For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశిచక్రాల ప్రకారం అలవాటుగా చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసా?

|

దైనందిక జీవన మార్గాలలో అబద్ధాలు అనేవి సర్వసాధారణమైన అంశంగా ఉంది అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కొందరు పరిస్థితులకు భయపడి తప్పనిసరి పరిస్థితులలో అబద్ధాలు చెప్పవలసివస్తే, కొందరు ఏమాత్రం ఏ కారణం లేకుండానే అలవాటుగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇదే పద్ధతి కొనసాగి నేర ప్రవృత్తికి కూడా అలవాటుపడే వ్యక్తులను మనం తరచుగా చూస్తూ ఉంటాము. కొన్ని అబద్ధాలు పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, కొన్ని మాత్రం ప్రాణాలను సైతం హరించేవిలా ఉంటాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు.

అలాగని జీవితంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి కూడా ఉంటాడు, అని అనుకోవడం తెలివితక్కువతనం అవుతుంది. కానీ రాశి చక్రాలను అనుసరించి కూడా అబద్ధాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

The Most Common Lie You Tell, Based On Your Zodiac Sign

రాశిచక్రాలను అనుసరించి, ఆయా రాశి చక్రాలకు సంబంధించిన వ్యక్తులు అలవాటుగా చెప్పే అబద్ధాల గురించిన వివరాలను ఇచ్చట పొందుపరచడం జరిగింది.

అవేమిటో తెలుసుకునే క్రమంలో ఈ వ్యాసం దోహదపడుతుంది.

ఇక్కడ ఎవరికివారు తమకు తాము ఉత్తములు అన్న భావనను ప్రదర్శిస్తుంటారు. కానీ పరిస్థితుల దృష్ట్యా అబద్ధాలు చెప్పని వ్యక్తే ఉండడు అన్నది జగమెరిగిన సత్యం. కానీ కొందరు తమ అబద్ధాల ద్వారా పరిస్థితులు చేదాటుతున్నాయన్న ఆలోచన వస్తే పరిష్కారాల దృష్ట్యా నిజాయితీతో తమ తప్పులను తాము ఒప్పుకునే తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ కొందరు మాత్రం స్వార్థపూరితంగా ఆలోచించి అస్తవ్యస్త పోకడలకు నాంది పలుకుతున్నారు.

మేష రాశి: మార్చి21 - ఏప్రిల్19

మేష రాశి: మార్చి21 - ఏప్రిల్19

అబద్ధం: నేను బాగున్నాను

కుటుంబ సభ్యుల సంతోషం కోసం నిరంతరం పాటుపడే మేషరాశి వ్యక్తులు, తాము కష్టాలలో ఉన్నా కూడా, సమస్యలను గుండెలో దాచుకుని, తమ ప్రియమైన వారికి ఎటువంటి సమస్య లేదన్నట్లుగా, తాను అన్ని విధాలా సంతోషంగా ఉన్నట్లుగా దృశ్యరూపకాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

తమ కష్టాలు తమ ప్రియమైన వారి సంతోషాలకు ఆటంకాలుగా ఉండకూడదన్న ఆలోచనే ఈ అబద్ధానికి కారణం.

వృషభ రాశి : ఏప్రిల్20 - మే20

వృషభ రాశి : ఏప్రిల్20 - మే20

అబద్ధం: నేను అస్సలు అబద్ధమే చెప్పను

వ్యక్తిగతంగా ఉత్తమమైన లక్షణాలను ప్రదర్శించే వృషభరాశి వ్యక్తులు, సందర్భానుసారం పరిస్థితులకు తగినట్లుగా ఒక్కొక్కసారి అబద్ధాలకు కూడా పూనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా కనిపెడుతున్నారు అన్న అనుమానం వచ్చినప్పుడు, లేదా ఎవరైనా తమను ప్రశ్నించినప్పుడు తప్పించుకునే క్రమంలో భాగంగా "తాను అబద్ధం చెప్పను" అని అబద్ధం చెబుతుంటారు. కానీ పరిస్థితులు చేదాటుతున్నప్పుడు, ఏమాత్రం భయాన్ని ప్రదర్శించక ధైర్యంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంటారు కూడా. ఏదిఏమైనా కుటుంబ సభ్యుల సంతోషమే వీరి ప్రధాన ధ్యేయంగా ఉంటుంది.

