For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశిచక్రాలలో అత్యంత తెలివైన రాశిచక్రాలు ఇవే

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాశిచక్ర గుర్తులు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అవలంభించే వైఖరి, వారి పూర్తి స్థాయి జీవితం మరియు వారి మేధస్సుపై దృష్టి సారిస్తుంది!

ఈ అవగాహన రోజువారీ సమస్యలను పరిష్కరించే సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇది వ్యక్తుల యొక్క తార్కిక మరియు విశ్లేషణాత్మక ఆలోచన మొదలైన వాటిపై ఎక్కువగా ఆధారపడి నిర్ణయించబడుతుంది. క్రమంగా వారి వ్యక్తిత్వాన్ని నిర్వచించే పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా వారి సామర్ధ్యం అంచనా వేయబడుతుంది.

ఇక్కడ, ఈ వ్యాసంలో,పొందుపరచబడిన రాశిచక్రాలు మిగిలిన అన్ని రాశి చక్రాలతో పోల్చినప్పుడు అధిక మేధోసంపత్తికి తార్కాణాలుగా ఉన్నాయని చెప్పబడినవి.

మీ రాశి చక్రం కూడా ఇక్కడ చెప్పబడిన అత్యంత తెలివైన రాశిచక్రాల జాబితాలో ఉందేమో గమనించండి.

మిధున రాశి : మే 21- జూన్ 20

మిధున రాశి : మే 21- జూన్ 20

వీరిని 'డ్యూయల్ ఇంటలిజెన్స్' అని వ్యవహరిస్తారు. సందర్భానుసారం చాణక్యుని వలె తెలివితేటలు ప్రదర్శించగల అత్యంత తెలివైన రాశిచక్ర సంకేతాలలో ఒకటిగా భావిస్తారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటూ, ఒక సమస్యను భిన్న కోణాల్లో ఆలోచిస్తూ, సానుకూల ప్రతికూల ఫలితాలను అంచనా వేస్తూ, నిజనిజాలను తెలుసుకోగల నేర్పరులుగా ఉంటారు. క్రమంగా ఒకే సమయంలో భిన్న కార్యాల నిర్వహణలో గొప్పవారుగా ఉంటారు. అంతేకాకుండా ఒకేసారి అనేక సమస్యలను పరిష్కరించడంలో పేరెన్నిక గలవారిగా ఉంటారు.

సింహ రాశి : జూలై 23-ఆగస్టు 23

సింహ రాశి : జూలై 23-ఆగస్టు 23

సింహరాశి వారిని 'తెలివితేటల రారాజు' గా అభివర్ణిస్తారు. సింహరాశి వారి అంతర్బుద్ధి మరియు జిత్తులమారి స్వభావం కలిగి ఉండడం చేత, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకురాగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఫలితంగా, వారు వారి లక్ష్యాన్ని చేరుకునే ప్రతి విషయంలోనూ వారి తెలివితేటలు ప్రతిబింబిస్తుంటాయి. పోరాడేతత్వానికి మారుపేరుగా ఉండే సింహ రాశి వారు, సమస్యలను ఎప్పుడు ఎలా నిర్వహించాలో అంచనా వేయగలిగినవారిగా అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.

కన్యా రాశి : ఆగస్టు 23-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 23-సెప్టెంబర్ 23

కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా మంచి విమర్శకులుగా మరియు ఆలోచనాపరులుగా వ్యవహరించబడుతారు., అత్యంత సంక్లిష్ట పరిస్థితులను చక్కగా వివరించగలిగే విశ్లేషణాత్మక సామర్ధ్యాలు వీరి సొంతంగా ఉంటాయి. ప్రణాళికాబద్దమైన విధానాలకు, పద్ధతికి మారుపేరుగా ఉంటారు. ప్రతి అంశానికి తార్కిక పరిష్కారం దృష్ట్యా ఆలోచనలు చేస్తుంటారు. ఏదైనా సమస్యాత్మక విషయంలో అడుగు వేసేముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్యయనం చేయడం వీరి అలవాటుగా ఉంటుంది, ఈ అలవాటు వారి ప్రజ్ఞాపాటవాల స్థాయిలను అంచనా వేయగలిగేలా కనిపిస్తుంది. అంతేకాకుండా, గణితంలో, ముఖ్యంగా బీజగణితంలో ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు. ఎంతపెద్ద సమస్యాపూర్వకాలైనా నోటి లెక్కలతో ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇవ్వడంలో నేర్పరులుగా ఉంటారు.

