TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మేషరాశికి చెందిన మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
ఈ రాశికి చెందినవారు ఎప్పుడూ ఎదో ఒక నూతనత్వాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. కొత్త కొత్త వాటిని ఆవిష్కరించడానికి ఆసక్తి కనబడుతారు. ప్రతి దాంట్లోనూ నూతనత్వాన్ని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వీరు స్వతంత్రభావాలు కలిగిన వారు. అలాగే గౌరవప్రదమైన వారు.
అదే సమయంలో వీరిలో సృజనాత్మకత ఆలోచనలు ఎక్కువ. మరోవైపు, వీరికి సహనం తక్కువ.
ఈ రాశికి కుజుడు అధిపతి. అగ్నితత్వంతో ఈ రాశిని పోలుస్తారు. ఈ రాశివారు అత్యంత చురుకుగా ఉంటారు. వీరి చైతన్యం వీరికి ప్రత్యేకతను సంతరించిపెడుతుంది. అనుకున్నది సాధించాలనే తత్త్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది.
ఈ ఆర్టికల్ లో మే 2018 లో మేషరాశికి చెందిన మంత్లీ ప్రెడిక్షన్స్ ను వివరించాము. ఈ రాశిఫలాలను ఇందులో తెలుసుకోండి.
ఆరోగ్యం:
ఈ నెలలో, ఈ రాశివారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ కనబరచాలి. ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగవుతుంది. కాబట్టి, వీరు చింతించనవసరం లేదు. వైద్య ఖర్చులపై వీరు ఖర్చుచేసే డబ్బు అంతా తిరిగి వీరికి చెందే ఆస్కారం కలదు. ఈ నెల వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక పురోగతిని గమనించవచ్చు. రాబడి పెరుగుతుంది. రాబడి పెరిగినందువలన ఖరీదైన వస్తువులను సమకూర్చుకోవాలని భావిస్తారు. మరోవైపు, ఆర్థిక హోదాతో పాటు ఆదాయవనరులు పెరిగే సూచనలు కలవు.
వృత్తి:
ఈ నెలలో వృత్తిపరంగా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు. పనిలో విజయం సాధించడం కాస్తంత కష్టతరంగా మారవచ్చు. మీరు పడే కష్టమంతా వృధా అయిందని మీకు అనిపించే సూచనలు కలవు. ప్రయాణ సూచనలు గలవు. అయితే, అనుకూల ఫలితాలు మాత్రం ఉండకపోవచ్చు. మొత్తమ్మీద, ఈ నెలలో మీరు కాస్తంత సహనం పాటిస్తే మంచి రోజులు త్వరగా వస్తాయి.
ఆర్థిక లావాదేవీలు:
డబ్బు సంపాదించేందుకు మీకు ఈ నెలలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మీకు గణనీయమైన లాభాలు కలిగే అవకాశం కలదు. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో నున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన లాభాలు ఎటువంటి ఆలస్యం లేకుండా మీ వద్దకు చేరుకుంటాయి.
లవ్ లైఫ్:
మీ ఆకర్షణీయమైన రూపానికి ఇతరులు యిట్టే ఆకర్షితులవుతారు. ఈ నెలలో ప్రేమకు అధిపతి అయిన వీనస్ మీ రాశిలో సంచరించడం వలన ఇలా జరుగుతుంది. మీ ప్లెజంట్ బిహేవియర్ తో పనులను సులభంగా సాధించుకోగలుగుతారు. అనవసరపు వాగ్వాదాలకు చోటే లేదు. మీ భాగస్వామితో మీరు మంచి సమయాన్ని ఆహ్లాదంగా గడుపుతారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ భాగస్వామి చేసే ప్రయత్నాలు మిమ్మల్ని సంతోషపెడతాయి. మరోవైపు, ఒంటరివాళ్ళకి ఈ సమయంలో భాగస్వాములు దొరికే అవకాశం ఉంది.
అదృష్ట తేదీలు అలాగే రంగులు:
ఈ నెలలో ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు: 6, 18, 41, 77 మరియు 83.
అదృష్ట తేదీలు : 2, 3, 11, 12, 13, 21, 22, 29, 30 మరియు 31.
అదృష్ట రంగులు వైట్, లెమన్ గ్రీన్ లేదా ఎమెరాల్డ్ గ్రీన్.
వృషభం లేదా ఇంకేదైనా రాశి యొక్క మే 2018 మంత్లీ ప్రెడిక్షన్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ సెక్షన్ ను చెక్ చేస్తూ ఉండండి. ఇందులో ప్రతి రాశికి చెందిన ప్రెడిక్షన్స్ ను వివరంగా అందుబాటులో ఉంచుతాము.