Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వృషభరాశికి చెందిన మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్
వృషభరాశికి చెందిన వారు తమపై ఆధిపత్యాన్ని భరించలేరు. ఈ రాశి తత్వము భూతత్వము. శుక్రుడు ఈ రాశికి అధిపతి. వీరు సహజంగానే ఒదిగి ఉండే స్వభావం కలిగి ఉంటారు. వీరికి పెద్ద పెద్ద ఫ్యాన్సీ డ్రీమ్స్ కలగవు.
ఒక వ్యక్తిగా వీరు చాలా డిటెర్మినేషన్ కలిగిన వారు. దృఢమైన మనోబలం కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన పాజిటివ్ లక్షణాలివి.
వీరికి అహంభావం ఎక్కువ. అలాగే మొండిగా ప్రవర్తించే గుణం కూడా వీరిలో ఎక్కువే. ఈ రాశికి చెందిన కొందరిలో అత్యాశ మరియు బద్ధకం కూడా కనిపిస్తుంది.
కొన్ని సార్లు వీరు బద్ధకం, అత్యాశ, అనుమానం మరియు కఠినత్వం వంటి లక్షణాలతో ఉంటారు. కాబట్టి, ఒకవేళ మీది ఇదే రాశి అయితే ఈ నెలలో మీ రాశిఫలాల గురించి తెలుసుకోండి.

ఇక్కడ, మా ఆస్ట్రో నిపుణులు ఈ నెలలో మీ ఆరోగ్యం, వృత్తి, ప్రేమ, కెరీర్ తో పాటు అదృష్ట సంఖ్యలు అలాగే రంగుల గురించి వివరించారు. వృషభరాశికి సంబంధించిన మే నెల ప్రెడిక్షన్స్ కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
ఆరోగ్యం:
ఈ నెలలో ఆరోగ్యానికి సంబంధించి మీరు మరింత తీక్షణంగా ఆలోచించాలి. మీ హెల్త్ ప్రాబ్లెమ్స్ కి సాధారణ రెమెడీలు పరిష్కారంగా పనిచేయకపోవచ్చు. మీ ఆర్ధిక స్థితి మెరుగ్గా లేకపోయినా కూడా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. వైద్య ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. మీ ఉదరం అలాగే చర్మంపై మీరు శ్రద్ధ వహించాలి. ఈ రెండు ఆర్గాన్స్ కి ఈ నెలలో ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని ప్రెడిక్షన్స్ తెలుపుతున్నాయి. మీ ఫైనాన్సస్ ను అలాగే ఎస్సెట్స్ ను సరైన విధంగా మేనేజ్ చేసుకోగలగాలి. ఈ నెలలో మీకంటూ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అవసరమయ్యే సూచనలు గలవు.

వృత్తి:
కెరీర్ పరంగా ఈ నెల మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. పని ఒత్తిడి తక్కువగా ఉన్నా కూడా లక్ష్యాలను సాధించేందుకు అవాంతరాలు ఎదురవవచ్చు. లేదా మీరు వర్క్ తో సంతృప్తి పడలేకపోవచ్చు. ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా ఉండవు. అదేసమయంలో, దక్షిణంవైపు ప్రయాణం మీకు కాస్త లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు, మీకు ఉద్యోగంలో చిన్నపాటి ఎదురుదెబ్బలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఆర్ధిక లావాదేవీలు:
ఈ నెలలో ఆర్థిక పురోగతి ఏ మాత్రం సంతృప్తికరంగా ఉండదు. ఈ నెలలో, మీరు ఎక్కువగా కష్టపడతారు. లాభాలను పొందడానికి విపరీతంగా స్ట్రగుల్ అవుతారు. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. మరోవైపు, ఇవేస్ట్మెంట్స్ లేదా కొత్త వెంచర్స్ ని లాంఛ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని కొన్నాళ్ళు వాయిదా వేయడం మంచిది. వీటికి ఈ నెల అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులు తొలగిపోయే వరకు లో ప్రొఫైల్ ని మెయింటెయిన్ చేయడం మంచిది.

లవ్ లైఫ్:
కుటుంబ వాతావరణంలో కొంత మెరుగుదల ఉంటుంది. ప్రశాంతత నెలకొంటుంది. అవివాహితులకు మే 16 తరువాత వివాహమయ్యే సూచనలు కలవు. మొత్తమ్మీద, ఈ నెల మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు అలాగే కమిటెడ్ కపుల్స్ కు ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు తమ భాగస్వాముల నుంచి ఎన్నో సర్ప్రైజ్ లు అందుతాయి.
అదృష్ట తేదీలు అలాగే రంగులు:
ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు : 5, 35. 50, 57, మరియు 82.
అదృష్ట తేదీలు : 7, 8, 16, 17, 18, 25 మరియు 26.
అదృష్ట రంగులు : ఆపిల్ గ్రీన్ మరియు వెర్మిలియన్ రెడ్.



Click it and Unblock the Notifications