మిధున రాశి : మే21 - జూన్20

మిధున రాశి : మే21 - జూన్20

అబద్ధం: తిరిగి మీ వద్దకు వస్తాను

మిధునరాశి వ్యక్తులు సంబంధ సాంకేతిక నైపుణ్యాలలో కొంచెం తక్కువగా ఉంటారు. క్రమంగా ఎవరితోనైనా చర్చలు జరుపునప్పుడు, అవి తమకు అనుకూలంగా లేవని భావిస్తున్న యెడల, ఇప్పుడే వస్తాను అంటూ ఏదో ఒక వ్యాపకాన్ని కారణంగా చూపి తప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చర్చలు జరపడానికి సమ్మతిని కలిగి ఉండరు.

కర్కాటక రాశి : జూన్21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్21 - జూలై 22

అబద్ధం: నేను దాదాపు సిద్ధంగానే ఉన్నాను

ఏ పనిలోనైనా కొంచెం బద్దకాన్ని ప్రదర్శించే వ్యక్తులుగా ఉన్న కర్కాటక రాశి వారు, కొన్ని ప్రత్యేక సమయాలలో కూడా అదే ధోరణిని అవలంభిస్తుంటారు. ముఖ్యముగా తమకు ఇష్టం లేని చర్చలలో లేదా కార్యక్రమాలలో పాల్గొనుటకు సంసిద్ధత కలిగి ఉండని పక్షములో, వీలైనంత అలసత్వాన్ని లేదా బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ క్రమంలో భాగంగానే ఇటువంటి అబద్ధాలకు పూనుకుంటారు. ఉదాహరణకు ‌ వీరు ఐదు నిమిషాలలో సిద్ధమై వస్తాను అని అంటే, దాని అర్థం కనీసం 30 నిమిషాలుగా ఉంటుందని. క్రమంగా ఆలస్యానికి ప్రతీకగా నిలుస్తుంటారు. కానీ మీ చర్చలు మాత్రం ఉత్తమ ఫలితాలను ఇస్తుంటాయి.

సింహరాశి : జూలై 23 - ఆగస్ట్ 23

సింహరాశి : జూలై 23 - ఆగస్ట్ 23

అబద్ధం: ఇదేమంత పెద్ద విషయం కాదు

ఒక్కోసారి కొన్ని పరిస్థితులు వీరి చేతికి అందనంత దూరంలో ఉన్నప్పటికిని, ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అబద్ధాలకు కూడా సిద్ధపడుతుంటారు. ఆ క్రమంలో భాగంగానే ఎటువంటి ఫలితాలనైనా రాబట్టగలను అన్న ధీమాను ప్రదర్శిస్తుంటారు. ఈ అబద్ధాల కారణముగా, ఫలితాల సాధన కోసం తీవ్రమైన కష్టాన్ని చేయవలసి రావచ్చు కూడా. ‌

కన్యారాశి : ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

కన్యారాశి : ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

అబద్ధం: నాకు అర్థమైంది

ఎటువంటి విషయాలలోనైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే వీరు ఇతరుల మాటలను పెద్దగా పరిగణలోనికి తీసుకోని వారుగా ఉంటారు. క్రమంగా ఎవరైనా వీరికి సూచనలు ఇవ్వాలన్న ఆలోచనలు చేస్తుంటే, వారి మాటలను వింటున్నట్లుగా నటిస్తుంటారు. మరియు తమకు అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ, చెప్పిన మాటలు అర్థం కాకపోయినా కూడా, అర్థం కాలేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉండరు.

తులారాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తులారాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

అబద్ధం : నేను ఎవరికీ చెప్పను

ఇతరుల మనసులో స్థానాన్ని సులువుగా సంపాదించుకునే వీరు, తమతో అన్ని విషయాలు చర్చించుకునేలా నమ్మకాన్ని కలుగజేస్తారు. క్రమంగా వారు చెప్పిన విషయాలను గోప్యంగా ఉంచుతామని మాట ఇచ్చి, వారి సమస్యలను పరిష్కరించాలన్న సత్వర ఆలోచనలతో తమ ప్రియమైన వారితో పంచుకుంటూ ఉంటారు. కానీ ఇది తెలియకుండానే జరుగుతుంది అన్న విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. క్రమంగా ఇటువంటి అబద్ధానికి పూనుకుంటూ ఉంటారు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

