For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్ని రాశి చక్రాల సంబంధిత వ్యక్తులు నిజంగా రహస్యజీవితాన్ని గడుపుతున్న అనుభూతికి గురిచేస్తుంది.

|

కొంతమందిని ఎన్నిరకాలుగా పరీక్షించినా, ఎంతో కాలం వారితో సహవాసం చేసినా కూడా వారి విధివిధానాలు, ఆలోచనా ధోరణులు కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. అటువంటి రహస్య ధోరణులకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటారు కొందరు. ఎందుకలా? అంటే ఖచ్చితంగా వారివారి రాశి చక్రాల ప్రభావం కారణంగానే అని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. క్రమంగా వారివారి కదలికలను, ప్రణాళికలను సైతం అంచనా వేయలేక పోతుంటాము.

ఈ ప్రశ్నలకు జ్యోతిష శాస్త్రం ఖచ్చితమైన సమాధానాలను కలిగి ఉంది. ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానాన్ని అతను జన్మించిన రాశి చక్రాలు మరియు నక్షత్రాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు చర్యలు సైతం, జన్మ కుండలినిలోని గ్రహాల స్థానాలు ప్రభావితం చేస్తాయని చెప్పబడింది.

వీటి ఆధారితంగా, కొందరు వ్యక్తులు ఎందుకు రహస్య ధోరణిని అవలంబిస్తారో కూడా చెప్పబడింది. వీరి గురించిన అంచనాలు వేయడం అత్యంత క్లిష్టమైన అంశమే. ఆ రాశిచక్రాల సంబంధిత విషయాల గురించిన వివరాలు మీకోసం.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి:

నిజం వృశ్చికరాశి వారు అనూహ్యంగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రస్పుటిస్తుంటారు, వారి కళ్ళను ఎంత తీక్షణంగా గమనించినా వారి భావాలను, ప్రణాళికలను తెలుసుకోవడం అత్యంత క్లిష్టమైన అంశమే. వీరు తమ భావాలను, ఇతరులతో కూడా చాలా తక్కువగా పంచుకుంటూ ఉంటారు. రహస్య ధోరణులకు తార్కాణంగా వృశ్చిక రాశి వారిని పేర్కొనవచ్చు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి క్షణం భిన్నమైన కోణాల్లో పరిస్థితులను చూస్తూ, సాహసాలకు ప్రయోగాలకు పూనుకుంటూ ఉంటారు. ఈ విధానం కూడా వారి ఆలోచనలను పసిగట్టడం ప్రశ్నార్ధకం చేస్తుంది.

కన్యా రాశి:

కన్యా రాశి:

కన్యా రాశి వారు చిలిపి చేష్టలకు కేంద్రంగా ఉంటారు. వీరి ప్రణాళికా బద్దమైన ఆలోచనలకు వీరి చిలిపి చేష్టలకు సంబంధం ఏమిటో అర్ధం కాదు. క్రమంగా వీరి భావాలను కనుగొనడం కష్టంగా ఉంటుంది. ఇతరులను పూర్తిగా అయోమయంలో పడేసి, వారి కార్యాలను వారు నిర్వహించుకుని వెళ్ళే వారిలా ఉంటారు. ప్రాంక్స్ చేయడంలో సిద్దహస్తులుగా ఉంటారు.

అత్యంత లోతైన భావాలను కలిగి ఉండే కన్యా రాశి వారు కూసింత అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా వీరిని విధివిధానాలను గుర్తించడం కష్టంగా ఉంటుంది, ఫలితాలు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవడం ఇతరుల వంతు అవుతుంది.

మకర రాశి:

మకర రాశి:

నిజానికి వీరి ఆలోచనల నిండా భయం ఆవరించుకుని ఉంటుంది. వీరు, ఎక్కడ ఫలితాల సాధనలో వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుందో అన్న భయాన్ని అధికంగా కలిగి ఉంటారు. కానీ పైకి మాత్రం గంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. శత్రువుల గురించిన సరైన అంచనాలను కలిగి ఉంటారు. వీరి అనుమానాస్పద ధోరణి ఇతరులను కాస్త అయోమయంలో పడేసినా, నమ్మదగిన వారిగా ఉంటారు. వీరు ఇతరుల గురించి చేసే అంచనాలు ఎన్నటికీ తప్పు కావు. కానీ, తరచుగా వీరి వ్యక్తిత్వం పట్ల, తప్పు లేకపోయినా నిందలు ఎదుర్కొంటూ ఉంటారు.

Most Read: కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

కుంభ రాశి:

కుంభ రాశి:

ఈ కుంభ రాశి వారు సాధారణంగానే అత్యంత తక్కువగా మాట్లాడుతుంటారు. అయితే, వారి మర్మమైన వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతరులను సులభంగా అర్ధం చేసుకునే లక్షణాలు వీరి సొంతం. క్రమంగా ఇతరులు నిజం చెబుతున్నారా అబద్దం చెప్తున్నారా అని పూర్తి అవగాహనని కలిగి ఉంటారు. తమ మాటలు భవిష్యత్తుని అంధకారంలో పడవేయకూడదు అన్న ఆలోచనతోనే తక్కువగా, రహస్య ధోరణితో ఇతరులతో ప్రవర్తించడం, మాట్లాడడం చేస్తుంటారు. కానీ అందరూ అలాంటి ధోరణిని కలిగి ఉంటారని చెప్పలేము. అది కూడా రహస్యమే. సందర్భానుసారం వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వారిలా కూడా కొందరు ఉంటారు.

మీన రాశి:

మీన రాశి:

చాలామంది ప్రజలు మీన రాశి వ్యక్తుల గురించి ఊహించటం చాలా కష్టంగా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే సంపూర్ణమైన మర్మ వ్యక్తిత్వానికి “కేర్ ఆఫ్ అడ్రెస్” గా ఉంటారు. క్రమంగా వారి భిన్న దృక్పధాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఊహల్లో నివసిస్తూ ఉంటారు. క్రమంగా నిజజీవితంలో అటువంటి ప్రపంచం లేదని నిరాశకు గురవుతూ ఉంటారు. కానీ ఏమాత్రం అవకాశం వచ్చినా తమ ఆలోచనలకు అనుగుణంగా పరిసరాలలో, ప్రణాళికలలో మార్పులను చూపిస్తూ ఉంటారు. ఫలితాలు పూర్తిగా బయటకు వచ్చాకనే, వీరి ఆలోచనలు అర్ధమయ్యేలా ఉంటాయి. తెలివికి నిదర్శనంగా చెప్పే మీన రాశి వారిని, అంచనా వేయడం కష్టమే. ఎటువంటి సమస్యలలో అయినా, తమకంటూ ఒక ఒక ఖచ్చితమైన సమాధానాన్ని కలిగి ఉంటారు. కావున సమస్యలనందు వీరి మాటలను కూడా పరిగణనలోనికి తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. తమకు తాముగా మాత్రం సమస్యలలోనికి వచ్చేందుకు ఎన్నటికీ సిద్దంగా ఉండరు.

Most Read: దేశంలో కంటికి నచ్చిన ప్రతీ అమ్మాయిని అనుభవించాడు,మనుషుల మాంసం తిన్నాడు, ఇలాంటి నియంత ఇంకెవ్వరూ ఉండరు

English summary

Most Mysterious Zodiac Signs

Some people are easy to be understood whereas others cannot be understood that easily. It is mainly because of the stars that they are born under. Have you ever wondered why some of your friends do the exact opposite of what you think they will? Scorpio, Virgo, Capricorn and Pisces are the most mysterious zodiacs.
Story first published: Wednesday, September 19, 2018, 16:02 [IST]