తులా రాశి : సెప్టెంబర్ 23-అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 23-అక్టోబర్ 23

తులారాశి వారిని “గూడచారి లేదా డిటెక్టివ్” అని కూడా వ్యవహరించవచ్చు. వారి మేధస్సు అపారం, సమస్యలను పరిష్కరించడంలో మరియు, చుట్టుపక్కల పరిసరాల సంతులనాన్ని కొనసాగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడంలో తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా పరిస్థితులను విశ్లేషించి, ఏకాభిప్రాయాన్ని తీసుకుని ముందుకు అడుగులు వేసేవారిలా ఉంటారు. మరియు మంచి స్నేహితులుగా మరియు సలహాదారులుగా ఉంటారు. వినదగునెవ్వరు చెప్పిన పద్యం వలె, ప్రతి విషయములోనూ ఇరుపక్కల అంశాలను పరిగణనలోనికి తీసుకుని, నిజనిజాలు అంచనా వేయగలిగే నిత్యచైతన్యవంతులుగా ఉంటారు.

కుంభ రాశి : జనవరి 20-ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20-ఫిబ్రవరి 18

కుంభరాశి వారిని అత్యంత అవగాహన కలిగిన రాశిచక్రంగా అభివర్ణిస్తుంటారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇరుపక్కల అభిప్రాయాలను తీసుకుని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి కొంచం తొందరపాటు ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయని అంటారు కానీ, దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మరియ ఇతర రాశిచక్ర సంకేతాలతో పోలిస్తే అత్యంత సహనశీలిగా ఉంటారు. అంతేకాకుండా అత్యంత తెలివైన వారిగా కూడా ఉంటారు. ఇతరుల వ్యవహరించేటప్పుడు, వారు ద్యానం, లేదా ముఖ్యసంభాషణలలో ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో అంతరాయాన్ని కలిగించరు. ఎందుకంటే వీరు కూడా తమకంటూ వ్యక్తిగత స్వేచ్చ ఉండాలని, ఆ స్వేచ్చకు ఎటువంటి భంగం కలుగకూడదని భావిస్తారు కాబట్టి. ఏదైనా కొత్త విషయాల గురించి తెలుసుకునేటప్పుడు, లేదా ఆసక్తిగా నేర్చుకునేటప్పుడు, వీలయినంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తారు, మరియు సమయాన్ని కేటాయిస్తారు. క్రమంగా ఆ విభాగంలో మాస్టర్స్ వలె మారుతారు. అంతటి ఆలోచనా స్థాయిలు వీరి సొంతం.

మీన రాశి : ఫిబ్రవరి 18-మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 18-మార్చి 20

అత్యంత భావోద్వేగ రాశి చక్రాలుగా పేరెన్నిక గలవారు మీన రాశి వారు. ఇతరులను అర్థం చేసుకునే విషయంలో నిజంగా గొప్పవారే అని చెప్పవచ్చు. ఒకరిని అంచనా వేసి, వారి ఆలోచనలను సైతం పసిగట్టగలిగే సామర్ధ్యాలు వీరి సొంతం. ఇతర రాశిచక్ర సంకేతాలతో పోలిస్తే, మీనరాశి వారు సున్నితమైన భావోద్వేగాలతో కూడుకుని ఉంటారు, అదేక్రమంలో మంచి ఆలోచనాపరులుగా తార్కిక, తత్వవేత్తలుగా ఉంటారు. అపారమేధస్సు కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు కళాత్మకంగా, సృజనాత్మక శక్తి కలిగినవారై ఉంటారు మరియు తమ కళ ద్వారా ప్రపంచానికి, వారి అంతర్ద్రుష్టి ప్రతిబింబింపజేసేలా ఉంటారు. మరొక వైపు, ముందుచూపు, దూరదృష్టి కలిగిన వారిగా ఉంటారు. క్రమంగా కుటుంబంలో అత్యంత క్లిష్టమైన అంశాలను సైతం పరిష్కరించగలిగే వారిగా ఉంటారు. పరిస్థితులు చేయి దాటుతున్నాయన్న సమయంలో వీరి మాటలను తీసుకోవడం మంచిది. మరియు వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించడంలో మార్గాలన్నిటినీ చూపగలిగేవారిగా ఉంటారు. కానీ తమ మాటకు విలువ లేదు అన్న భావన వస్తే, అక్కడ నుండి నిష్క్రమించేలా ఆలోచనలు చేస్తుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, ఆద్యాత్మిక, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

List Of The Most Intelligent Zodiac Signs Revealed

There are certain zodiac signs that are marked as the blessed zodiac signs. There are 6 zodiac signs that are said to be the smartest and the most intelligent ones when compared to other zodiac signs. Find out about them, here.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more