Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వృశ్చిక రాశికి చెందిన హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
వృశ్చిక రాశికి చెందిన హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
ఈ రాశికి చెందిన వారు ప్యాషన్ కలిగిన వ్యక్తులు. అలాగే ఎమోషనల్ కూడా. అన్ని రకాల అవాంతరాలను ఎదుర్కోవడానికి సామర్థ్యం కలిగిన వారు. వీరు తమకి వాటిల్లిన నష్టాల వలన నిరుత్సాహపడకుండా మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లగలిగే తత్త్వం కలిగిన వారు.
వీరు డిటెర్మినేషన్ కల్గిన వారు. అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు తగిన కృషి చేస్తారు. పట్టుదల వీరికి ఎక్కువ. ఏ మాత్రం వెనకడుగు వేయడానికి ఇష్టపడరు.
వీరి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. వీరికి సులభంగా ఆకర్షితులవుతారు. మరోవైపు, వీరు తమ భావోద్వేగాలను బయటికి వ్యక్తపరచడానికి ఇష్టపడరు. అందువలన, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ ఆర్టికల్ లో మే 2018లో వృశ్చికరాశికి సంబంధించిన మంత్లీ ప్రెడిక్షన్స్ ను పొందుబరిచాము.
ఆస్ట్రో నిపుణులు వృశ్చికరాశికి చెందిన ఆరోగ్యం, వృత్తి, ప్రేమ మరియు ఆర్థిక స్థితిగతుల గురించి వివరంగా ప్రెడిక్షన్స్ ను అందించారు.
వీటిని పరిశీలించి ఒక అవగాహనకు రావడం మంచిది. మీది వృశ్చికరాశి అయితే ఈ ప్రెడిక్షన్స్ ను చదివి మే నెల మీకే విధమైన సర్ప్రైజ్ లను అందిస్తుందో ఒక అంచనాకు రండి.
మంత్లీ ప్రెడిక్షన్స్ ను ఇక్కడ చెక్ చేయండి.

ఆరోగ్యం:
ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కలవు. ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. అలాగే, శరీరానికి రెగ్యులర్ మసాజ్ లను అందించాలి. డిటాక్సిఫికేషన్ పై ఫోకస్ చేసి శరీరంలోనున్న ఇంప్యూరిటీస్ ను తొలగించుకోండి.
వృత్తి:
ఈ సమయం వృత్తిపరంగా పోటీ ఎక్కువగా ఉండే సమయం. మీ కెరీర్ గ్రోత్ అనేది వర్క్ ప్లేస్ లో ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అందువలన, మీపై ఇతరులు అసూయ చెందే అవకాశాలు కలవు. ఈ నెలలో రిలాక్స్డ్ లైఫ్ స్టయిల్ ను అడాప్ట్ చేసుకుంటే మంచిది. మీ భాగస్వామి ద్వారా కూడా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, పని ఒత్తిడి పెరగవచ్చు.

ఆర్ధిక లావాదేవీలు:
ఈ నెలలో మీరు ప్రయాణాలు ఎక్కువగా చేయవచ్చు. అయితే, ప్రయాణాల ద్వారా మీకు ఫలితం ఆశించినంత ఉండకపోవచ్చు. రైటర్స్, పెయింటర్స్ మరియు ఇతర కళాకారులకి ఇది అనుకూలమైన సమయం కాదు. కాబట్టి, ముందుగానే అవసరాలకు తగినంత ఫండ్స్ ను సమకూర్చుకోవడం మంచిది. అలాగే, ఈ నెలలో లోప్రోఫైల్ ను మెయింటేన్ చేయడం ఉత్తమం.
లవ్ లైఫ్:
ఈ నెలలో, అవివాహితులు తమ వృత్తిని గౌరవించే వారిపై మక్కువ పెంచుకునే అవకాశము ఉంది. ఈ నెలలో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీరు ఈ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొంటారు. వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ యాక్టివిటీస్ తోడ్పడతాయి. ఈ నెలలో భాగస్వామితో మంచి టైం ను స్పెండ్ చేస్తారు.

అదృష్ట తేదీలు మరియు రంగులు
ఈ రాశికి చెందిన అదృష్ట సంఖ్యలు: 27, 29, 45, 53 మరియు 89.
అదృష్ట తేదీలు: 9, 10, 19, 20, 27, 28.
అదృష్ట రంగులు: వైట్ మరియు ప్రషియన్ బ్లూ.



Click it and Unblock the Notifications
