సముద్ర శాస్త్రం: శరీరం వివిధ భాగాలలో దురదలోని ఆంతర్యం ఏమిటి?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఒక్కోసారి మన కళ్ళు వాటికవే అదరడం లేదా దురదగా అనిపించడం ప్రారంభిస్తాయి. దీనిని ఉద్దేశించి అదృష్టం లేదా దురదృష్టం అని చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ అంచనాలు కంటి కంటికీ మారుతూ ఉంటాయి. మీకు తెల్సా ఇలా కన్ను అదరడం కూడా కొన్ని ముఖ్యమైన పనులని సూచిస్తుందని?

నిజం , సముద్ర శాస్త్రం ప్రకారం ఇలా కన్ను అదరడం లేదా దురద పెట్టడం, శరీరం తిరగడం వంటివి మన జీవితంలో రాబోయే సంఘటనల వాస్తవ రూపాన్ని రహస్య సమాచారంగా మనకి తెలియజేస్తుంది.

Samudra Shastra

సముద్ర శాస్త్రం : శరీరంలోని మార్పులు మనకు తెలియజేసే రహస్యాలు

ఆశ్చర్యంగా ఉందా? శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో కలిగే దురద ఎలా మనకు భవిష్యత్తు సంఘటనల గురించి తెలియజేస్తుందో కింది వివరాలలో చూడండి.

శరీరం ఎడమ వైపు

శరీరం ఎడమ వైపు

సముద్ర శాస్త్రం ప్రకారం, శరీరంలోని ఎడమవైపు ఏ చర్మ రోగం లేకుండా ఆగకుండా దురద వస్తున్నట్లయితే, త్వరలో ఏదో చెడు వార్త మీ చెవిని చేరనుందని అర్ధం. ఉదాహరణకు సంబందీకుల మరణ వార్త, లేక ఉద్యోగం కోల్పోవడం వంటివి.

శరీరం కుడి వైపు

శరీరం కుడి వైపు

సముద్ర శాస్త్రం ప్రకారం, శరీరంలోని కుడి వైపు ఆగకుండా దురద వస్తున్నట్లయితే ఏదైనా మంచి పరిణామం జరగనున్నదని అని అర్ధం. కాని మహిళల విషయం లో ఇది తప్పు అని శాస్త్రం చెప్తుంది. తద్వారా స్త్రీలు శరీరంలో ఎడమ వైపు కలిగే దురదల వలన మంచి వార్తని వింటారు, అదే కుడివైపున వస్తే చెడు వార్తని వింటారు అని అర్ధం.

నుదురు బాగాన

నుదురు బాగాన

వ్యక్తి నుదురు భాగాన దురద వస్తున్న ఎడల , వారు త్వరలో కొన్ని ప్రాపంచిక ఆనందాలను ఎదుర్కొనబోతున్నారని అర్ధం. అదే కణతి భాగాన వచ్చు దురదల ద్వారా ద్రవ్య ప్రయోజనాలను పొందబోతున్నారని సముద్ర శాస్త్రంలో చెప్పబడినది.

కన్ను దురదగా ఉంటే

కన్ను దురదగా ఉంటే

మీ ఎడమకన్ను తరచుగా అదురుతూ లేదా దురదగా అనిపిస్తే త్వరలో మీరు మంచి వార్తని వినబోతున్నారని అర్ధం, అదే కుడికన్ను అడరడం మొదలు పెడితే త్వరలో మీ కలలన్నీ నెరవేరబోతున్నాయని అర్ధం.

కాని మీ కుడికన్ను ఎక్కువకాలం దురద గా ఉంటే దీర్ఘకాల అనారోగ్య లక్షణాన్ని కలిగి ఉన్నారని శాస్త్రం చెప్తుంది. ఈ సంజ్ఞ వస్తే తక్షణమే మీరు డాక్టరుని సంప్రదించవలసి ఉంటుంది. తద్వారా రోగ నిర్ధారణ ప్రకారం మందులు వాడవలసి ఉంటుంది.

బుగ్గ దురద పెట్టడం

బుగ్గ దురద పెట్టడం

సముద్ర శాస్త్రం ప్రకారం రెండు బుగ్గలూ ఏకకాలంలో అదురుతూ ఉన్నా కాని లేక దురదగా ఉన్నా కాని , మీరు అతి త్వరలోనే ఎక్కువ డబ్బుని సంపాదిస్తారని అర్ధం. ఇది అరుదైన విషయంగా జనులు నమ్ముతారు. ఇది జరిగినట్లయితే మంచిరోజులు మీ మార్గం వైపు వస్తున్నాయని అర్ధం.

పెదాలు దురదపెట్టడం

పెదాలు దురదపెట్టడం

శాస్త్రం ప్రకారం మీ పెదవి అదరడం ప్రారంభిస్తే , త్వరలో మీరు కొత్త స్నేహితులను కలిగి ఉండబోతున్నారని అర్ధం. లేదా విడిపోయిన స్నేహితులని మళ్ళీ కలుసుకుని సంబంధాలు కొనసాగించబోతున్నారని అర్ధం.

భుజం పై

భుజం పై

ఇది మీ పరిశీలను వస్తే, త్వరలో మీరు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందబోతున్నారని అర్ధం. మీరు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ దక్కనుందని దీని అర్ధం.

అరచేతుల పై దురదగా ఉంటే

అరచేతుల పై దురదగా ఉంటే

మీ అరచేతుల పై దురదగా ఉంటే త్వరలో ఏదైనా పెద్ద సమస్య మిమ్ములను చుట్టుముడుతుందని అర్ధం, కఠినమైన ఈ కాలాన్ని ముందే అంచనా వేయడం ద్వారా రానున్న అడ్డంకులను అంచనా వేసి పరిస్థితులను చక్కదిద్దే అవకాశం ఉంది.

వేలి పై దురదగా ఉంటే

వేలి పై దురదగా ఉంటే

వేలిపై కలిగే దురద మీ పాత స్నేహితులను కలవబోతున్నారు అనడానికి సంజ్ఞ. ఈ సమావేశం ద్వారా మీరు జీవితకాల సాన్నిహిత్యాన్ని పొందబోతున్నారు అని అర్ధం.

English summary

Samudra Shastra: Your Body Parts Twitching Can Reveal About The Upcoming Events In Your Life!

According to Samudra Shastra, our body parts are a little too sensitive. They can catch the slightest of signs that our brain is trying to convey to us. Though the twitching of muscles is caused by an involuntary movement, it is something that you cannot control and is mostly harmless. According to the Shastras, it can also predict your future.
Story first published: Sunday, March 11, 2018, 12:00 [IST]