For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె కన్ను నులి పురుగులకు నివాసం, కంటి నుంచి 14 నులి పురుగులు బయటకొచ్చాయి

డాక్టర్ కళ్లను పరీక్షించిన తర్వాత ఆమె ఎడమ కంట్లో పురుగు ఉందని చెప్పారు. తర్వాత ఆమె తన కంటిని కాస్త నలపగానే ఒక నులి పురుగు కంట్లో నుంచి పాకుకుంటూ వేలిపైకి వచ్చేసింది. దీంతో ఆమె భయపడింది.

|

సాధారణంగా శుభ్రత పాటించకపోవడం వల్ల, మరికొన్ని కారణాల వల్ల కడుపులో నులిపురుగులు ఏర్పడుతుంటాయి. చిన్ని పిల్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది. నులి పురుగుల నివారణకు పాఠశాలల్లో మాత్రలు కూడా పంపిణీ చేస్తుంటారు.

ఇక మీ కళ్లు కాస్త మంటగా ఉన్నప్పుడు వాటిని రుద్దితే కళ్లలో నుంచి ఏవైనా పురుగులు వస్తే మీ పరిస్థితి ఏమిటి? అలాంటి పరిస్థితిని మీరు అస్సలు ఊహించి ఉండరేమో. అయితే అబ్బి బెక్లీ అనే మహిళ కంట్లో నుంచి ఏకంగా కొన్ని పురుగులు బయటకు వచ్చాయి. ఆమె ఎడమ కంటిలో ఈ పురుగులు ఉండేవి. అసలు కథ ఏమిటో చదవండి.

కంట్లో నలతగా అనిపించేది

కంట్లో నలతగా అనిపించేది

అబ్బి బెక్లీకి అప్పడప్పుడు కంట్లో నలతగా అనిపించేది. ఆ సమయంలో ఆమె కంటిని కాస్త రుద్దుకుని ఉపశమనం పొందేది. అయితే ఒక సారి ఆమెకు ఆ నొప్పి తీవ్రత మరింత పెరిగింది. కంట్లో చెత్త ఏమి పడుకున్నా నొప్పి మాత్రం తీవ్రంగా ఉండేది. దీంతో ఆమె డాక్టర్ వద్దకు వెళ్లింది.

 ఎడమ కంట్లో పురుగు

ఎడమ కంట్లో పురుగు

డాక్టర్ కళ్లను పరీక్షించిన తర్వాత ఆమె ఎడమ కంట్లో పురుగు ఉందని చెప్పారు. తర్వాత ఆమె తన కంటిని కాస్త నలపగానే ఒక నులి పురుగు కంట్లో నుంచి పాకుకుంటూ వేలిపైకి వచ్చేసింది. దీంతో ఆమె భయపడింది. సరే అది బయటకి వచ్చింది కదా ఇంకేమీ ప్రాబ్లమ్ లేదనుకుంది.

చిన్నచిన్న పురుగులు వచ్చాయి

చిన్నచిన్న పురుగులు వచ్చాయి

తర్వాత అప్పడప్పుడు కన్ను నలతగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె కంటిలో నుంచి చిన్నచిన్న పురుగులు వచ్చాయి. అవి బయటకు వస్తున్నప్పుడు ఆమె ఆ నొప్పిని భరించలేకపోయేది.

కంటి వైదుల్ని సంప్రదించింది

కంటి వైదుల్ని సంప్రదించింది

వెంటనే కంటి వైదుల్ని సంప్రదించింది. ఆమె కంటిలో నులి పురుగులు చాలానే ఉన్నాయని తేలింది. అయితే వాటన్నింటినీ ఒకేసారి తీసివేయడం కష్టమని డాక్టర్లు చెప్పారు. అలా కంట్లో పురుగులను పెట్టుకునే ఆమె చాలా రోజులు ఉండాల్సి వచ్చింది.

20 రోజులు పడుతుంది

20 రోజులు పడుతుంది

ఆ నులి పురుగులన్నింటినీ తొలగించాలంటే కనీసం 20 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆమె ఆ ఇరవై రోజుల పాటు నరకం చూసింది. ఆమె ఎడమ కంటి నుంచి 14 నులి పురుగులను డాక్టర్లు ఆమె కంటి నుంచి బయటకు తీశారు. ఒక్కో నులి పురుగు అర ఇంచు వరకు ఉంటుంది.

పాకల్లో సంచరిస్తున్నప్పుడు

పాకల్లో సంచరిస్తున్నప్పుడు

ఆమె పశువులకు సంబంధించిన పాకల్లో సంచరిస్తున్నప్పుడు నులి పురుగులు కంట్లోకి చేరి ఉంటాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. యూఎస్ లో ఇలాంటి కేసులు ఇప్పటి వరకు పది వరకు బయటపడ్డాయి. ఇది 11 వ కేసు. సో.. శరీరంలోని ప్రతి అవయం ఎంతో ముఖ్యం కాబట్టి మీరు దేన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు వచ్చే చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తూ ఉండండి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

English summary

OMG! 14 Worms Were Removed From This Woman’s Left Eye

OMG! 14 Worms Were Removed From This Woman’s Left Eye
Story first published:Tuesday, September 4, 2018, 14:54 [IST]
Desktop Bottom Promotion