు మీ పార్ట్నర్ నుంచి ఆకాశమంత ప్రేమను ఆశిస్తున్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గర ప్రేమను కురిపిస్తే చాలు మీ మెప్పును పొందినట్టే. అదే సమయంలో, మీరు మీకంటూ స్పేస్ ను కోరుకుంటున్నారు.

ఒక వేళ మీరు ప్రేమించే వ్యక్తి 24 గంటలూ మీ పై నిఘా పెట్టి ఆరా తీస్తున్నట్టయితే మీరా వ్యక్తిని మీ జీవితంలోంచి పంపించేయడానికి మొగ్గు చూపుతారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన టైమింగ్స్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన సమయం పట్ల ఆరా తీసే వ్యక్తిపట్ల మీరు ఆసక్తి కనబరిచరు. మీ ఫోన్

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశిచక్రం వారు అందరితో కలుపుగోలుగా ఉంటారు. మీరు ఒకరిని ఆకర్షించడానికి ఎక్కువగా కష్టపడనవసరం లేదు. మరి వృషభరాశి వారు రిలేషన్ షిప్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వృషభరాశి వారు తమకేం కావాలో క్లారిటీగా ఉంటారు. ఐతే, ఈ క్లారిటీను అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టం. ఎందుకంటే, వృషభరాశి వారు కొంత ఇంట్రావర్ట్ నేచర్ కలిగి ఉంటారు.

కాబట్టి, వృషభరాశి వారు రిలేషన్ షిప్ లోంచి ఏం ఆశిస్తారో మీకు కొంచెం హింట్ ఇస్తాము. తమని గర్వపడేలా చేసే వ్యక్తిని వారు ఇష్టపడతారు. తమని కించపరిచే వారికి దూరంగా ఉంటారు. తమకు కష్టం వచ్చినప్పుడు ఓదార్చే వారిని ఇష్టపడతారు. తమ అభిరుచులను ఎంకరేజ్ చేసే వారిని ఇష్టపడతారు. తప్పులను సరిదిద్ది జీవితాంతం తోడు నీడలా ఉంటాం అనే వారిని ఇష్టపడతారు. అటువంటి వారిని ఈ రోజుల్లో కనుగొనడం కష్టమే కదా!

మిథునరాశి : మే 21 - జూన్ 20

మిథునరాశి : మే 21 - జూన్ 20

వీరు ఫన్ ఫ్యాక్టర్ ని ఇష్టపడతారు. రిలేషన్ షిప్ లాంగ్ టర్మ్ ఉండకపోయినా ఉన్నంత కాలం ఫన్ గా గడపాలని ఆశిస్తున్నారు. మరి లాంగ్ టైం మీతో కలిసి ఉండని పార్ట్నర్ నుంచి వీరు అసలేం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీరికి నచ్చిన విధంగా ఉండడానికి వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. అలాగే, వీరి పిలుపుకు వారు రెస్పాండ్ అయ్యి వెంటనే వీరి ముందు వారు ప్రత్యక్షమవ్వాలి.

మరి, ఈ ఎక్సెపెక్టేషన్స్ ఫెయిర్ అని చెప్పలేము. బాధ వచ్చినప్పుడు ఓదార్చాలని, సమస్యలను పరిష్కరించాలని వీరు అస్సలు ఆశించారు. హ్యాపీగా అలాగే ఫన్ గా గడపడాన్ని వీరు ఆశిస్తున్నారు. వయసైపోయి సెటిల్ అయ్యే వరకు ఇదే పంథాను వారు కొనసాగిస్తారు.

కర్కాటక రాశి: జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి: జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి వారు రిలేషన్ షిప్ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. రాణిలా చూసే అబ్బాయిని వీరు ఇష్టపడతారు. ఇది బాడ్ థింగ్ అయితే కాదు. కానీ, అటువంటి లక్షణాలున్న అబ్బాయిని గుర్తించడం కష్టం. అయితే, మీరు అటువంటి అబ్బాయి కోసం సహనంతో ఎదురు చూస్తారు.

మీరు కూడా అదే విధమైన కేరింగ్ నేచర్ ను ప్రదర్శిస్తారు. మిమ్మల్ని సరిగ్గా చూడని వ్యక్తిపై మీరు ఎనర్జీని ఖర్చు చేసుకోవడాన్ని ఇష్టపడరు. అటువంటి సందర్భంలో మిమ్మల్ని బ్లేమ్ చేయలేము. అందుకే, మీరు ఎవరికీ త్వరగా పడిపోయి మనసుని హర్ట్ చేసుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి కోసం వేచి చూడండి.

 సింహరాశి : జూలై 23 - ఆగష్టు 23

సింహరాశి : జూలై 23 - ఆగష్టు 23

మీరు రిలేషన్ షిప్ లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ను ఆశిస్తారు. మీరు అందుకు మీ వంతుగా వందశాతం ఎఫోర్ట్స్ పెడతారు. క్యాజువల్ సంబంధాలు మీకు నచ్చవు. మీరు మీ పార్ట్నర్ నుంచి వందశాతం కమిట్మెంట్ ను కోరుకుంటారు. మిమ్మల్ని సంతోషపెట్టనివారికి మీ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వరు.

కాబట్టి, మీరు అసలేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి తమ సమయాన్ని మీకు కేటాయించే వారితో మీరు కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ ఆశలను అలాగే ఆకాంక్షలను సాధించేందుకు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని మీరు ఇష్టపడతారు. రిలేషన్ షిప్ లో ఒకరి కొకరు అండగా ఉండాలని మీరు ఆశిస్తారు.

కుంభరాశి : జాన్ 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి : జాన్ 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి వారు అంత ఈజీగా దొరకరు. మిథునరాశిని పక్కన పెడితే మిగతా అన్ని రాశులవారికి తమ పార్ట్నర్ విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రాశిచక్రాల చెందిన అమ్మాయిలను సులభంగా ఇంప్రెస్ చేయలేరు. ఇక కుంభరాశి విషయానికి వస్తే, వీరు ఎవరికీ సులభంగా పడిపోరు. మరింతకీ, కుంభరాశివారు రిలేషన్ షిప్ నుంచి ఏం ఆశిస్తున్నారు? తమలా తమని ఉండనిచ్చే అబ్బాయి కోసం వీరు అన్వేషిస్తున్నారు.

తమపై మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్ ను వీరు కోరుకోవటం లేదు. అదే విధంగా వీరు కూడా ఎదుటివారిపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. కానీ, తమని తామెలా ఉండనివ్వడానికి అభ్యంతరం లేని వ్యక్తిని కోరుకుంటారు. వీరు ఎవరి మీదా ఆధారపడటం ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎదుటివారి దగ్గర కూడా అదే స్వభావాన్ని ఆశిస్తారు. ఆ విధంగా వీరు రిలేషన్ షిప్ ను డిఫైన్ చేస్తున్నారు.

English summary

How Likely Will You Accept Your Relationship Based On Your Zodiac Sign

Your zodiac sign can definitely affect your expectations in relationships. Some signs are totally hopeless romantics (yes, we're looking at you, water signs). Others are completely fine with casual relationships. Read on to find out more about how soon you are likely to define the relationship based on your zodiac sign.
Story first published: Thursday, August 2, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more