For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరూ అలాగే సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు, అలా సెల్ఫీ తీసుకుంటే మీ జీవితం నాశనమే

ప్రస్తుతం అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌లోడు అవుతున్న ఫోటో వేలి ముద్రతో అదే మాదిరిలో నకిలీని సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఐపీఎస్ రూప హెచ్చరించారు.

|

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రపంచ యువతను సెల్ఫీల పిచ్చి పట్టి పీడిస్తోంది. సెల్ఫీలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు సెల్ఫీల్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సెల్ఫీ తీసుకోవాలంటే... ముందు మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఆన్ చేయాలి. సెల్ఫీలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టుగా కామెంట్‌ చేయటం ఇప్పుడో ఒక ట్రెండ్‌. ఇక కొందరి లవర్స్ మధ్య సెల్ఫీ ముచ్చట్లు ఈ విధంగా ఉంటాయి.

'హేయ్‌ భరత్, నేను పోస్టు చేసిన సెల్ఫీకి నువ్వెందుకు లైక్‌ కొట్టలేదు. నేనంటే నీకస్సలు ఇష్టంలేదు'' బుంగమూతి పెట్టి మరీ స్వాతి అడిగేసరికి, భరత్ కు ఏమి చెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు. ఎందుకంటే, అది స్వాతి ఒక పందితో తీసుకున్న సెల్ఫీ మరి. ఎలా ఉందీ అంటే ఏం చెప్తాడు పాపం. పిచ్చి మరీ ముదిరిపోయిందని పైకి చెప్పలేక, చెప్తే మళ్ళీ తనతో స్వాతి మాట్లాడటం మానేస్తుందని భయమేసి, రాని నవ్వు తెచ్చుకుంటూ ''అది... నేను ఆఫీసు పనిలో బిజీగా ఉండి రెస్పాండ్‌ అవ్వలేదు స్వాతి డార్లింగ్‌, దానికేం సూపర్‌గా ఉంది. పందితో సెల్ఫీ దిగడమంటే మామూలు విషయమా! అసలు ఆ థాట్‌కే నీకు అవార్డు ఇవ్వాలి'' అంటూ ఆ ఒక్క డైలాగ్‌తోనే స్వాతిని ఫ్లాట్‌ చేసేశాడు. ఇలా లవర్స్ మొత్తం సెల్ఫీ మానియాలో మునిగితేలిపోతున్నారు.

selfie with victory sign can land you in trouble here is why

ఇప్పుడు అందరూ సెల్ఫీ మోజులో ఉన్నారు. ఏ ఇద్దరూ కలిసి కూడా సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. అంత వరకే ఒకే కానీ కొందరు చేతి వేళ్లను చూపిస్తారు. అదే వేలి ముద్రలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే చాలా ప్రమాదాలున్నాయి.బయోమెట్రిక్‌ వేలిముద్రలతో సెల్‌ఫోన్‌, ఇతర పరికరాలు, అకౌంట్లు లాక్‌ చేయడం సురక్షితం అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మూడు మీటర్ల లోపు దూరం నుంచి మంచి కాంతిలో, స్పష్టంగా తీసిన ఫొటోలలోని చేతి వేళ్లను హ్యాకర్లు సులభంగా కాపీ చేయగలరని జపాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ పరిశోధకులు కనుగొన్నారు.

వేలి ముద్రలను హ్యకర్లు కాపీ చేయగలరు

వేలి ముద్రలను హ్యకర్లు కాపీ చేయగలరు

మామూలుగా చేతి వేళ్లు చూపిస్తూ దిగిన సెల్ఫీ నుంచి కూడా వేలి ముద్రలను హ్యకర్లు కాపీ చేయగలరని ప్రొఫెసర్‌ ఐసాఓ ఇఛీజెన్‌ చెప్పారు. ఈ పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిందని, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చేతి వేళ్ల కొనలు ఫొటోల్లో కనిపించకుండా చేసే పారదర్శకమయిన టైటానియమ్‌ ఆక్సైడ్‌ ఫిల్మ్‌ను జపాన్‌ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కానీ, చేతి వేళ్లు ఫొటోల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

చాలా మంది ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు

చాలా మంది ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు

సెల్ఫీలో విక్టరీ సింబల్ చూపిస్తూ దిగడంపై చాలా మంది ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. అలా సెల్ఫీలు దిగితే వచ్చే ఇబ్బందులను వివరిస్తున్నారు. ఇలా సెల్ఫీ దిగితే మీ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బులకు కోత పడుతుంది. కర్ణాటకకు చెందిన ఐపీఎస్‌అధికారి డి.రూపా నెటిజన్లను హెచ్చరిస్తున్నారు.

