For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ వారం రాశి ఫలాలు మే21 నుండి మే27 వరకు.

  |

  రాశి ఫలాల ఆధారంగా ఈ వారం మీ జీవితంలో ఎదురయ్యే లాభ నష్టాల గురించి తెలుసుకోండి :

  మనలో అధిక భాగం రాశి ఫలాలలో దినఫలాల కన్నా వార ఫలాల మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారు. క్రమంగా వారంలో ఎదురయ్యే లాభ నష్టాల మీద అంచనాలతో ప్రణాళికలను ఏర్పరచుకుంటూ ఉంటారు.

  ఈ వార ఫలాలు మొత్తం వారంలో మీ రాశిచక్రం గురించిన వివరాలను తెలియజేస్తాయి. ఈ రాశి ఫలాలు వారంలో మనం తీసుకునే నిర్ణయాల లాభనష్టాల గురించి వెల్లడిస్తుంది. మరియు ఒక కొత్త వ్యాపారo ప్రారంభించడానికి ఉత్తమ సమయాన్నితెలియజేస్తుంది .

  These Are Your Weekly Predictions, For 21st- 27th May

  సోమవారం ప్రారంభం కాగానే, మిగిలిన వారమంతా సులభతరంగా సాగాలని ఆశిస్తాం, నిజమే కదా ? కావున, మీ పనులు సజావుగా సాగడానికి ప్రణాళికలు సిద్దం చేసుకునేలా, మా జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం వారఫలాలను మీ ముందు ఉంచుతున్నాం.

  మీ రాశిచక్రం సంకేతాలు ఈ వారంలో మీకు సూచించే విధివిధానాలను తెలుసుకోండి. మీరు అదృష్టవంతులేనా లేక మీరు తెలుసుకోవలసిన, జాగ్రత్త పడవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా?

  మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

  మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

  మేష రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. వారు ఇతరులకు సహాయపడడంలో గొప్ప సంతృప్తిని పొందుతారు, మీ మార్గంలో ఎవరెన్ని ప్రతికూల ప్రభావాలను కలిగించినా, ఎటువంటి సమస్య లేకుండా ముందుకు దూసుకుని వెళ్తారు. అంతే కాకుండా, వారంలో పేదలకు సహాయం చేసే చర్యలపై దృష్టిని కేంద్రీకరిస్తారు.

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

  వృషభ రాశికి చెందిన వ్యక్తులకు ఈ వారం ఎంతో సంతోషంగా లాభదాయకంగా ఉంటుంది. కానీ వారం చివరిలో కొన్ని సరదా అంశాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. కావున కాస్త జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటుంది.కానీ జీవితంలోని చీకటి కోణాల నుండి కూడా వెలుగులు చూడగలిగే శక్తి ఈ రాశి వారికి లభిస్తుంది.

  మిధున రాశి : మే 21 - జూన్ 20

  మిధున రాశి : మే 21 - జూన్ 20

  మిధున రాశికి చెందిన వ్యక్తులు ఈ వారంలో ఆధ్యాత్మిక మరియు ప్రయోగాత్మక విషయాలనందు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వారంలో, తార్కిక సంబంధమైన బలమైన మద్దతును కూడగట్టుకుంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఈ వారం సాఫీగా జరుగుతుంది. ఖర్చుల విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వేయవలసి ఉంటుంది.

  కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

  కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

  కర్కాటక రాశి వారు ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్లో ఉంటే ఆ ప్రాజెక్ట్లోనే కొనసాగడం మంచిది, తద్వారా కొన్ని ఆశాజనక ఫలితాలను పొందగలరు. మరియు సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వారంలో, లక్ష్యసాధనలో ప్రణాళికలను తెలివిగా ఎంచుకోవలసి ఉంటుంది మరియు అవసరమైనప్పుడు కొన్ని విషయాల నందు రాజీపడాలి, కానీ అదే సమయంలో జీవితంలో కొన్ని ముఖ్యమైన సూత్రాలకు మరియు సమస్యల కై పట్టుబట్టి నిలబడడం అవసరం.

  సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

  సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

  సింహ రాశి వ్యక్తులు ఈ వారంలో అన్నిటా కేంద్రబిందువుగా వ్యవహరిస్తూ ఉంటారు మరియు వారు అసూయపడేవారి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఇతరులు సంతోషంగా ఉండడం కొందరు వ్యక్తులకు రుచించదని వారు అర్థం చేసుకోవాలి, అందువల్ల వారు తమ దారికి అడ్డుగా వస్తున్న ప్రతికూల ప్రభావాలపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మరోవైపు, వారి కుటుంబం, స్నేహితులు మరియు పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని పొందుతారు.

  కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

  కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

  కన్యా రాశి వ్యక్తులు ఈ వారమే కాదు నెలoతా సంతోషంగా శృంగారభరిత, సంతోషకర జీవితాన్ని పొందుతారు. వారు తమ భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు. మరోవైపు, తమ సామాజిక జీవనం నందు, వారి స్నేహితుల, కుటుంబ సభ్యుల నుండి పొందే మద్దతు, ప్రోత్సాహం వీరికి స్పూర్తిదాయకంగా ఉంటుంది.

  తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

  తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

  ఈ వారంలో తులా రాశి వ్యక్తులు ఉద్వేగభరితమైన తిరుగుబాటును ఎదుర్కొంటారు. కానీ వీరు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో వీరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఎటువంటి తిరుగుబాటునైనా, ప్రతికూల సమస్యలనైనా ఎదుర్కొనగలిగే వారిగా ఉంటారు. వీరు సృష్టించుకున్న విలువలతో కూడిన ప్రపoచానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ వారంలో, వీరు బాధ్యతతో మరియు నిబద్ధతతో కార్యసాధకులుగా లక్ష్యసాధనపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ వారం మీ భాగస్వామితో సమయం వెచ్చించడానికి అనుకూలంగా ఉంటుంది. వారం మొదట్లో అనూహ్యంగా బయట జరిగిన ఒక సంఘటన మీ ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీస్కుంటారు.

  వృశ్చిక రాశి : అక్టోబర్ 24 – నవంబరు 22

  వృశ్చిక రాశి : అక్టోబర్ 24 – నవంబరు 22

  వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం తమ తల్లిదండ్రులు, మరియు తమ ప్రియమైన వారిపట్ల దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈవారంలో, వారి ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు దారి తీయవచ్చు మరియు తమ అంతరాత్మను ఉద్దేశించి నడుచుకోవలసి ఉంటుంది. వారి సహజ శక్తి కన్నా అంతర్లీన శక్తి బలమైనది. ముఖ్యంగా వారి వృత్తి, స్థితి మరియు కుటుంబం గురించిన ఆలోచనలలో అంతర్గత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారం చివరిలో నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది.

  ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

  ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

  ధనుస్సు రాశి సంబంధించిన వ్యక్తులు వారి మానసిక ప్రశాంతత కోసం దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. వీరు ఈవారంలో తీసుకునే భవిష్యత్ అంశాల పట్ల నిర్ణయాలు తీసుకోడానికి ముందు గత జీవితంలోని సంఘటనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది, ఈవిధంగా ప్రణాళికలనందు ఎటువంటి తప్పులు దొర్లకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. మరోవైపు, వారు వారి అంతరాత్మతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. సమయానుసారం మానసిక ప్రశాంతతకై విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉంది.

  మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

  మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

  మకర రాశి వ్యక్తులకు, వారి వ్యాపారానికి సంతోషం కూడుకుని ఈ వారం ఉల్లాసభరితంగా ఉంటుంది. ఈ వారంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే అవకాశo లభిస్తుంది. మొత్తంమీద, ఇంటా, బయటా వీరికి ఎంటువంటి ప్రతికూల ప్రభావిత అంశాలు ఎదురుకాకుండా, ఆర్ధిక స్వావలంబన తోడై ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. మీ భాగస్వామితో సమయం వెచ్చించడానికి ఈ వారం మీకు అనువైన సమయంగా ఉంటుంది. మీ నిర్ణయాల పట్ల, మీ పట్ల మీ కుటుంబ సభ్యులు ఇచ్చే గౌరవానికి నిశ్చేష్టులవడం మీవంతు అవుతుంది.

  కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

  కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

  కుంభ రాశి వ్యక్తులకు, స్నేహం మరియు ప్రేమ అనే అంశాల మధ్య సమస్యలతో ఈ వారం అస్పష్టంగా ఉండవచ్చు. ఈ వారంలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి, వారితో మీ సమయం సంతోషంగా గడుస్తుంది. ప్రేమ మరియు స్నేహం సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి, కఠిన నిర్ణయాలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోండి. మీరు తీసుకునే ఎటువంటి కఠిన నిర్ణయమైనా మీ భవిష్యత్తులో కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని మరచిపోకండి. మీ కుటుంబ సభ్యుల మరియు మీ ప్రియమైన శ్రేయోభిలాషుల అండ మీకెప్పుడూ ఉంటుంది, కావున నిర్ణయాల పరంగా వారిని సంప్రదించడం ఎంతో ముఖ్యం, ఒక్కోసారి వారి నిర్ణయాలే మీకు కీలకంగా మారొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆలోచనలను విస్మరించకండి. ఎవరి తెలివినైతే మీరు తక్కువ అంచనా వేస్తారో, వారే మీకు మార్గదర్శకంగా కనిపించే సూచనలు ఉన్నాయి.

  మీన రాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

  మీన రాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

  మీన రాశి వ్యక్తులపై ఎక్కువగా ప్రజల దృష్టి పడుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరు తమ భావాలను అణిచిపెట్టుకోవలసిన సమయం ఇది, ఎటువంటి విషయాలైనా అంతర్గతంగా అంతరాత్మతో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. మరోవైపు, కొందరు చికాకు పెట్టే వ్యక్తులతో పోటీ పడవలసి ఉంటుంది. వృత్తి పరంగా మీ ఆలోచనా విధానానికి, జరుగుతున్న విధానానికి పొంతన కుదరక కాస్త అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఆద్యాత్మిక చింతన, ద్యానం వంటి వాటి ద్వారా మానసిక ప్రశాoతతను పొందగలరు.

  English summary

  These Are Your Weekly Predictions, For 21st- 27th May

  Most of us know that weekly predictions are as famous as the daily predictions, as most of us tend to check them before we start our week. These predictions reveal about the zodiac luck for the entire week. The pros and cons of the decisions that we make during the week is predicted as well.Weekly Predictions For 21st-27th May
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more