ఈ రాశుల వారి గుణాలు అద్భుతం.. వీరికి అందులో ఎవ్వరూ సాటిలేరు

Written By:
Subscribe to Boldsky

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక్కోరాశి వారు ఒక్కోరకమైన గుణాన్ని కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేక గుణాలుంటాయి. అందులో తుల, కుంభ, కన్య, మీన, సింహ, మిథునరాశి చాలా ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటారు. ఆయా రాశుల్లో మీ రాశి కూడా ఉంటే మీ గుణాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

తులరాశి

తులరాశి

తులరాశివారు ఏ సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలో ఆలోచించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి మిత్రులు కష్ట సమయాల్లో వీరిని ఆశ్రయిస్తే కచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చెబుతారు.

అందులో దిట్ట

అందులో దిట్ట

తులరాశి వారు కష్టాల్లో కూడా గట్టెక్కడంలో వీరు దిట్ట. ఇతరులను కూడా వీరు చాలా సందర్భాల్లో ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తారు. వీరు మంచి సలహాదారులుగా ఉంటారు.

కన్యరాశి

కన్యరాశి

కన్యరాశి వారు మంచి విశ్లేషకులు. వీరు ప్రతి విషయంపై సమగ్రంగా మాట్లాడగలుగుతారు. దానిపై ఎంతసేపు అయినా చర్చించగలుగుతారు. ప్రతి సమస్యలో ఉండే మంచిచెడులను వివరిస్తారు. వీరికి గణితంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది. వీరి మైండ్స్ ను అంచనా వేయడం చాలా కష్టం. వీరికి మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారు ఎక్కువగా భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీరు ఇతరుల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా సమస్యను వీరితో చెబితే వెంటనే స్పందిస్తారు. అయితే వీరు చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే ఎమోషన్ కు గురవుతారు.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారు మనస్సులో ఏది ఉన్నా కూడా దాన్ని బయటకు చెప్పేస్తారు. ఏదైనా విషయాన్ని మనస్సులోనే దాచుకుని ఎక్కువ కాలం ఉండలేరు. ఆ విషయాన్ని ఏదో ఒక రోజు అందరి ఎదుట బయటకు చెప్పి బాధపడతారు. వీరు చాలా సున్నితమైన మనస్కులు.

సింహరాశి

సింహరాశి

సింహరాశివారిలో కరుణ ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి విషయాన్ని మనస్సులో ఉంచుకుంటారు. వీరు ఎలాంటి సమస్యపైనా అయినా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించడానికైనా రెడీగా ఉంటారు.

దేనికి లొంగరు

దేనికి లొంగరు

సింహరాశివారు దేనికి లొంగరు. న్యాయంవైపే ఉంటారు. వీరికి వాక్చతుర్యం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎక్కువగా గొప్ప వక్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. వీరికి ధైర్యం ఎక్కువ. వీరు ఒకరిని విమర్శించరు. ఎవరైనా వీరిని ఏదైనా మాటంటే తట్టుకోలేరు.

మిథునం

మిథునం

వీరు పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తారు. వీరు అత్యంత తెలివైన వ్యక్తులు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలుసు.

కష్ట సమయాలను, ఇబ్బందులను ముందే పసిగట్టి వాటికి అనుకూలంగా మార్చుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరి ఎలాంటి పరిస్థితులను అయినా తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తి కలిగి ఉంటారు.

English summary

most intelligent zodiac signs 6 smartest signs

most intelligent zodiac signs 6 smartest signs
Story first published: Tuesday, January 16, 2018, 17:00 [IST]