వేలిని చూపించి సెల్ఫీ తీసుకోవొద్దు

వేలిని చూపించి సెల్ఫీ తీసుకోవొద్దు

సెల్ఫీ తీసుకొనేటప్పుడూ ఎవరూ కూడా వేలిని చూపించి సెల్ఫీ తీసుకోవద్దంటూ హెచ్చరిస్తూ తను మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఆప్‌లోడ్‌ చేశారు. అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ విక్టరీ మార్కులో రెండు వేళ్లను చూపించి సెల్ఫీలను తీసుకుంటున్నారని ఇది మంచి ది కాదని ఆమె చెప్పారు.

బొటన వేలును చూపిస్తూ డన్‌ అనే సంకేతంతో

బొటన వేలును చూపిస్తూ డన్‌ అనే సంకేతంతో

మరికొందరు బొటన వేలును చూపిస్తూ డన్‌ అనే సంకేతంతో ఫొటోలు దిగుతున్నారు. ఇలా ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటం కూడా తప్పే. ఇలా సామాజిక మాధ్యమాలలో వేలి ముద్రలను చూపుతూ పాలు పంచుకోవటం చాలా ప్రమాదమని రూపా తన వీడియోలో హెచ్చరించారు.

నకిలీని సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి

నకిలీని సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి

ప్రస్తుతం అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌లోడు అవుతున్న ఫోటో వేలి ముద్రతో అదే మాదిరిలో నకిలీని సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఐపీఎస్ రూప హెచ్చరించారు. ఒక ఐపీఎస్‌ అధికారి ఇలా వీడియో తీసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటంపై ప్రశంసలు వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోండి.. పర్వాలేదు, అయితే చేతి వేళ్లను చూపించే పద్దతి వద్దని ఆమె నెటిజన్లకు ఆమె సలహా ఇచ్చారు.

చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకుని సెల్ఫీలు దిగితే

ఇక సెల్ఫీల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇక అదేపనిగా చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకుని సెల్ఫీలు దిగితే ‘సెల్ఫీ ఎల్బో' అనే సమస్య తలెత్తుతుంది. జర్నలిస్ట్‌ హోడా కాబ్‌ రోజుకు దాదాపు 200 సెల్ఫీలు క్లిక్‌ మనిపించేది కాబట్టే ఆమెకా సమస్య తలెత్తింది. కారణం... సెల్ఫీ క్లిక్‌మనిపించాలంటే సెల్‌ఫోన్‌ పట్టుకున్న చేతిని ముందుకు లేదా పైకి లేపి బొటనవేలితో కెమెరా బటన్‌ నొక్కాలి.

కండరాలు దెబ్బతింటాయి

ఇలాంటి చిత్రమైన యాంగిల్‌లో పదే పదే చేతిని కదలించటం వల్ల మోచేయి మీద ఒత్తిడి పెరిగి అక్కడి కండరాలు, లిగమెంట్లు, మృదులాస్థి దెబ్బతింటాయి. దాంతో తీవ్రమైన నొప్పి బాధిస్తుంది.

పరిష్కారం: సెల్ఫీ ఎల్బో సమస్య ఉన్నవాళ్ల మోచేయి నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ చేత్తోనైతే సెల్ఫీలు క్లిక్‌మనిపించారో ఆ చేయి ఎటువైపు కదిలించినా మోచేతిలో నొప్పి మొదలవుతుంది.

సెల్ఫీలకు గుడ్‌బై చెప్పేయటమే

సెల్ఫీలకు గుడ్‌బై చెప్పేయటమే

ఈ సమస్యకు పరిష్కారం సెల్ఫీలకు గుడ్‌బై చెప్పేయటమే! ఇలాచేస్తే మోచేతిలోని సమస్య నెమ్మదిగా సర్దుకుంటుంది. నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యుల సూచనమేరకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడొచ్చు. మొత్తానికి సెల్ఫీల పిచ్చి ఉన్నవాళ్లంతా ఈ జాగ్రత్తలు పాటించాలి.

English summary

selfie with victory sign can land you in trouble here is why

selfie with victory sign can land you in trouble here is why
Desktop Bottom Promotion