TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344
నాకు ఇద్దరు కూతుర్లు. వారిద్దరినీ ఎంతో బాగా పెంచాను. నాకు స్థోమత ఉన్నంత వరకు ఇద్దరికీ ఎప్పుడూ ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. పెద్దమ్మాయిని సాఫ్ట్ వేర్ కు ఇచ్చి పెళ్లి చేశాను. చిన్న అమ్మాయిని బిజినెస్ మన్ కు ఇచ్చి వివాహం జరిపించాను.
ఇద్దరి సంసారాలు బాగున్నాయి.. ఇక మనువళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడుపుదామనుకున్నాను. కానీ మా చిన్న అమ్మాయి ఒకరోజు ఉదయమే ఇంటికొచ్చి బోరున ఏడ్చింది.
అప్పులయ్యాయి
"మా ఆయన బిజినెస్ లో చాలా నష్టపోయాడు. చాలా అప్పులయ్యాయి. అందుకే ఆస్తిని మొత్తం అమ్మాడు. మేము రోడ్డునపడ్డాం. అయినా ఇంకా అప్పులున్నాయి. మమ్మల్ని మీరే ఆదుకోవాలి నాన్నా అంటూ ఏడ్చింది. "
అంతా చిన్న కూతురికే ఇచ్చాను
ఏడ్వొద్దు బిడ్డా... మీకు నేను కాకపోతే ఇంకెవ్వరున్నారు అని తనను ఓదార్చాను. నాకు రిటైర్డ్ మెంట్ టైమ్ లో వచ్చిన డబ్బును మొత్తం నా చిన్న కూతురికే ఇచ్చాను. అయినా సరిపోలేదంటే మళ్లీ ఉన్న పొలం అమ్మి ఇచ్చాను.
గుండె ఆగిపోయినట్లు అనిపించింది
అలా మా దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చాక నాకు ఒక విషయం తెలిసింది. దాంతో నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. నిజంగా నా చిన్న అల్లుడికి ఎలాంటి అప్పుల్లేవు. అదంతా డ్రామా.
Most Read :నా భర్తకు చాలా అనుమానం, తొలిరాత్రి ఈజీగా ముగియడంతో నీకు అనుభవం ఉందా అన్నాడు #mystory342
నా అల్లుడే మనస్సు మార్చాడు
నా చిన్నఅల్లుడు నా కూతురి మనస్సు మార్చి నా దగ్గర ఉన్న ఆస్తినంతా లాగాడు. "మీ నాన్న దగ్గరుండే ఆస్తి అలాగే ఉంటే భవిష్యత్తుల్లో మీ అక్కవాళ్లకు సగం, మనకు సగం వస్తుంది.
ఆస్తి ఉంటుందో లేదో
అయినా మీ అమ్మనాన్నలు పోయేంత వరకు ఆస్తి ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకే ముందుగానే మనం దాన్ని దక్కించుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు" అని నా అల్లుడు నా కూతురి మనస్సు మార్చాడు. దీంతో నా కూతురు నా అల్లుడు చెప్పినట్లుగా నటించింది.
రోడ్డున పడేలా చేసింది
డబ్బు, నగలు, పొలం, నా రిటెర్డ్ మెంట్ టైమ్ లో వచ్చిన డబ్బు ఇలా అన్ని నా చిన్నకూతురికే ఇచ్చేశాను. చివరకు ఇళ్లు కూడా అమ్మాను. భర్త మాటలు విని కట్టుబట్టలతో మేము రోడ్డున పడేలా చేసింది నా కూతురు.
ట్యాబ్లెట్స్ కు కూడా డబ్బుల్లేవు
మా పరిస్థితిని చూసి మా పెద్ద అల్లుడు చేరదీశాడు. నేను షుగర్ పేషెంట్ ని. నా భార్యకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. మాకు ట్యాబ్లెట్స్ కు కూడా డబ్బుల్లేని స్థితికి మా చిన్న అల్లుడు తీసుకొచ్చాడు.
బంగారంలాంటి మనుషులు
నేను పెద్ద కూతురుకు, పెద్ద అల్లుడికి భారీగా డబ్బు ఇచ్చానని తనని మోసం చేశానని భావించి నా చిన్నల్లుడు అలా చేశాడు. కానీ నా పెద్దకూతురు, పెద్ద అల్లుడు నిజంగా బంగారంలాంటి మనుషులు.
పెద్ద అల్లుడే భరించేవాడు
వాళ్లకు నేను ఏ రోజు పెట్టింది లేదు.. పెళ్లప్పుడు ఇచ్చిన కట్నం, బంగారం తప్ప ఇంకెప్పుడు కూడా నా పెద్ద కూతురికి పెట్టలేదు. నా పెద్దకూతురుకి సంబంధించిన అన్ని ఖర్చులు పెద్ద అల్లుడే భరించేవాడు. తనకు సీమంతం, పురుడు, బారసాల ఇలా ప్రతి శుభకార్యానికి పెద్ద అల్లుడే డబ్బులు భరించాడు.
మాయ మాటలు చెప్పి
కానీ నా చిన్న కూతురిని నా చిన్న అల్లుడు బ్లాక్ మెయిల్ చేశాడో ఏం చేశాడో తెలియదుగానీ మాకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తోంది. అయినా నా కూతురిని నేను తప్పు పట్టడం లేదు.. తనని ఇబ్బందులకు గురి చేసి అలా తనతో నాటకం ఆడించి ఉంటారని మాత్రమే అనుకుంటున్నాను.
పెద్ద అల్లుడు దేవుడిలా..
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నా పెద్ద అల్లుడు దేవుడిలా నాకు అండగా ఉన్నాడు.. నన్ను నా భార్యను తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నాడు.