For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ముద్దుగుమ్మ రోజూ 19 గంటలు పడుకోకుంటే ఉండలేదు, బాడీ షేప్ మార్చుకుంది, నియంత్రించుకుంటుంది

ఆమె పేరు క్రిస్టెన్ దేవన్నా. ఉండేది న్యూయార్క్ లో. వయస్సు 27 ఏళ్లు. చూడడానికి అందంగా ముద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఒక సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. ఈమె "హషిమోటోస్ వ్యాధి" అనే వ్యాధితో ఇబ్బందిపడుతోంది.

|

ఆమె పేరు క్రిస్టెన్ దేవన్నా. ఉండేది న్యూయార్క్ లో. వయస్సు 27 ఏళ్లు. చూడడానికి అందంగా ముద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఒక సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. ఈమె "హషిమోటోస్ వ్యాధి" అనే వ్యాధితో ఇబ్బందిపడుతోంది. ఈమె రోజుకు దాదాపు 19 గంటల పాటు నిద్రిస్తుంది. అలా నిద్రించకుంటే ఆమె శరీరం అస్సలు సహకరించదు.

అంతేకాదు ఆమె రోజూ చలితో అల్లాడిపోతుంది. ఆరేళ్లుగా ఇలాగే ఇబ్బందిపడుతోంది. అలాగే ఆమె స్కిన్ కూడా బాగా పగిలిపోతూ ఉంటుంది. మొదట ఈమె పరిస్థితి గురించి తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమె అన్ని రకాల పరీక్షలు నిర్వహించి రోగ నిర్దారణ చేశారు.

చలితో అల్లాడిపోతుంది

చలితో అల్లాడిపోతుంది

వేసవిలో కూడా క్రిస్టెన్ దేవన్నా చలితో అల్లాడిపోతుంది. అంతేకాదు ఆమెకు చర్మ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. ఎప్పుడూ దురదతో అల్లాడిపోతుంది. చర్మం మొత్తం పాలిపోతూ ఉంది. చర్మంపై పొలుసులు ఏర్పడుతుంటాయి.

పైకి అందంగా కనపడుతున్నా

పైకి అందంగా కనపడుతున్నా

డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి ఆమె డైట్ ను మార్చారు. అలాగే రకకరాల మందులు కూడా రెఫర్ చేశారు. వాటిన్నింటినీ ఆమె పాటిస్తూ ఉంది. అయినప్పటికీ హషిమోటో వ్యాధితో ఆమె తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. చూడడానికి పైకి అందంగా కనపడుతున్నా ఈమె రోజూ జీవితంతో యుద్ధం చేస్తూనే ఉంది.

ఎప్పుడూ చూసినా పడుకునే ఉంటుంది

ఎప్పుడూ చూసినా పడుకునే ఉంటుంది

హషిమోటోస్ వ్యాధిని పూర్తిగా బాగు చేసే వైద్యం కూడా ఇప్పటికీ అందుబాటులో లేదు. ఆమె పరిస్థితిని ఇంట్లో వాళ్లతో పాటు తెలిసినవాళ్లు కూడా అర్థం చేసుకోలేదు. ఎప్పుడూ చూసినా పడుకునే ఉంటుందని ఇంట్లో వాళ్లే తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. వాటిన్నింటినీ చాలా రోజులు మౌనంగా భరించింది క్రిస్టెన్ దేవన్నా. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటోంది.

ఎక్కువ సేపు వర్క్ అవుట్స్

ఎక్కువ సేపు వర్క్ అవుట్స్

ఆమెకు వైద్యం అందించి వ్యాధి నయం చేసే విషయంలో డాక్టర్లు కూడా చేతులెత్తేయడంతో క్రిస్టెన్ స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంది. తాను ఎక్కువ సేపు వర్క్ అవుట్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఎక్కువ సేపు జిమ్ లో గడుపుతూ ఉంది. దీంతో ఇప్పుడిప్పుడే ఈమె వ్యాధి నుంచి కోలుకుంటుంది.

బాడీని షేప్ లోకి తెచ్చుకోలగింది

బాడీని షేప్ లోకి తెచ్చుకోలగింది

తన బాడీని ఒక షేప్ లోకి తెచ్చుకోలగింది. బాడీని స్ట్రాంగ్ గా చేసుకుంది. రోగా నిరోధక శక్తి పెరిగేలా ఫుడ్స్ తీసుకుంటూ ఉంది. అరుదైన వ్యాధి నుంచి తనను తను రక్షించుకోవడానికి నిత్యం చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది క్రిస్టెన్. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఇలాంటి హషిమోటోస్ వ్యాధితో బాధపడుతుంటారు.

నియంత్రించుకోవవడానికి ప్రయత్నిస్తుంది

నియంత్రించుకోవవడానికి ప్రయత్నిస్తుంది

ఈ వ్యాధి వస్తే ఏమీ చెయ్యాలనిపించదు. నిత్యం పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. క్రిస్టెన్ కూడా చాలా రోజులు తిండి కూడా తినకుండా అలా నిద్రపోయింది. ఒక్కసారి పడుకుంటే 19 గంటల పాటు అస్సలు నిద్రలో నుంచి లేచేది కాదు. కానీ ఇప్పుడు తను అన్నింటినీ నియంత్రించుకోవవడానికి ప్రయత్నిస్తుంది. వర్క్ అవుట్స్ తో తన బాడీని స్ట్రాంగ్ గా మార్చుకుంది. తను చేసే వర్క్ అవుట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అంతలా ఉంటాయి తన వర్క్ అవుట్స్.

తను పూర్తిగా మామూలు మనిషిలాగా మారాలని కోరుకుందాం.

English summary

Meet kristen devanna The Woman Who Used To Sleep For 19 Hours At A Stretch

Meet kristen devanna The Woman Who Used To Sleep For 19 Hours At A Stretch
Desktop Bottom Promotion