నవగ్రహాల అనుగ్రహం లేకుంటే బతుకు బుగ్గిపాలు

Written By:
Subscribe to Boldsky

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు నవ గ్రహాలున్నాయి. చాలామంది జ్యోతిష్య శాస్త్రంపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే జ్యోతిష్యాన్ని ఫాలో అవుతుంటారు. ఏ శుభకార్యమైనా సరే జాతకాన్ని చూశాకే ప్రారంభిస్తుంటారు. ఇందులో నవ గ్రహాల గమనం చాలా ప్రధానం.

జ్యోతిష్య సంప్రదాయంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.

సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.

సూర్యుడు

సూర్యుడు

సూర్య భగవానుడు నవగ్రహాల్లో ఒకరు. భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక సూర్యభగవానుడు చాలా అవసరం. సూర్య గ్రహం మధ్యలో ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు తిరుగతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం, రూపం, జ్ఞానం, విజయాలు నిర్ణయించడంసూర్య గ్రహంపైనే ఆధారపడి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు.

చంద్రుడు

చంద్రుడు

నవగ్రహాల్లో ఒకటైన చంద్రగ్రహాన్ని సోమా అని కూడా కొందరు పిలుస్తారు. మన జీవితాల్లోని అతి ముఖ్యమైన సంఘటనల సంబంధించిన విషయాలను చంద్రుడు నిర్ణయిస్తాడని చాలా మంది భావిస్తారు. సంతానోత్పత్తి, జీవితంలో ఎదుగుదల, మనకు సంబంధించిన సంబంధాలు వంటి వాటిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అంగారకుడు/కుజుడు/మంగళ

అంగారకుడు/కుజుడు/మంగళ

మార్స్ అనే గ్రహం కూడా నవగ్రహాల్లో ఒకటి. ఈ గ్రహాన్ని అంగారకుడు/కుజుడు/మంగళ గా పిలుస్తుంటారు. కుజుడు ప్రతి మనిషి జీవితంపై ప్రభావం చూపుతూనే ఉంటాడు. ఒక వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ, వ్యక్తిత్వం, ఆదర్శవాదాలకు సంబంధించిన అంశాలపై కుజుడి ప్రభావం ఉంటుంది.

బుధుడు

బుధుడు

బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగి ఉంటాడు. బుధుడికి నాలుగు భుజాలుంటాయి. ఈయన పీత వస్త్రాలను ధరించి ఉంటాడు. పసుపు పచ్చని మాలా ధారణ చేసి గధ, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. ఇక బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. విషయ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది.

బృహస్పతి

బృహస్పతి

నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం. ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహ ప్రభావం ఉంటే విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం ప్రభావం ఉన్నవారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారంట.

శుక్రుడు

శుక్రుడు

శుక్రుడు ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె, గుఱ్ఱము, మొసలను వాహనంగా కలిగి ఉంటాడు. అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాలు విడిపోవడం లేకుంటే తగాదాలు రావడం , బాగా కలిసి ఉండే వారి మధ్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితుల నుంచి శుక్రుడు రక్షిస్తాడంట. శుక్రుడు వృషభ, తులరాశులకు అధిపతి.

శని

శని

శని గ్రహం కూడా నవగ్రహాల్లో ఒకటి. సూర్యభగవానుడి పుత్రుడు శని. ఈయన భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.శని దేవుడి ప్రభావం ఉంటే చాలా వరకు అనుకున్న పనులు నెరవేరవు. శని దేవుడు ఎక్కు బాధలు పెడతాడు. అయితే శని దేవుడు మనల్ని ఎంతగా బాధ పెట్టినా, కష్టాలు పెట్టినా అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు. శని కుంభ, మకర రాశులకు అధిపతి.

రాహువు

రాహువు

రాహువును సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడుగా పేర్కొంటారు. రాహువు స్త్రీ గ్రహం. రాహుగ్రహం అపసవ్య మార్గంలో వెళ్తుంది. రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు ఎక్కువగా ఉంటాయి. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.

కేతువు

కేతువు

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడో స్థానంలో సంచరిస్తుంటారు. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.

English summary

the nine planets and their roles in your life

the nine planets and their roles in your life