అబద్ధం: నిన్ను నేను ఎన్నటికీ క్షమించను

పరిస్థితుల ప్రకారం వాగ్వాదాల నడుమ, ప్రతీకారేచ్ఛతో, పగవారి నాశనానికై మాటలు మాట్లాడే వీరు, కాలానుగుణంగా వీరి ప్రేమతత్వం కారణంగా పగలు, ప్రతీకారేచ్ఛల‌ గురించిన ఆలోచనలను పక్కన పెడుతుంటారు. కొందరు అవకాశం కోసం ఎదురు చూసి దొంగదెబ్బ తీసే అవకాశాలు ఉన్నా, వృశ్చిక రాశి వారు మాత్రం అటువంటి ఆలోచనా ధోరణులకు ఆస్కారాన్ని ఇవ్వరు. మాటలలో కోపతాపాలను ప్రదర్శించే వీరు, మనసులో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

అబద్ధం: ఈ పనిని ఇప్పుడే చేస్తాను

ధనస్సు రాశి వారికి నిరంతరం ఏదో ఒక వ్యాపకం లేదా పని, వారి ఆలోచనలలో తిష్ట వేసుకొని ఉంటుంది. క్రమంగా ఎవరైనా వేరే పనులను అప్పగించిన యెడల, కాదనలేని పక్షములో ఇటువంటి అబద్ధాలకు పూనుకుంటారు. నిజానికి ఒత్తిడిలోనే వీరు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటారు. కావున ఎటువంటి అంశాలనైనా వదులుకొనుటకు సిద్ధముగా ఉండక, ఇతరుల మనస్సును నొప్పింపక, వెంటనే పూర్తి చేస్తాను అన్న మాట ఇస్తుంటారు. అవసరాన్ని ఉద్దేశించి సకాలంలో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలను చేస్తుంటారు. ఇటువంటి సందర్భాలలో చెప్పే అబద్ధాలను పెద్దగా పరిగణనలోనికి‌ తీసుకోరు కూడా.

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

అబద్ధం : నేను ఒట్టు వేస్తున్నాను, నవ్వనని

ఇతరుల పట్ల విచక్షణారహిత ధోరణిని ప్రదర్శించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉండలేని తత్వాన్ని కలిగి ఉండడం మకర రాశి వ్యక్తుల యొక్క ముఖ్య లక్షణంగా ఉంటుంది. క్రమంగా చిన్ని విషయాలలో కూడా ఒట్టు వేస్తూ, వెంటనే దానిని దాటవేస్తుంటారు. తమ సౌకర్యానికి అడ్డువచ్చే ఒట్టును‌ పెద్దగా పరిగణనలోనికి తీసుకోరు.

కుంభ రాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

అబద్ధం : నేను తమాషాకి అన్నాను

కుంభరాశి వ్యక్తులు కాస్త గందరగోళ తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యముగా ఇతరుల మానసిక స్థితిగతులను ఏమాత్రము పరిగణనలోనికి తీసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. క్రమముగా ఉనికిని కూడా ప్రశ్నార్ధకం చేసుకునే పరిస్థితులకు లోనవుతుంటారు. ఇతరుల మనస్సును నొప్పించేలా మాట్లాడి కూడా చమత్కారానికి అన్నాను అంటూ సరిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

మీనరాశి: ఫిబ్రవరి19 -మార్చి20

మీనరాశి: ఫిబ్రవరి19 -మార్చి20

అబద్ధం : ఒక్కసారి నేను ప్రయత్నించి చూస్తాను

ఉనికి కోసం ప్రాకులాడే మీనరాశి వ్యక్తులు, ఎటువంటి విషయాలలోనైనా నెగ్గుకురాగలము అన్న ధీమాని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా క్లిష్ట పరిస్థితుల యందు‌ మేము కూడా ఈ పనిని చేయగలము, అన్న ఆలోచనను ఇచ్చే క్రమంలో భాగంగా తమ పరిధిలోనిది కానప్పటికీ ఒకమారు ప్రయత్నించి చూస్తాము అని అబద్ధాలు చెబుతుంటారు.

Read more about: lies zodiac signs predictions life
English summary

The Most Common Lie You Tell, Based On Your Zodiac Sign

According to astrology, each zodiac sign is known to lie in a unique pattern. They tend to show the world that they are the strongest or the most intelligent individuals, but deep down they know that they are lying! The astro-experts reveal that each zodiac sign has its own set of common lies which are so relatable!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more