మీ యొక్క రాశి ఆధారంగా మీకు ఉన్న అతీంద్రీయ శక్తుల గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికి వారి రాశి అనుగుణంగా కొన్ని అతీంద్రీయ శక్తులు ఉంటాయి. ఈ యొక్క శక్తులను సరైన పద్దతిలో వ్యక్తులు అర్ధం చేసుకోవడం ద్వారా వారు వారి యొక్క జీవితాల్లో వారికి ఎదురయ్యే ఉత్తమ లేదా చెత్త పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.

ప్రస్తుతం ఈ వ్యాసంలో ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క రాశుల ఆధారంగా, వారికి ఉండే అతీంద్రీయ శక్తులు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అతీంద్రీయ సామర్ధ్యాలు చాలా శక్తివంతమైనవి మరియు ఉత్తమంగా నిర్వచించబడినవి.

Psychic Powers And Zodiac Connection

భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలతో పాటు, చెత్త పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ఎలా సంసిద్ధంగా ఉండాలి అనే విషయాలకు సంబంధించిన శక్తులు కొన్ని రాశులవారికి వారి రాశులకున్న అతీంద్రీయ శక్తులు వల్ల లభిస్తాయి.

కాబట్టి మీ రాశి ఆధారంగా మీకు ఉన్న అతీంద్రీయ శక్తులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం - మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు - సరైన సమయం, సరైన స్థలం :

మేషం - మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు - సరైన సమయం, సరైన స్థలం :

ఈ రాశి వారు వారికున్న అతీంద్రీయ సామర్ధ్యాల ఆధారంగా తర్వాత జరగబోయే పెద్ద విషయం ఏమిటి అని అంచనా వేయగలరు. వారి యొక్క జీవితంలో వారు మరింత ముందుకు వెళ్ళడానికి, వారు తదుపరి చేయవల్సిన అతిపెద్ద పని ఏమిటి అనే విషయమై వారికి ముందే తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినవారు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా చేసేది ఏదైనా ఉత్తమంగా చేయాలని నమ్ముతారు.

వృషభం - ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు - కనిపించని సరిహద్దుని పసిగట్టగలరు :

వృషభం - ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు - కనిపించని సరిహద్దుని పసిగట్టగలరు :

ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల యొక్క సరిహద్దులను మరియు వారికున్న మానసిక లేదా శారీరిక శక్తి సామర్ధ్యాల యొక్క హద్దులను ఉత్తమంగా పసిగట్టగలరు. ఏ వ్యక్తులైన వీరి దగ్గర కొద్దిగా వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ కావలి అని భావిస్తే, వారు ఈ రాశివారికి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎందుకంటే వారికి ముందే ఈ విషయం తెలిసి ఉంటుంది. వీరు ఎప్పుడైనా వరుసలో నిలుచున్నప్పుడు వేరే వ్యక్తుల దగ్గరకి అతి సమీపానికి వెళ్ళరు లేదా మాటా మాట పెరిగినప్పుడు ఎదుటివ్యక్తుల ముఖం లోపలికి దూరిపోయినట్లు ప్రవర్తించారు. కావాల్సినంత దూరంలో ఉండి ఎదుటి వ్యక్తులతో వ్యవహరిస్తారు.

మిథునరాశి - మే 21 నుండి జూన్ 20 వరకు - అవసరమైన సరైన పదాన్ని వెతకడంలో సిద్దహస్తులు :

మిథునరాశి - మే 21 నుండి జూన్ 20 వరకు - అవసరమైన సరైన పదాన్ని వెతకడంలో సిద్దహస్తులు :

ఈ వ్యక్తులు ఆ క్షణంలో ఎదురయ్యే సందర్భాలకు అనుగుణంగా ఏదైనా విషయాన్ని చెప్పడంలో సిద్దహస్తులు. ఒకసారి పదాల ప్రవాహాన్ని ప్రారంభించిన తర్వాత, వాటివల్ల కలిగే లాభాలు మరియు అవి చూపించే ప్రభావాలకు అసలు అంతే ఉండదు. వీరిని ఎప్పుడూ ప్రజలు చుట్టుముట్టి ఉంటారు. వీరు ఏమి చెబుతారా అనే విషయాన్ని వినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

కర్కాటకం - జూన్ 21 నుండి జులై 22 వరకు - వీరు వారి యొక్క సామర్ధ్యాన్ని విశ్వసిస్తారు :

కర్కాటకం - జూన్ 21 నుండి జులై 22 వరకు - వీరు వారి యొక్క సామర్ధ్యాన్ని విశ్వసిస్తారు :

