For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనిషా? రోబోనా? చేతిలో మైక్రోచిప్స్ ఇంజెక్ట్ చేసుకుని ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రిస్తున్న మనిషి

మనిషా? రోబోనా? చేతిలో మైక్రోచిప్స్ ఇంజెక్ట్ చేసుకుని ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రిస్తున్న మనిషి

|

చేతులలో ఎలక్ట్రానిక్ చిప్స్ ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా దగ్గరలోని ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రిస్తున్న వ్యక్తి :

మీరు మీ వేలుతో స్కాన్ చేస్తూ డిజిటల్ తలుపును తెరిచే ఆలోచనలు చేస్తున్నారా ? ఒక సూపర్ పవర్ వలె అనిపిస్తుంది కదూ ?

ఇక్కడ ఒక స్వీయ ప్రకటిత 'సైబోర్గ్' ఇతను. తన చేతులు మరియు మణికట్టులోకి మైక్రోచిప్స్ ఇంజెక్ట్ చేసుకుని తనను తాను రిమోట్ కంట్రోల్ వలె మార్చుకున్నాడు. క్రమంగా ఈ మైక్రోచిప్స్ ఉన్న చేయి, ఇంటి తలుపుకు, మోటార్సైకిల్ మరియు తన రహస్య సొరుగుకు (సీక్రెట్ డ్రాయర్) తాళం వలె పని చేస్తుంది!

He Has Injected Himself With Microchips That Give Him Access To Control Electronics

ఈ కెనడియన్ మనిషి రుస్ ఫాక్స్, 36 కథనం చూడండి ఒకసారి. అల్ట్రావైలెట్ టాటూస్ నుండి నుదిటిపైన ఇంప్లాంట్ చేయబడిన సిలికాన్ హార్న్స్(కొమ్ములు) వరకు 100 కన్నా ఎక్కువ శరీర మార్పులను కలిగి ఉన్న ఇతను భిన్నంగా, వింతగా ఆసక్తికరంగా కనిపిస్తాడు.

ఫాక్స్ అనే పేరుగలిగిన ఇతను బాడీ మాడిఫికేషన్ ఆర్టిస్ట్, ఇటీవలే తన చర్మం కింద చొప్పించిన చిప్స్ యొక్క అనేక ఉపయోగాలలో కొన్నింటిని ప్రదర్శించి అబ్బురపరుస్తున్నాడు. ఈ మైక్రోచిప్స్ సహాయంతో చేతితో తయారు చేసిన చెక్క పెట్టె లాక్ కూడా సులభంగా అన్లాక్ చేయవచ్చు.

వినడానికి ఆశ్చర్యం కలిగించేలా ఉన్నా కూడా, ఈ మార్పులు అతని శరీరంలో పెద్దగా ప్రభావాలను సృష్టించలేవు., ఎందుకంటే అవి బియ్యపు గింజ కన్నా పెద్దవి కావు కాబట్టి. ఇతను చెప్తున్న ప్రకారం, తాళాలను తరచుగా తీసుకెళ్ళే అవసరం ఉన్నవారికి ఈ పద్దతి మేలు చేస్తుంది.

అతని ప్రకారం, స్వీయ-వ్యవస్థాపిత RFID( రేడియో పౌనఃపున్య గుర్తింపు సాధనం) మరియు NFC – నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లను ఇంప్లాంట్ చేసే ప్రక్రియ కేవలం కొన్ని సెకన్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. కానీ ప్రయోజనాలు అధికం.

ఇంప్లాంట్లు పరిమాణంలో 2mm by 12mm మాత్రమే ఉన్నందున శస్త్రచికిత్స నొప్పిలేనిదిగా ఉంటుందని చెప్తున్నాడు.

చర్మం క్రింద ఇన్స్టాల్ చేసిన ఈ మైక్రో చిప్స్ బాటరీ ఆధారితం కావు. కొన్ని ప్రేరేపించిన రీడర్లకు దగ్గరగా ఉన్నప్పుడు విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా స్వయంగా చార్జ్ చేసుకొనగలవు.

ఎలా అనిపిస్తుంది ఈ క్రియేటివిటీ మీకు? చిన్నప్పుడు మీ సృజనాత్మక ఆలోచనలు, పనులు గుర్తుకువస్తున్నాయా ? మీరెప్పుడైనా ఇటువంటివి ప్రయత్నించి ఉంటే, క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

He Has Injected Himself With Microchips That Give Him Access To Control Electronics

A Vancouver native Russ Foxx is a 36-year-old man who has had over 100 body modifications. These modifications range from ultraviolet tattoos to silicon horns implanted into his forehead. Foxx has got microchips inserted into his body as they act as 'hands-free' keys for his home and motorcycle. All that he needs to do is scan his finger to open his house door.
Story first published:Wednesday, August 22, 2018, 13:02 [IST]
Desktop Bottom Promotion