మీ అదృష్ట సంఖ్య ఒకటా ? అలా అయితే ఈ వ్యక్తిత్వ విలక్షణతలు మిమ్మల్ని నిర్వచిస్తాయి!

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సంఖ్య శాస్త్రం ప్రకారం తొమ్మిది సంఖ్యలు కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ లక్షణాలు మరియు విలక్షణతలు ఒక్కో సంఖ్యకు ఒక్కో లాగా, ప్రత్యేకంగా మరియు గుర్తించదగినివిగా ఉంటాయి.

మనం ఇప్పుడు ఈ వ్యాసంలో అదృష్ట సంఖ్య ఒకటి కలిగిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ విలక్షణతలు తెలుసుకోబోతున్నాం. సంఖ్య శాస్త్రం ప్రకారం మీ అదృష్ట సంఖ్య ఏమిటో మీకు తెలీదా ? అలా అయితే మీరు తప్పకుండా ఈ వ్యాసాన్ని చదవాల్సిందే. వ్యక్తులు ఏ నెలలో అయినా సరే 1,10,19,28 తారీఖులలో జన్మించి ఉంటారో మరియు ఎవరైతే జులై 21 నుండి ఆగష్టు 28 మధ్య లేదా మర్చి 21 నుండి ఏప్రిల్ 28 మధ్య జన్మిస్తారో వారందరికీ ఒకటి అదృష్ట సంఖ్య.

అదృష్ట సంఖ్య ఒకటి కలిగిన వ్యక్తులకు సంబంధించినసమాచారం మరియు విలక్షణతల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

ఈ సంఖ్య వాస్తవికతను తెలియజేస్తుంది :

ఈ సంఖ్య వాస్తవికతను తెలియజేస్తుంది :

సంఖ్యా శాస్త్రం ప్రకారం సంఖ్య ఒకటి వాస్తవికతను తెలియజేస్తుంది. ఈ సంఖ్య కలిగిన వారు కొత్త ఆలోచనలు మరియు బలమైన నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు పనిచేయడానికి కానీ లేదా ఇతరుల దగ్గర నుండి ఆజ్ఞలను తీసుకోవడానికి అసలు ఇష్టపడరు. ఎప్పుడూ ఎదో ఒకటి కొత్తగా చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు అందరు సి.ఈ.ఓ, డైరెక్టర్, మేనేజర్ స్థాయిలలో ఉంటారు.

సూర్యుడు ఎంతో శక్తివంతంగా వీరి పై ప్రభావం చూపిస్తాడు :

సూర్యుడు ఎంతో శక్తివంతంగా వీరి పై ప్రభావం చూపిస్తాడు :

ఈ అదృష్ట సంఖ్య కలిగిన వారి పై సూర్యుడు ఎంతో ప్రభావం చూపిస్తారు. సాధారణంగా సూర్యుడు ఎంతో కాంతిని మరియు ఈ సృష్టిలో అనంత కోటిని బ్రతికిస్తాడు. అందువల్ల సూర్యుడిని సృజనాత్మక శక్తి అని అందరు అంటుంటారు. ఈ సంఖ్య కలవారు అధికారం మరియు శక్తిని వారు చేసే ప్రతి పనిలో చూపించాలని భావిస్తారు.

అధికారాన్ని విపరీతంగా ప్రేమిస్తారు :

అధికారాన్ని విపరీతంగా ప్రేమిస్తారు :

ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులు ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు మరియు కోపాన్ని అణుచుకోవడాన్ని పూర్తిగా ద్వేషిస్తారు. వీరు ఏ వృత్తి లో ఉన్నా లేదా ఏ పని చేసినా వాటిల్లో ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటారు మరియు చాలా తక్కువ సమయంలోనే వారు ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరుతారు.

వీరు ప్రతి ఒక్క విషయాన్ని నిర్మొహమాటంగా ఎదుర్కొంటారు :

వీరు ప్రతి ఒక్క విషయాన్ని నిర్మొహమాటంగా ఎదుర్కొంటారు :

ఏదైనా విషయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులు అటువంటి సందర్భాలను ఎదుర్కోవడానికి అస్సలు సంకోచించారు. వాళ్ళు ఎంతో అసూయ మరియు విపరీతమైన మొండి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కానీ, అదే సమయంలో ఎంతో ధైర్యవంతులుగా మరియు ఏదైనా విషయం మంచి ఫలితాన్ని గనుక ఇస్తుంది అని భావిస్తే కొత్తగా ప్రయత్నించడానికి కూడా వెనకాడరు మరియు అటువంటి సమయంలో ప్రమాదం పొంచి ఉన్నా కూడా ప్రయత్నానికి వెనుకాడరు.

కుటుంబ పరంగా :

కుటుంబ పరంగా :

ఈ అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులు సాధారణంగా, ఆ ఇంట్లో పుట్టిన పిల్లలో వీళ్ళే పెద్ద వాళ్ళై ఉంటారు లేదా ఇంటి పెద్ద ఏ ఏ బాధ్యతలు తీసుకొంటారో వాటిని వీరే తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళు ఎదుటి వారిని గౌరవిస్తారు మరియు అదే గౌరవాన్ని ఎదుటివారి నుండి ఆశిస్తారు. వీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. మరో వైపు వీళ్ళు అన్ని విషయాలను కూలంకషంగా అలోచించి మంచి చెడులను బేరీజు వేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు.

వీరి యొక్క ప్రేమ జీవితం :

వీరి యొక్క ప్రేమ జీవితం :

ఈ వ్యక్తులు ఎంతో నమ్మదగినవారు మరియు ఎంతో నమ్మకమైన భాగస్వాములుగా వ్యవరిస్తారు. వీరు ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు మరియు వీరు ప్రేమించిన వారికి అత్యంత ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు. వీరు వారి భాగస్వాములను రాచరిక పద్ధతుల్లో మెప్పిస్తుంటారు. అత్యుత్తమమైన నమ్మకాన్ని వీరి దగ్గర నుండి ఆశించవచ్చు. ఇవే కాకుండా వీరు వ్యక్తిగత గోప్యతను ఇష్టపడతారు మరియు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటారు మరియు అర్ధం చేసుకొనే భాగస్వామి కావాలనుకుంటారు.

అదృష్ట సంఖ్యలు :

అదృష్ట సంఖ్యలు :

ఒకటిని అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తులకు అత్యంత ముఖ్యమైన అంకెలు మరియు తేదీలు ఏమిటంటే, " 1,2,4 మరియు 7 " అంకెలు మరియు " 1,2,4,7,10,11,13,16,19,20,22,25,28,29 మరియు 31 " తేదీలు చాలా ముఖ్యమైనవి.

మీరు మిగతా ఎనిమిది సంఖ్యల విలక్షణతలు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అలా అయితే మా వెబ్ సైట్ ని ఎప్పటికప్పుడు చూస్తూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.

English summary

Personality Traits Of Number 1 According To Numerology

According to numerology, number 1 is governed by the sun. This number is the beginning from which the other eight numbers are created. This number symbolizes creativity and individuality of a person. Individuals who are born under this number are creative and inventive in their work..
Story first published: Saturday, January 6, 2018, 20:00 [IST]