ఈ రాశివారు ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక మరియు భావోద్వేగ స్థితిని అర్ధం చేసుకోవడంలో మంచి సామర్థ్యం ఉన్నవారు. సులభంగా చెప్పాలంటే, ఎదుటి వారి భావాలను వీరు ఎంతో చక్కగా అర్ధం చేసుకోవడమే కాకుండా వారిలాగే వీరు కూడా భావిస్తారు. వీరు జీవితాంతం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు లేదా కారుణ్య స్వభావముతో మెలుగుతారు మరియు ఎదుటి వ్యక్తులతో, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో భావోద్వేగ పరంగా దూరంగా ఉండాలి. ఇలా చేయడం వారి వల్ల కాకపోవచ్చు. కానీ, ఆలా చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించాలి.

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు - ప్రతి విషయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు :

సింహరాశి జులై 23 నుండి ఆగష్టు 23 వరకు - ప్రతి విషయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు :

వీరి యొక్క అతీంద్రీయ సామర్ధ్యాలు సమయంతో ముడిపడి ఉన్నాయి. ఈ రాశివారు ఎప్పుడుగాని నిద్ర లేవడానికి అలారం పెట్టుకోనవసరంలేదు. ఎదుకంటే, వీరు సాధారణంగానే వీరు లేవవలసిన సమయానికే సహజసిద్ధంగానే లేస్తారు. వీరు సమయాన్ని చూసుకొనవసరంలేదు. ఎందుకంటే వారికి తెలుసు సరైన సమయం ఎదో. వారి లోపల ఉండే గడియారం అత్యద్భుతంగా పనిచేస్తుంది మరియు వారి జీవితంలో చోటుచేసుకోబోయే అతిపెద్ద సందర్భాల్లో, వారు ఖచ్చిత్వంతో వాటిని సరైన పద్దతిలో నిర్వహిస్తారు.

కన్య రాశి - ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు - అవకాశాలను మరియు బెదిరింపులను ముందే పసిగట్టగలరు :

కన్య రాశి - ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు - అవకాశాలను మరియు బెదిరింపులను ముందే పసిగట్టగలరు :

ఈ రాశివారు అవకాశాలతో పాటు, వైపరీత్యాలను కూడా అద్భుతంగా పసిగట్టగలరు. ఏదైనా భూకంపం సంభవించే ముందుగాని లేదా భీకరమైన హరికేన్ లాంటి భీకరమైన సుడిగాలి తుపాన్లను ఈ రాశివారు ముందే పసిగట్టగలరు. వీరు వారి జీవితంలో, వారి జీవితాన్ని మార్చివేసే సందర్భాలను ముందే ఊహించగలరు మరియు రాబోయే అవాంతరాల నుండి తమను తాము రక్షించుకొని ఆ ప్రభావం తమపై పడకుండా ఉండటానికి లేదా తగ్గించుకోవడానికి వీరి శక్తి సామర్ధ్యాలు ఉపయోగపడతాయి.

తులరాశి - సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు - వీరికి వీరి గురించి కంటే కూడా ఎదుటి వారి గురించే అన్ని విషయాలు బాగా తెలుస్తాయి :

తులరాశి - సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు - వీరికి వీరి గురించి కంటే కూడా ఎదుటి వారి గురించే అన్ని విషయాలు బాగా తెలుస్తాయి :

ఎవరితో అయినా సంభాషించాలంటే వారు ముందుగానే మనకు బాగా తెలిసి ఉండాలి అనే నియమం వీరి దగ్గర పనిచేయదు. అంటే దీనర్ధం వీరు ఎదుటివారితో నిఘాడమైన చర్చల్లో పాల్గొంటారని కాదు గాని అంతకు మించిన అతీంద్రీయ శక్తి ఉంది అని అర్ధం. కానీ, ఈ శక్తి సామర్ధ్యాలు వారి దగ్గరకు వచ్చేసరికి అవి అంతగా పనిచేయవు. ఆ శక్తి వీరి దగ్గరకు వచ్చేసరికి ప్రభావాన్ని కోల్పోతుంది. వీరు వీరికున్న గొప్ప శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకోలేరు. అందుచేత ఎప్పుడూ క్రమం తప్పకుండా వీరిని కొద్దిగా ముందుకు తోస్తూ ఉండాలి.

వృశ్చికం - అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు - ఉపరితల పొరని వడపోత చేయడం :

వృశ్చికం - అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 వరకు - ఉపరితల పొరని వడపోత చేయడం :

ఈ రాశివారు అబద్దం చెప్పేవారిని అస్సలు క్షమించరు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి అబద్దాలు చెప్పడంలో ఎంతో నేర్పరి అయి ఉండొచ్చు. అయినప్పటికీ వారు అబద్దం చెబుతున్నారు అనే విషయాన్ని తక్షణమే చెప్పేయగలరు. వీరిని ఎవ్వరుగాని మాయచేయలేరు, మోసం చేయలేరు లేదా ఆటపట్టించలేరు. వీరి తలకు ఎప్పుడైతే ఎవరి మాటలైనా వినపడతాయో, ఆ క్షణమే ఎదుటి వారు మాట్లాడేది నిజమా లేక అబద్దమా అనే విషయం తెలిసిపోతుంది. అబద్దాలు చెప్పేవారన్నా, నిజాన్ని దాచేవారన్నా లేదా అబద్దపు కథలు చెప్పే వారిని అస్సలు ఉపేక్షించరు మరియు అటువంటి వాటిని వినడానికి వీరికి అస్సలు ఓపిక ఉండదు.

ధనస్సు - నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు - విజయతీరాలను తెలుసుకుంటారు :

ధనస్సు - నవంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు - విజయతీరాలను తెలుసుకుంటారు :

ఈ రాశివారు వీరికి కావాల్సిన వాటిని సులభంగా సాధించుకోవడానికి, అందుకు కావాల్సిన భావవ్యక్తీకరణ సమర్ధవంతంగా వ్యక్తీకరిస్తారు. ఈ వ్యక్తులు లాభాలను ఆర్జించడంలో అధిక శాతం విజయం సాధిస్తారు. చాలా మంది విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు. వ్యూహాలు రచిస్తారు మరియు అన్ని విషయాలను వాటి ప్రాముఖ్యతల అనుగుణంగా విభజించి విజయతీరాలకు చేరుకోవడానికి ప్రతయత్నిస్తారు. ఈ లక్షణాల్ని ఈ రాశివారికి సహజంగానే లభిస్తాయి.

మకరం - డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు - వేగాన్ని తెలుసుకోగలరు :

మకరం - డిసెంబర్ 23 నుండి జనవరి 20 వరకు - వేగాన్ని తెలుసుకోగలరు :

ఈ రాశివారు వీరికున్న అతీంద్రీయ సామర్ధ్యాల ద్వారా జీవిత వేగాన్ని తెలుసుకోగలరు. జీవితంలో ఎదగటానికి సరైన సమయం ఎప్పుడు అనే విషయం వీరికి బాగా తెలుసు. ఏ సమాచారం అందుబాటులో లేనప్పుడు లేదా ఎటువంటి ఆధారాలు లభించకముందే వీరు పనిని అందరికంటే ముందే మొదలుపెడతారు. వీరి జీవితంలోని సరైన సమయంలో, పెను మార్పులు తీసుకురావడానికి వీరు సిద్దహస్తులు మరియు ఒక స్థిరమైన వేగంతో విజయాలను అందుకుంటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోగలరు.

కుంభం - జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు - మనస్సుని చదవగలరు :

కుంభం - జనవరి 21 నుండి ఫిబ్రవరి 18 వరకు - మనస్సుని చదవగలరు :

ఈ రాశి వ్యక్తుల్లో ఎదుటివారి మనస్సుని చదివే నైపుణ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఈ నైపుణ్యం వీరికి సహజ సిద్దంగానే లభిస్తుంది మరియు ఎదుటి వ్యక్తి మనస్సులో ఏముంది అనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి వీరికి ఎంతో సమయం పట్టదు. ఈ నైపుణ్యం వల్ల ఎదుటి వ్యక్తి అవసరం ఏమిటి అనే విషయాన్ని వీరు సులభంగా అర్ధం చేసుకోవడానికి ఇది సహాయ పడుతుంది.

మీనం - ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు - మొత్తం చిత్రాన్ని చూడగలరు :

మీనం - ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 వరకు - మొత్తం చిత్రాన్ని చూడగలరు :

ఉన్న అన్ని రాశుల్లో కెల్లా ఈ రాశి అతీంద్రీయ రాశి అని చెప్పవచ్చు. మొత్తం విషయాన్ని చూడటం వీరి ప్రత్యేకత. క్లిష్టమైన సందర్భాల్లో చిక్కుముడులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం వీరికి స్పష్టంగా తెలుసు మరియు సరైన సమయంలో ఆ సందర్భాలను ఎలా నిర్వహించాలి అనే విషయం కూడా వీరికి బాగా తెలుసు.

English summary

Psychic Powers And Zodiac Connection

Psychic Powers And Zodiac Connection,Do you know that each zodiac sign has its own psychic power? These powers help them understand the others and their oncoming events in a better way.